1. గ్రీన్ కార్డు (GREEN CARD) ల జారీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ అమెరికా అధ్యక్షుడు 'జో బైడెన్' నిర్ణయం తీసుకున్న తేదీ ?
E & OE (Errors & Omissions Expected)
(ఎ) 2021 ఫిబ్రవరి 22
(బి) 2021 ఫిబ్రవరి 23
(సి) 2021 ఫిబ్రవరి 24
(డి) 2021 ఫిబ్రవరి 25
2. ఇంజినీరింగ్, వైద్య విద్యను మాతృభాషలో చదవడానికి 42 శాతం మంది విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నట్లు ఇటీవల తాము జరిపిన సర్వేలో వెల్లడైందని తెలిపిన 'అఖిలభారత సాంకేతిక విద్యామండలి' (AICTE) చైర్మన్ ?
(ఎ) డాక్టర్ పంకజ్ మిట్టల్
(బి) ఆచార్య కె.శివరామకృష్ణ
(సి) డాక్టర్ తిరువసాగం గణపతి
(డి) ప్రొఫెసర్ అనిల్ దత్తాత్రేయ సహస్రబుధే
3. అమెరికా మొదటిసారిగా ప్రకటించిన 'అంతర్జాతీయ అవినీతి నిరోధక ఛాంపియన్స్ అవార్డు' (INTERNATIONAL ANTI-CORRUPTION CHAMPIONS AWARD) కు ఎంపికైన భారతీయ సామాజికసేవా కార్యకర్త ?
(ఎ) అంజలీ భరద్వాజ్
(బి) నారపరాజు శ్రావణి
(సి) తోట అనూష
(డి) అపర్ణా కుమార్
4. 'జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం' (MGNREGA) లో 2021-22 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన పనిదినాలు ? [ఈ పనిదినాలను వినియోగించుకున్నాక రెండో దశలో అదనపు కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చింది]
(ఎ) 15 కోట్లు
(బి) 20 కోట్లు
(సి) 25 కోట్లు
(డి) 30 కోట్లు
5. 2021 ఫిబ్రవరి 25న తుదిశ్వాస విడిచిన ప్రముఖ అభ్యుదయ రచయిత, విమర్శకుడు "సింగమనేని నారాయణ" రచించిన మొదటి కథ ?
(ఎ) ఆదర్శాలు-అనుబంధాలు
(బి) అనురాగానికి హద్దులు
(సి) ఎడారి గులాబీ
(డి) న్యాయం ఎక్కడ
6. ఏ తేదీ నుంచి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కచ్చితంగా పాటించాలని భారత్, పాకిస్థాన్ దేశాల 'సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరళ్ల' (DGMO) భేటీలో నిర్ణయించారు ?
(ఎ) 2021 ఫిబ్రవరి 22
(బి) 2021 ఫిబ్రవరి 23
(సి) 2021 ఫిబ్రవరి 24
(డి) 2021 ఫిబ్రవరి 25
7. 'ఐ ఆర్ సీ టీ సీ' (IRCTC) లో రైలు టికెట్ కోసం ప్రయత్నించినప్పుడు 'వెయిటింగ్ లిస్ట్' ఉంటే, ప్రత్యామ్నాయంగా ఆ మార్గంలో అందుబాటులో ఉన్న బస్సు సర్వీసులను సులభంగా బుక్ చేసుకునేందుకు వీలుగా 'ఐ ఆర్ సీ టీ సీ' (IRCTC) తో ఒప్పందం కుదుర్చుకున్న ఆన్ లైన్ ఇ-టికెటింగ్ సేవల సంస్థ ?
(ఎ) మేక్ మై ట్రిప్
(బి) అభిబస్
(సి) రెడ్ బస్
(డి) ట్రావెల్ గురు
8. "ఆనరరీ ఫెలో ఆఫ్ సాహిత్య అకాడమీ" (HONORARY FELLOW OF SAHITYA AKADEMI) కి ఎంపికైన ప్రముఖ రచయిత, అనువాదకుడు, సాహితీవేత్త ? [మన దేశ సాహిత్యరంగంలో అరుదైన గౌరవానికి ఎంపికైన 14వ వ్యక్తిగా, తొలి భారతీయుడిగా ఇతను గుర్తింపు పొందారు]
(ఎ) వీ.ఎస్.నైపాల్
(బి) ప్రొఫెసర్ డేనియల్ హెచ్ హెచ్ ఇంగాల్స్
(సి) డాక్టర్ చంద్రశేఖర్ కంబార్
(డి) వేల్చేరు నారాయణరావు
9. భారతదేశ ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ ?
(ఎ) విజయానంద్
(బి) సుశీల్ చంద్ర
(సి) సునీల్ అరోడా
(డి) రాజీవ్ కుమార్
10. 2021 మార్చ్ 2 నుంచి 2021 మే 2 వరకు వివిధ దశలలో ఎన్నికలు జరగనున్న 'పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి' లలో గల అసెంబ్లీ స్థానాలు వరుసగా .. ?
(ఎ) 293, 233, 139, 125, 29
(బి) 294, 234, 140, 126, 30
(సి) 295, 235, 141, 127, 31
(డి) 296, 236, 142, 128, 32
కీ (KEY) (GK TEST-30 DATE : 2021 FEBRUARY 26)
1) సి 2) డి 3) ఎ 4) బి 5) డి 6) డి 7) బి 8) డి 9) సి 10) బి E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి