Welcome To GK BITS IN TELUGU Blog
1. పార్లమెంటు ఉభయసభల ప్రసారాల కోసం ప్రస్తుతం వేర్వేరుగా నిర్వహిస్తున్న లోక్ సభ, రాజ్య సభ టీవీలను విలీనం చేసి "సంసద్ టీవీ" (SANSAD TV) గా నామకరణం చేశారు. ఈ కొత్త వ్యవస్థకు ఏడాదిపాటు 'సీ ఈ ఓ' (CEO) గా నియమితులైన విశ్రాంత ఐఏఎస్ అధికారి ?
E & OE (Errors & Omissions Expected)
(ఎ) రవి కపూర్
(బి) డాక్టర్ సమిరన్ పాండా
(సి) దువ్వూరి సుబ్బారావు
(డి) డాక్టర్ వై.వి.రెడ్డి
2. నాడీ వ్యవస్థపై ప్రభావం చూపించే విషం 'నొవిచోక్' (NOVICHOK) ను ప్రతిపక్ష నేత "అలెక్సీ నావల్నీ" (ALEXEI NAVALNY) పై ప్రయోగించిన దేశం ?
(ఎ) అమెరికా
(బి) రష్యా
(సి) క్యూబా
(డి) ఈజిప్ట్
3. ఇస్లామిక్ బోధకుడైన యువనేత అబ్బాస్ సిద్దీఖి 'ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్' (ISF) పేరుతో రాజకీయ పార్టీని ఏ రాష్ట్రంలో స్థాపించారు ?
(ఎ) అసోం
(బి) పశ్చిమ బెంగాల్
(సి) తెలంగాణ
(డి) తమిళనాడు
4. ఏ రాష్ట్రం కేంద్రంగా 'రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్' (RGIDS) పనిచేస్తోంది ?
(ఎ) ఉత్తర్ ప్రదేశ్
(బి) కేరళ
(సి) తమిళనాడు
(డి) మహారాష్ట్ర
5. 'ఇండో - పాక్ ఎక్స్ ప్రెస్' (INDO-PAK EXPRESS) గా పేరున్న భారత ఆటగాడు 'రోహన్ బోపన్న', పాకిస్థాన్ క్రీడాకారుడు 'ఐసాముల్ హక్ ఖురేషి' లు కలిసి ఈ నెల 15న ప్రారంభమయ్యే ఒక టోర్నీలో ఆడనున్నారు. ఆ టోర్నీ పేరు ? [ఆరేళ్ల విరామం తర్వాత ఈ క్రీడాకారులిద్దరూ కలిసి ఆడుతున్నారు]
(ఎ) మెక్సికో ఏటీపీ 500 టోర్నీ
(బి) షెన్ జెన్ ఏటీపీ 250 టోర్నీ
(సి) ఖతార్ ఓపెన్
(డి) బీ ఎన్ పీ పారిబాస్ ఓపెన్
6. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక 'మమ్మీ' (MUMMY) ఏ రాష్ట్ర ఆర్కియాలజీ మ్యూజియంలో ఉంది ? [ఈ మమ్మీ 2500 సంవత్సరాల కిందటి 'ఈజిప్టు' లోని టోలెమీ రాజవంశానికి చెందిన యువరాణి 'నిషూహూ' కి చెందినది]
(ఎ) కేరళ
(బి) కర్ణాటక
(సి) తెలంగాణ
(డి) తమిళనాడు
7. ఎన్ని రైతు భరోసా కేంద్రాలకు ఒక 'ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం' (PACS) చొప్పున ఉండేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' 2021 మార్చ్ 3న అధికారులను ఆదేశించారు ?
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4
8. 2021 మార్చ్ 3న చిత్తూరు జిల్లా శ్రీసిటీ లో శంకుస్థాపన చేసిన మెట్రోరైలు బోగీల తయారీ కంపెనీ 'సీ ఆర్ ఆర్ సీ ఇండియా' యొక్క మాతృ సంస్థ అయిన 'సీ ఆర్ ఆర్ సీ' కంపెనీ స్వదేశం ?
(ఎ) అమెరికా
(బి) దక్షిణ కొరియా
(సి) చైనా
(డి) జర్మనీ
9. పునరుత్పాదక ఇంధన సహకారం కోసం మన దేశం ఏ దేశంతో ఈ ఏడాది జనవరిలో కుదుర్చుకున్న 'అవగాహన ఒప్పందానికి' (MOU) కేంద్ర మంత్రివర్గం 2021 మార్చ్ 3న కార్యోత్తర ఆమోదం తెలిపింది ? [2030 నాటికి ఈ రంగం ద్వారా 450 గిగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలన్న లక్ష్యానికి ఈ 'ఎంఓయూ' దోహదపడుతుంది]
(ఎ) అమెరికా
(బి) రష్యా
(సి) ఇజ్రాయెల్
(డి) ఫ్రాన్స్
10. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ దేశంలోని 111 నగరాల్లోని పరిస్థితుల్ని మదింపు చేసి .. 2019-20వ సంవత్సరానికి ప్రకటించిన "సులభతర జీవన సూచిక" (EASE OF LIVING INDEX) లో నాలుగో స్థానంలో ఉన్న నగరం ? [ర్యాంకుల నిర్ధారణలో ప్రజాభిప్రాయానికి 30%, 13 కొలమానాల పరిధిలోని 49 సూచికలకు 70% వెయిటేజీ ఇచ్చారు]
(ఎ) విశాఖపట్నం
(బి) విజయవాడ
(సి) కాకినాడ
(డి) తిరుపతి
కీ (KEY) (GK TEST-35 DATE : 2021 MARCH 3)
1) ఎ 2) బి 3) బి 4) బి 5) ఎ 6) సి 7) సి 8) సి 9) డి 10) సి E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి