1. తపాలా శాఖ, 'ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్' (IPPB) ఖాతాదారులు బ్యాంకింగ్ సేవలను నిర్వహించుకునేందుకు వీలుగా "డాక్ పే" (DAK PAY) యాప్ ను కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖా మంత్రి 'రవిశంకర్ ప్రసాద్' ఆవిష్కరించిన తేదీ ? (నగదు పంపడం, క్యూఆర్ కోడ్ స్కానింగ్, వ్యాపారులకు చేసే చెల్లింపులు వంటి సేవలను ఖాతాదారులు డిజిటల్ గా పూర్తి చేయవచ్చు)
All the best by www.gkbitsintelugu.blogspot.com
(ఎ) 2020 డిసెంబర్ 15
(బి) 2020 డిసెంబర్ 16
(సి) 2020 డిసెంబర్ 17
(డి) 2020 డిసెంబర్ 18
2. 2020 డిసెంబర్ 14న జరిగిన అమెరికా ఎలెక్టోరల్ కాలేజీ వోటింగ్ లో కాబోయే అధ్యక్షుడు "జో బైడెన్", ప్రస్తుత అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' లకు వచ్చిన ఓట్లు వరుసగా ... ? (ఈ ఓట్లను అమెరికా చట్ట సభ 'కాంగ్రెస్' కు పంపిస్తారు. వచ్చే నెలలో అక్కడ వాటిని అధికారికంగా లెక్కిస్తారు)
(ఎ) 305, 233
(బి) 306, 232
(సి) 307, 231
(డి) 308, 230
3. వచ్చే ఏడాది జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న వ్యక్తి ?
(ఎ) బోరిస్ జాన్సన్
(బి) షేక్ హసీనా
(సి) ఏంజెలా మెర్కెల్
(డి) బెంజమిన్ నెతన్యాహు
4. నూతనంగా ఏర్పాటైన "డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం" గల జిల్లా ?
(ఎ) పశ్చిమ గోదావరి
(బి) విజయనగరం
(సి) వైఎస్సార్ కడప
(డి) అనంతపురం
5. 'శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం'-తిరుపతి పరిధిలోని విజయనగరం జిల్లా "గరివిడి" (GARIVIDI) లో రూ. 91.25 కోట్లతో నిర్మించిన పశువైద్య కళాశాలలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు అనుమతి లభించింది. మిగతా పశువైద్య కళాశాలల్లో ఉన్నట్లుగానే ఈ కళాశాలలో ఉండే మొత్తం సీట్లు ? (ప్రస్తుతం రాష్ట్రంలో 'తిరుపతి (చిత్తూరు జిల్లా), గన్నవరం (కృష్ణా జిల్లా), ప్రొద్దుటూరు (వైఎస్సార్ కడప)' లలో పశువైద్య కళాశాలలు ఉన్నాయి)
(ఎ) 80
(బి) 81
(సి) 82
(డి) 83
6. 'ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ' (APEPDCL) విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదులు చేయవలసిన టోల్ ఫ్రీ నంబర్ ?
(ఎ) 1902
(బి) 1912
(సి) 1942
(డి) 1907
7. మనదేశంలో రూ. 1 లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన రెండో ఫార్మా కంపెనీ మరియు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ స్థాయికి చేరిన తొలి సంస్థ ? (దేశం మొత్తమ్మీద మొదటి స్థానంలో 'సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్' ఉంది)
(ఎ) డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్
(బి) దివీస్ లేబొరేటరీస్
(సి) హెటిరో డ్రగ్స్ లిమిటెడ్
(డి) అరబిందో ఫార్మా లిమిటెడ్
8. ప్రపంచంలోనే అతిపెద్ద ఎనర్జీ ప్రాజెక్ట్ అయిన "హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్" (Hybrid Renewable Energy Park) ను గుజరాత్ లో నెలకొల్పనున్న 'విఘాకోట్' గ్రామం గల జిల్లా ? (ఈ ప్రాజెక్ట్ ను భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' 2020 డిసెంబర్ 15న వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసారు. 72,600 హెక్టార్ల భూమిలో సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పనున్నారు)
(ఎ) సూరత్
(బి) ఆనంద్
(సి) అహ్మదాబాద్
(డి) కచ్
9. భారత పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ లోక్ సభా పక్ష నేత ?
(ఎ) గులాం నబీ ఆజాద్
(బి) జైరామ్ రమేష్
(సి) మల్లికార్జున ఖర్గే
(డి) అధీర్ రంజన్ చౌదరి
10. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2020-21) రూ. 5 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ. 974 (19480%) ను మధ్యంతర డివిడెండుగా చెల్లించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఆ కంపెనీ పేరు ?
(ఎ) బైనరీ రిపబ్లిక్
(బి) మేజేస్కో లిమిటెడ్
(సి) విజువల్ బై సొల్యూషన్స్
(డి) తుడిప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్
కీ (GK TEST-86 DATE : 2020 DECEMBER 19)
1) ఎ 2) బి 3) ఎ 4) సి 5) సి 6) బి 7) బి 8) డి 9) డి 10) బి All the best by www.gkbitsintelugu.blogspot.com