ఒక జిల్లా - ఒక ఉత్పత్తి : భారత ప్రభుత్వ కార్యక్రమం
(ONE DISTRICT ONE FOCUS PRODUCE : GOVT. OF INDIA PROGRAMME)
- దేశంలోని ప్రతి జిల్లాను ఎగుమతి కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో "ఒక జిల్లా - ఒక ఉత్పత్తి" పథకం పేరుతో అన్ని రాష్ట్రాల్లో కార్యాచరణకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది.
- ఉత్తర్ ప్రదేశ్ లో ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు దేశమంతటా విస్తరిస్తోంది.
- దేశవ్యాప్తంగా పంటల సాగును వర్గీకరించి డిమాండ్-సరఫరాల మధ్య సమతుల్యం పాటించాలన్న ఉద్దేశంతో ప్రతి జిల్లాలో ఒక పంట సాగుపై దృష్టి సారించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా దేశంలోని 728 జిల్లాలను విభజించింది.
- వ్యవసాయం, ఉద్యానం, పశుసంవర్ధకం, కోళ్ల పరిశ్రమ, పాలు, చేపలు, సముద్ర ఉత్పత్తుల వారీగా వీటిని వర్గీకరించింది.
- అత్యధికంగా పండ్ల సాగుకు 226 జిల్లాలను, కూరగాయల పంటలకు 107, మసాలా దినుసుల సాగుకు 105 జిల్లాలను ఎంపిక చేసింది.
- వరి సాగు కోసం 40 జిల్లాలను ఎంపిక చేసింది. ధాన్యాగారంగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క జిల్లానూ వరి సాగుకు కేటాయించలేదు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రెండేసి జిల్లాలను మిర్చి, పసుపు, మామిడి పంటల కోసం ఎంపిక చేశారు. మిగతా జిల్లాలన్నింటిలోనూ ఒక్కో పంటకే ప్రాధాన్యం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'ఏ జిల్లాలో ఏ పంట ?'
| వరుస సంఖ్య | జిల్లా | పంట |
| 1 | అనంతపురం | వేరుశెనగ |
| 2 | చిత్తూరు | టమాటా |
| 3 | తూర్పు గోదావరి | కొబ్బరి |
| 4 | గుంటూరు | మిర్చి, పసుపు |
| 5 | కడప | అరటి |
| 6 | కృష్ణా | మామిడి |
| 7 | కర్నూలు | ఉల్లి |
| 8 | నెల్లూరు | నిమ్మ |
| 9 | ప్రకాశం | పసుపు, మిర్చి |
| 10 | శ్రీకాకుళం | జీడిపప్పు |
| 11 | విశాఖపట్నం | చెరకు |
| 12 | విజయనగరం | మామిడి |
| 13 | పశ్చిమ గోదావరి | ఆక్వా |
- రాష్ట్ర ప్రభుత్వాలు, భారత వ్యవసాయ పరిశోధన మండలి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత ఈ జాబితాను ఖరారు చేసినట్లు 'కేంద్ర వ్యవసాయ శాఖ' 2021 ఫిబ్రవరి 27న పేర్కొంది.
- కేంద్ర ప్రభుత్వ పథకాలతో మిళితం చేసి ఆయా జిల్లాల్లో ఆ పంటల సాగును ప్రోత్సహిస్తారు.
- ఈ విధానంతో రైతులకు మేలు కలుగుతుందని, పంట ఉత్పత్తులకు తగిన విలువను జోడించి ఎగుమతులు పెంచుకోవడానికి వీలవుతుందని వ్యవసాయ శాఖ అభిప్రాయపడింది.
- పంట విలువను పెంచడం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచడమే ఈ విధానం లక్ష్యమని పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రం (TELANGANA STATE) :
- తెలంగాణ లోని 33 జిల్లాల్లో 12 పంటలపై దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
- అత్యధికంగా 6 జిల్లాల్లో మిర్చి, 4 జిల్లాల్లో తినడానికి సిద్ధంగా ఉండే స్నాక్స్ (READY TO EAT SNACKS), మూడేసి జిల్లాల్లో సోయాబీన్, మామిడి, వరి, వేరుశెనగ, పాల ఆధారిత ఉత్పత్తులు, కూరగాయలు పండించాలని పేర్కొంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి