Welcome To GK BITS IN TELUGU Blog
1. పేలాల తయారీలో వినియోగించే వరి వంగడం ? (PADDY SEED) [తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా రుద్రూర్ చెరుకు, వరి ప్రాంతీయ పరిశోధన కేంద్రంలో ఈ వంగడం పై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు]
E & OE (Errors & Omissions Expected)
(ఎ) ఆర్ డీ ఆర్ 1162
(బి) ఆర్ డీ ఆర్ 1199
(సి) ఆర్ డీ ఆర్ 1200
(డి) ఆర్ డీ ఆర్ 8702
2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎర్రచందనం ఎగుమతుల గడువును ఏ తేదీ వరకు పొడిగిస్తూ 'కేంద్ర వాణిజ్య శాఖ' 2021 మార్చ్ 11న ఉత్తర్వులు జారీచేసింది ?
(ఎ) 2021 మార్చ్ 31
(బి) 2021 జూన్ 30
(సి) 2021 డిసెంబర్ 31
(డి) 2022 మార్చ్ 31
3. వరి పంటకు అనువైన భూముల గుర్తింపు, పంట పర్యవేక్షణ, వాతావరణంలోని గాలుల వాస్తవిక స్థితిని గుర్తించేందుకు 'ఇస్రో' (ISRO) మరియు 'జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ ప్లొరేషన్ ఏజెన్సీ' (JAXA) లు ఒప్పందం కుదుర్చుకోనున్న తేదీ ? [2024లో రోబోటిక్ చంద్రమండల యాత్ర (LUPEX), చంద్రుని దక్షిణ ధ్రువ అన్వేషణల కోసం పంపే రోవర్, ల్యాండర్ ల తయారీలోనూ ఇరు సంస్థల సాంకేతికతను సమన్వయపరచనున్నారు]
(ఎ) 2021 మార్చ్ 10
(బి) 2021 మార్చ్ 11
(సి) 2021 మార్చ్ 12
(డి) 2021 మార్చ్ 13
4. 'నీట్ యూజీ - 2021' (NEET (UG) - 2021) పరీక్షను ఏ తేదీన నిర్వహించనున్నట్లు 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ' (NTA) ప్రకటించింది ? ['ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్' కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు]
(ఎ) 2021 జూన్ 1
(బి) 2021 జూలై 1
(సి) 2021 ఆగస్ట్ 1
(డి) 2021 సెప్టెంబర్ 1
5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 'ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్' (IFS) కు ఎంపికైన తొలి మహిళ ? [1980లో మొట్టమొదట ఈ రంగంలోకి ప్రవేశించిన ముగ్గురు మహిళల్లో ఈమె కూడా ఒకరు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రంగంలో పనిచేసిన ఉద్యోగినుల సేవలపై "గ్రీన్ క్వీన్స్ ఆఫ్ ఇండియా-నేషన్స్ ప్రైడ్" (THE GREEN QUEENS OF INDIA - A NATION'S PRIDE) అనే పుస్తకాన్ని 'ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అసోసియేషన్' విడుదల చేసింది]
(ఎ) సీఎస్ రామలక్ష్మి
(బి) ఎం.రేవతి
(సి) జ్యోతి తుల్లిమెల్లి
(డి) సి.సువర్ణ
6. 2020వ సంవత్సరానికి సంబంధించి తెలుగు భాష నుంచి 'కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం' (SAHITYA AKADEMI AWARDS - 2020) నకు ఎంపికైన "అగ్నిశ్వాస" కవితా సంకలనం (2015-17) రచయిత ?
(ఎ) నిఖిలేశ్వర్
(బి) ఎండ్లూరి మానస
(సి) కన్నెగంటి అనసూయ
(డి) పెనుగొండ లక్ష్మీనారాయణ
7. 2020వ సంవత్సరానికి సంబంధించి తెలుగు భాష నుంచి 'సాహిత్య అకాడమీ యువ పురస్కార్' (SAHITYA AKADEMI AWARDS - 2020) నకు ఎంపికైన "మిళింద" చిరు కథల పుస్తకం రచయిత ?
(ఎ) నిఖిలేశ్వర్
(బి) ఎండ్లూరి మానస
(సి) కన్నెగంటి అనసూయ
(డి) పెనుగొండ లక్ష్మీనారాయణ
8. 2020వ సంవత్సరానికి సంబంధించి తెలుగు భాష నుంచి 'బాల సాహిత్య పురస్కారం' (SAHITYA AKADEMI AWARDS - 2020) నకు ఎంపికైన "స్నేహితులు" చిరు కథల పుస్తకం రచయిత ?
(ఎ) నిఖిలేశ్వర్
(బి) ఎండ్లూరి మానస
(సి) కన్నెగంటి అనసూయ
(డి) పెనుగొండ లక్ష్మీనారాయణ
9. 'ప్రాదేశిక సైన్యం' (TA) లో కెప్టెన్ గా నియమితులైన తొలి మంత్రిగా నిలిచిన కేంద్ర మంత్రి "అనురాగ్ ఠాకుర్" (ANURAG THAKUR) ఏ రాష్ట్రానికి చెందినవారు ? [2016 జూలై లో 'టీఏ' (TA) లోకి 'లెఫ్టినెంట్' (LIEUTENANT) గా నియమితులయ్యారు. తాజాగా ఆయన '124 సిక్కు రెజిమెంట్' లోకి 'కెప్టెన్' గా పదోన్నతి పొందారు]
(ఎ) ఉత్తరాఖండ్
(బి) హిమాచల్ ప్రదేశ్
(సి) హరియాణ
(డి) పంజాబ్
10. పురుషుల సింగిల్స్ లో అత్యధిక వారాలు ప్రపంచ నంబర్ వన్ ఆటగాడిగా ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసిన టెన్నిస్ ఆటగాడు ? [ఇప్పటివరకూ అతను ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంతో 311 వారాలు గడిపాడు. అతను ఆరోసారి అగ్రస్థానంతో ఏడాదిని ముగించి గతంలో 'పీట్ సంప్రాస్' నెలకొల్పిన రికార్డును సమం చేశాడు]
(ఎ) రోజర్ ఫెదరర్
(బి) రఫెల్ నాదల్
(సి) నొవాక్ జకోవిచ్
(డి) ఇవాన్ లెండిల్
కీ (KEY) (GK TEST-40 DATE : 2021 MARCH 8)
1) డి 2) సి 3) బి 4) సి 5) ఎ 6) ఎ 7) బి 8) సి 9) బి 10) సి E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి