ఈ బ్లాగును సెర్చ్ చేయండి

28, మార్చి 2021, ఆదివారం

GK TEST-45 YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

Welcome To GK BITS IN TELUGU Blog

1. 'దిల్లీ ప్రభుత్వమంటే లెఫ్టినెంట్ గవర్నరే' బిల్లు (దిల్లీ జాతీయ రాజధాని ప్రాంత ప్రభుత్వం' సవరణ బిల్లు-2021) ను లోక్ సభ ఆమోదం తెలిపిన తేదీ ? 
(ఎ) 2021 మార్చ్ 21 
(బి) 2021 మార్చ్ 22  
(సి) 2021 మార్చ్ 23  
(డి) 2021 మార్చ్ 24 

2. అమెరికా నౌకాదళంలో చీఫ్ పెట్టీ ఆఫీసర్ గా నియమితులైన తొలి మహిళ "లొరెట్టా పర్ఫెక్టస్ వాల్ష్" గౌరవార్ధం 'యూఎస్ఎస్ కాన్స్టిట్యూషన్' (USS CONSTITUTION) అనే యుద్ధనౌకలోని ఒక భారీ తుపాకీకి పెట్టిన పేరు ? [ఆమె 1917 మార్చ్ 21న నౌకాదళ చీఫ్ పెట్టీ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు. 'మహిళా మాసం' ను పురస్కరించుకొని 2021 మార్చ్ 22న బోస్టన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పేరును ఖరారు చేశారు. 'యూఎస్ఎస్ కాన్స్టిట్యూషన్' .. ప్రపంచంలోనే అత్యంత పురాతన యుద్ధ నౌక. 1797 నుంచి 1855 వరకూ అది సేవలు అందించింది. ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్న ఈ నౌక .. ఓటమి ఎరుగదు]   
(ఎ) లొరెట్టా  
(బి) పర్ఫెక్టస్    
(సి) వాల్ష్  
(డి) లొరెట్టా వాల్ష్ 

3. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి ఎన్ని సంవత్సరాలకు పెంచింది ? [30 శాతం ఫిట్మెంట్ తో వేతన సవరణ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి 'కేసీఆర్' శాసనసభలో ప్రకటించారు]  
(ఎ) 59  
(బి) 60 
(సి) 61 
(డి) 62 



4. 2019లో తెరకెక్కిన ఉత్తమ చిత్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2021 మార్చ్ 22న ప్రకటించిన 67వ జాతీయ పురస్కారాల్లో .. "జాతీయ ఉత్తమ చిత్రం" గా నిలిచినది ? [గతేడాది మేలో ప్రకటించాల్సిన ఈ పురస్కారాలు 'కరోనా' కారణంగా వాయిదా పడ్డాయి. దాదాపు ఏడాది ఆలస్యంగా దర్శకనిర్మాత 'ఎన్.చంద్ర' నేతృత్వంలోని జ్యూరీ పురస్కారాలను ప్రకటించింది]  
(ఎ) మరక్కర్ : అరబికడలింటె సింహం (మలయాళం)   
(బి) మహర్షి (తెలుగు) 
(సి) భోంస్లే (హిందీ) 
(డి) అసురన్ (తమిళం) 

5. 2019లో తెరకెక్కిన ఉత్తమ చిత్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2021 మార్చ్ 22న ప్రకటించిన 67వ జాతీయ పురస్కారాల్లో .. "జాతీయ ఉత్తమ నటుడు" గా నిలిచినది ? 
(ఎ) మోహన్ లాల్ (మరక్కర్ : అరబికడలింటె సింహం)   
(బి) ధనుష్ (అసురన్)  
(సి) మనోజ్ బాజ్ పాయ్ (భోంస్లే)   
(డి) ధనుష్ (అసురన్) మరియు మనోజ్ బాజ్ పాయ్ (భోంస్లే)  

6. 2019లో తెరకెక్కిన ఉత్తమ చిత్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2021 మార్చ్ 22న ప్రకటించిన 67వ జాతీయ పురస్కారాల్లో .. "జాతీయ ఉత్తమ వినోదాత్మక చిత్రం" గా నిలిచినది ? [ఈ చిత్రంలో రైతుల సమస్యలను కళ్లకుకడుతూ వ్యవసాయరంగ ప్రాధాన్యాన్ని చర్చించారు]
(ఎ) ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) 
(బి) మహర్షి 
(సి) సాహో  
(డి) వినయ విధేయ రామ 



7. 2019లో తెరకెక్కిన ఉత్తమ చిత్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2021 మార్చ్ 22న ప్రకటించిన 67వ జాతీయ పురస్కారాల్లో .. "ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)" గా నిలిచినది ? [ప్రాణం పోతున్నా లక్ష్య సాధన కోసం తపించిన ఓ తండ్రి కథతో తెరకెక్కినదీ చిత్రం] 
(ఎ) సైరా నరసింహారెడ్డి 
(బి) జెర్సీ 
(సి) గద్దలకొండ గణేష్ 
(డి) ఇస్మార్ట్ శంకర్ 

8. 2019లో తెరకెక్కిన ఉత్తమ చిత్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2021 మార్చ్ 22న ప్రకటించిన 67వ జాతీయ పురస్కారాల్లో .. "జాతీయ ఉత్తమ నటి" గా నిలిచినది ?   
(ఎ) విద్యా బాలన్   
(బి) భూమి పెడ్నేకర్  
(సి) ప్రియాంక చోప్రా 
(డి) కంగనా రనౌత్  

9. కడక్ నాథ్ కోడి మాంసానికి మార్కెట్ లో ఉన్న డిమాండు దృష్ట్యా .. కడప జిల్లాలోని ఏ గ్రామంలోని మూతపడిన పౌల్ట్రీ ఫామ్ ను పునరుద్ధరించాలనే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' అంగీకారం తెలిపారు ?
(ఎ) శ్రీరంగరాజపురం 
(బి) రాజంపేట 
(సి) ఊటుకూరు  
(డి) మన్నూరు  



10. 2021 మార్చ్ 19న పదవీ బాధ్యతలు స్వీకరించడం ద్వారా "సమియా సులుహు హాసన్" ఏ దేశ చరిత్రలో మొదటిసారిగా ఒక మహిళ అధ్యక్ష్య పదవిని చేపట్టినట్లయింది ? [అధ్యక్షుడు 'జాన్ మగుపులి' ఆకస్మిక మరణంతో ఆమె ఈ బాధ్యతలు చేపట్టారు] 
(ఎ) కెన్యా 
(బి) ఉగాండా 
(సి) టాంజానియా 
(డి) రువాండా              

కీ (KEY) (GK TEST-45 YEAR : 2021)
1) బి    2) బి    3) సి    4) ఎ    5) డి    6) బి    7) బి    8) డి    9) సి    10) సి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి