ఈ బ్లాగును సెర్చ్ చేయండి

4, మార్చి 2021, గురువారం

PSLV - C51

ధ్రువ ఉపగ్రహ ప్రయోగ వాహకనౌక - సి51 (పీ ఎస్ ఎల్ వీ - సి51)
(POLAR SATELLITE LAUNCH VEHICLE-C51) (PSLV-C51)


  • 'భారత అంతరిక్ష పరిశోధన సంస్థ' (ISRO) ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైంది.
  • 50 ఏళ్ల 'ఇస్రో' (ISRO) చరిత్రలో తొలిసారిగా దేశీయ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపింది.
  • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ లోని మొదటి ప్రయోగవేదిక నుంచి 2021 ఫిబ్రవరి 28న ఉదయం 10 గంటల 24 నిముషాలకు 'పీ ఎస్ ఎల్ వీ - సి51' (PSLV-C51) నింగిలోకి దూసుకెళ్లింది.
  • బ్రెజిల్ కు చెందిన అమెజానియా-1(AMAZONIA-1) తో పాటు, మనదేశానికి చెందిన ఐదు, అమెరికాకు చెందిన 13 మైక్రో ఉపగ్రహాలను 'పీ ఎస్ ఎల్ వీ - సి51' (PSLV-C51) నింగిలోకి మోసుకెళ్లింది.
  • వాహకనౌక ['పీ ఎస్ ఎల్ వీ - సి51' (PSLV-C51)] నింగిలోకి బయలుదేరిన 17 నిముషాల తర్వాత బ్రెజిల్ కు చెందిన 637 కిలోల బరువు గల అమెజానియా-1 (AMAZONIA-1) విడిపోయి నిర్ధారిత కక్ష్యలోకి చేరింది. తర్వాత మరో 1.51 నిముషాలకు మిగిలిన 18 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టారు.
  • బ్రెజిల్ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మొట్టమొదటి భూ పరిశీలన ఉపగ్రహం "అమెజానియా-1" (AMAZONIA-1). ఇది అమెజాన్ ప్రాంతంలో అటవీ సంపదను పర్యవేక్షించడానికి, బ్రెజిలియన్ భూభాగం అంతటా వైవిధ్యభరితమైన వ్యవసాయ విశ్లేషణ కోసం రిమోట్ సెన్సింగ్ డేటాను అందిస్తుంది.
  • అమెరికా పంపిన 13 మైక్రో ఉపగ్రహాలలో ఒకటి సాంకేతిక ప్రదర్శన ఉపగ్రహం కాగా మరో రెండు ఉపగ్రహ సమాచార మార్పిడి, డేటా రిలే కోసం ఉన్నవి.
  • భారతదేశానికి చెందిన 5 ఉపగ్రహాల్లో 'స్పేస్ కిడ్జ్ ఇండియా' (SPACE KIDZ INDIA) రూపకల్పన చేసిన 'సతీశ్ ధవన్ శాట్' (SDSAT = Satish Dhawan Sat) రేడియేషన్ స్థాయి, అంతరిక్ష వాతావరణ అధ్యయనంతో పాటు సుదూర కమ్యూనికేషన్ టెక్నాలజీలకు ఉపయోగపడుతుంది. ఉపగ్రహంతో పాటు ప్రధాని మోదీ ఫొటో, భగవద్గీత పుస్తకం, 25 వేల మంది పేర్లు ఉంచారు. ఈ ఉపగ్రహం 530 కిలోమీటర్ల ఎత్తులో 'సన్ సింఖ్రనస్' కక్ష్యలోకి చేరింది.  
  • మూడు కళాశాలల విద్యార్థులు రూపొందించిన మూడు ఉపగ్రహాల కలయిక 'యూనిటీ శాట్' (UNITYsat) రేడియో రిలే సేవలు అందిస్తుంది.

"సింధునేత్ర" (ఆర్-శాట్) (SINDHU NETRA) (R-SAT):

  • 'పీ ఎస్ ఎల్ వీ - సి51' (PSLV-C51) ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాల్లో 'రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ' (DRDO) నిధులు సమకూర్చగా, బెంగళూరులోని 'పీ ఈ ఎస్ విశ్వవిద్యాలయం' (PES UNIVERSITY) కు చెందిన మహిళా శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు తుదిరూపునిచ్చిన "సింధునేత్ర" (ఆర్-శాట్) (SINDHU NETRA) (R-SAT) కూడా ఉంది.
  • హిందూ మహాసముద్ర ప్రాంతంలో సైనిక, మర్చంట్ నేవీ నౌకల కార్యకలాపాలపై "సింధునేత్ర" (ఆర్-శాట్) (SINDHU NETRA) (R-SAT) నిఘా పెడుతుంది. ఇది భారతదేశ వ్యూహాత్మక, వాణిజ్య ప్రయోజనాలకు కీలకమని రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
  • సముద్ర తీరంలో గస్తీ కాస్తూ శత్రు దేశ నౌకల సమాచారాన్ని మన అధికారులకు చేరవేయడం "సింధునేత్ర" (ఆర్-శాట్) (SINDHU NETRA) (R-SAT) పని.  


  • హిందూ మహాసముద్రంలో నౌకల కదలికలను గుర్తించేందుకు కొన్ని ఉపగ్రహాలను రూపొందించేందుకు భారత్, ఫ్రాన్స్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి