Welcome To GK BITS IN TELUGU Blog
1. 'ఐరాస' (UNO) విడుదల చేసిన "ప్రపంచ ఆనంద నివేదిక-2021" (WORLD HAPPINESS REPORT-2021) ప్రకారం .. అత్యంత సంతోషకర దేశాలలో మొదటి ఐదు స్థానాలలో ఉన్నవి వరుసగా ... ? [ఈ జాబితాలో 'అమెరికా : 14, చైనా : 19, భారత్ : 139' స్థానాలలో ఉన్నాయి]
E & OE (Errors & Omissions Expected)
(ఎ) ఐస్ లాండ్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్
(బి) ఫిన్లాండ్, ఐస్ లాండ్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్
(సి) డెన్మార్క్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, ఐస్ లాండ్
(డి) స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, ఐస్ లాండ్, డెన్మార్క్
2. కార్పొరేట్, వ్యవసాయేతర 'ఎంఎస్ఎంఈ' (MSME) లకు పది లక్షల రూపాయల వరకు రుణాలు అందించేందుకు "ప్రధానమంత్రి ముద్ర యోజన" (PMMY) పథకాన్ని ప్రధాని 'నరేంద్ర మోదీ' ప్రారంభించిన తేదీ ? [ఈ రుణాలను ప్రధానంగా 'సేవ, తయారీ, రిటైల్, వ్యవసాయ' రంగాల్లో ఆదాయంతోపాటు ఉపాధినీ కల్పించే విధంగా భిన్న ప్రయోజనాలకోసం విస్తరించారు. దీన్ని మూడు విభాగాలుగా విభజించారు. మొదటిది రూ. 50,000 లోపు రుణాలకు సంబంధించి "శిశు" విభాగం. రెండోది రూ. 5,00,000 వరకు రుణాలకు సంబంధించి "కిశోర్ ఉత్పత్తి" విభాగం. మూడోది రూ. 10,00,000 వరకు రుణాలకు సంబంధించి "తరుణ్ ఉత్పత్తి" విభాగం]
(ఎ) 2015 ఏప్రిల్ 5
(బి) 2015 ఏప్రిల్ 6
(సి) 2015 ఏప్రిల్ 7
(డి) 2015 ఏప్రిల్ 8
3. కాలుష్యపరంగా, ఆర్థికంగా భారంగా మారిన పాత వాహనాలను తుక్కు కింద మార్చే 'స్క్రాపింగ్ విధానం' (VEHICLE SCRAPPAGE POLICY) ను కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి 'నితిన్ గడ్కరీ' పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకటించిన తేదీ ? [15 ఏళ్ల పైబడిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్ల పైబడిన ప్రైవేటు వాహనాలు అన్ ఫిట్ గా తేలి, వాటి రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించకపోతే అలాంటి వాటన్నింటినీ తుక్కుగా మార్చాలని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఇలాంటి నిబంధనలతో సంబంధం లేకుండా 15 ఏళ్ల పైబడిన అన్ని ప్రభుత్వ వాహనాలనూ సేవల నుంచి ఉపసంహరించి తుక్కుగా మార్చి కొత్త వాహనాలకు వెళ్తే వాటి కొనుగోళ్లపై రాయితీలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు]
(ఎ) 2021 మార్చ్ 16
(బి) 2021 మార్చ్ 17
(సి) 2021 మార్చ్ 18
(డి) 2021 మార్చ్ 19
4. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పాత వాహనాలను తుక్కు కింద మార్చే 'స్క్రాపింగ్ విధానం' (VEHICLE SCRAPPAGE POLICY) ప్రకారం .. 'ఫిట్ నెస్ టెస్ట్, స్క్రాపింగ్ సెంటర్ల ఏర్పాటుకు సంభందించిన నిబంధనలు' ఏ తేదీ నుంచి అమలు కానున్నాయి ? [రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగం, ఆటోమొబైల్ కంపెనీలు సంయుక్తంగా 'పీపీపీ' (PPP) విధానంలో స్క్రాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకోసం దేశంలో జిల్లాకొకటి చొప్పున 718 జిల్లాల్లో 'ఫిట్ నెస్ సెంటర్లు' (FITNESS CENTRES) ఏర్పాటు చేస్తారు]
(ఎ) 2021 అక్టోబర్ 1
(బి) 2022 ఏప్రిల్ 1
(సి) 2023 ఏప్రిల్ 1
(డి) 2024 జూన్ 1
5. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పాత వాహనాలను తుక్కు కింద మార్చే 'స్క్రాపింగ్ విధానం' (VEHICLE SCRAPPAGE POLICY) ప్రకారం .. '15 ఏళ్ల పైబడిన ప్రభుత్వ వాహనాల స్క్రాపింగ్' ఏ తేదీ నుంచి ప్రారంభం కానుంది ?
(ఎ) 2021 అక్టోబర్ 1
(బి) 2022 ఏప్రిల్ 1
(సి) 2023 ఏప్రిల్ 1
(డి) 2024 జూన్ 1
6. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పాత వాహనాలను తుక్కు కింద మార్చే 'స్క్రాపింగ్ విధానం' (VEHICLE SCRAPPAGE POLICY) ప్రకారం .. భారీ వాణిజ్య వాహనాలకు 'ఫిట్ నెస్ టెస్ట్' (FITNESS TEST) ఏ తేదీ నుంచి తప్పనిసరి కానుంది ?
(ఎ) 2021 అక్టోబర్ 1
(బి) 2022 ఏప్రిల్ 1
(సి) 2023 ఏప్రిల్ 1
(డి) 2024 జూన్ 1
7. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పాత వాహనాలను తుక్కు కింద మార్చే 'స్క్రాపింగ్ విధానం' (VEHICLE SCRAPPAGE POLICY) ప్రకారం .. భారీ వాణిజ్య వాహనాలు కాని మిగతా వాహనాలకు 'ఫిట్ నెస్ టెస్ట్' (FITNESS TEST) ఏ తేదీ నుంచి తప్పనిసరి కానుంది ? [ఈ తేదీ నుంచి దశలవారీగా చేస్తారు]
(ఎ) 2021 అక్టోబర్ 1
(బి) 2022 ఏప్రిల్ 1
(సి) 2023 ఏప్రిల్ 1
(డి) 2024 జూన్ 1
8. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన 'ఆర్ బీ కే ఛానల్' (RBK CHANNEL) ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వర్చువల్ విధానం ద్వారా ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' ప్రారంభించిన తేదీ ? [పంటలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాతావరణం తదితర అంశాలపై రైతు భరోసా కేంద్రాల్లో (RBK) ని స్మార్ట్ టీవీల ద్వారా సమాచారం ఇచ్చేందుకు 'ఆర్ బీ కే ఛానల్' (RBK CHANNEL) దోహదపడుతుందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు]
(ఎ) 2021 మార్చ్ 15
(బి) 2021 మార్చ్ 16
(సి) 2021 మార్చ్ 17
(డి) 2021 మార్చ్ 18
9. తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఉత్సవ మూర్తులకు ప్రతి సోమవారం నిర్వహించే విశేష పూజతో పాటు బుధవారం చేసే సహస్ర కలశాభిషేకం, నిత్యం నిర్వహించే ఆర్జిత వసంతోత్సవ సేవలను ఇకనుంచి ఏడాదికి ఎన్నిసార్లు నిర్వహించాలని 'తితిదే' (TTD) ధర్మకర్తల మండలి ఇటీవల తీర్మానించినది ? [తద్వారా మలయప్ప స్వామితో పాటు శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాల అరుగుదలను నిరోధించవచ్చని భావిస్తున్నారు. తిరుమలలోని శ్రీవారి ఉత్సవమూర్తులకు వివిధ సందర్భాల్లో ఏడాదిలో 450 సార్లు అభిషేకం (తిరుమంజనం) నిర్వహిస్తుంటారు]
(ఎ) 1
(బి) 10
(సి) 100
(డి) 110
10. 'కొవిడ్-19' టీకా (COVID-19 VACCINE) తీసుకున్న తర్వాత దానివల్ల ఏమైనా తేడా వచ్చి ఆస్పత్రిలో చేరాల్సి వస్తే, అందుకయ్యే ఖర్చులు ఆరోగ్య బీమా పాలసీల కింద కవర్ అవుతాయని స్పష్టతనిస్తూ 'ఐ ఆర్ డీ ఏ ఐ' (IRDAI) ప్రకటించిన తేదీ ?
(ఎ) 2021 మార్చ్ 18
(బి) 2021 మార్చ్ 19
(సి) 2021 మార్చ్ 20
(డి) 2021 మార్చ్ 21
కీ (KEY) (GK TEST-46 YEAR : 2021)
1) బి 2) డి 3) సి 4) ఎ 5) బి 6) సి 7) డి 8) డి 9) ఎ 10) ఎ E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి