ఈ బ్లాగును సెర్చ్ చేయండి

11, మార్చి 2021, గురువారం

GK TEST-38 DATE : 2021 MARCH 6

Welcome To GK BITS IN TELUGU Blog

1. మరణించిన ఉద్యోగి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేటప్పుడు 'పెళ్లికాని కుమార్తె' మాత్రమే అర్హురాలని 2020 మే 5న 'ఏపీఎస్ఆర్టీసీ' (APSRTC) ఇచ్చిన సర్క్యూలర్ ను తప్పుబడుతూ .. "కారుణ్య నియామక అర్హతలలో 'అవివాహిత' అనే పదం రాజ్యాంగ విరుద్ధం" అని ప్రకటిస్తూ .. ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తి 'జస్టిస్ బట్టు దేవానంద్' ఆ సర్క్యూలర్ ను కొట్టేస్తూ తీర్పు చెప్పిన తేదీ ? [జీవో 350 ప్రకారం పెళ్లయిన కుమార్తెలూ కారుణ్య నియామకానికి అర్హులే] 
(ఎ) 2021 మార్చ్ 3 
(బి) 2021 మార్చ్ 4  
(సి) 2021 మార్చ్ 5  
(డి) 2021 మార్చ్ 6 

2. 'భారత జాతీయ సైన్స్ అకాడమీ' (INDIAN NATIONAL SCIENCE ACADEMY) తొలి మహిళా అధ్యక్షురాలు ? 
(ఎ) ప్రియా అబ్రహాం 
(బి) ప్రియా బాలసుబ్రహ్మణ్యం   
(సి) చంద్రిమా సాహా  
(డి) గగన్ దీప్ కంగ్ 

3. 'రాయల్ సొసైటీ' (ROYAL SOCIETY) సభ్యత్వం పొందిన తొలి భారతీయ మహిళా శాస్త్రవేత్త ? 
(ఎ) ప్రియా అబ్రహాం  
(బి) ప్రియా బాలసుబ్రహ్మణ్యం 
(సి) చంద్రిమా సాహా 
(డి) గగన్ దీప్ కంగ్ 



4. భారత సుప్రీంకోర్ట్ లో ఏ తేదీ నుంచి 'హైబ్రిడ్' విధానం (ప్రత్యక్ష విధానం మరియు వీడియో సమావేశం (వీసీ)) లో కేసుల విచారణ జరగనుంది ? [ప్రతి మంగళ, బుధ, గురు వారాల్లో కేసులను 'హైబ్రిడ్' విధానంలో విచారిస్తారు. సోమ, శుక్ర వారాల్లో మాత్రం 'వీసీ' (VC) లో విచారణ జరుగుతుంది]  
(ఎ) 2021 మార్చ్ 13 
(బి) 2021 మార్చ్ 14 
(సి) 2021 మార్చ్ 15 
(డి) 2021 మార్చ్ 16 

5. 'భారత పరిశ్రమల సమాఖ్య' (CII) దక్షిణ ప్రాంత విభాగానికి 2021-22 సంవత్సరానికి సంబంధించి నూతన చైర్మన్ గా ఎన్నికైనది ?  
(ఎ) కృష్ణ ఎల్ల   
(బి) సుచిత్ర ఎల్ల  
(సి) సీకే రంగనాధన్  
(డి) మాదిరెడ్డి ప్రతాప్  

6. 2019-20కి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 'డెంకాడ' కు చెందిన "ఇందిర మహిళా స్వయం సహాయక సంఘం" జాతీయస్థాయిలో ఉత్తమ 'ఎస్ హెచ్ జీ' (SHG) గా ఎంపికైంది. ఈ మహిళా సంఘం ఏ జిల్లాలో ఉంది ? [మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా 'జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్' దేశవ్యాప్తంగా ఉత్తమ పనితీరును కనబర్చిన 'ఎస్ హెచ్ జీ' లను ఎంపిక చేస్తుంది]
(ఎ) శ్రీకాకుళం 
(బి) విజయనగరం 
(సి) విశాఖపట్నం 
(డి) తూర్పు గోదావరి 



7. టెస్ట్ క్రికెట్లో ఎనిమిదో సారి 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' గా నిలిచిన భారత స్పిన్నర్ 'రవిచంద్రన్ అశ్విన్' .. అత్యధిక సార్లు ఆ అవార్డు అందుకున్న బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో (11 సార్లు) ఉన్నది ?  
(ఎ) ముత్తయ్య మురళీధరన్ 
(బి) షేన్ వార్న్ 
(సి) అనిల్ కుంబ్లే 
(డి) జాక్వెస్ కల్లిస్ 

8. ఆడిన తొలి టెస్టు సిరీస్ లోనే అత్యధిక వికెట్లు (27) తీసిన భారత బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఏ బౌలర్ సరసన' అక్షర్ పటేల్' చేరాడు ?  
(ఎ) ఎర్రపల్లి ప్రసన్న  
(బి) దిలీప్ దోషి  
(సి) నరేంద్ర హిర్వాణి 
(డి) అనిల్ కుంబ్లే  

9. భారత్, ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన టెస్ట్ క్రికెట్ సిరీస్ ను భారత్ 3-1తో కైవసం చేసుకుంది. తొలిటెస్టులో ఓడిన తర్వాత ఓ సిరీస్ ను 3-1తో సొంతం చేసుకోవడం 'టీమ్ ఇండియా' (TEAM INDIA) కు ఇది ఎన్నోసారి ? 
(ఎ) 1 
(బి) 2 
(సి) 3  
(డి) 4  



10. ఓ టెస్టు సిరీస్ లో 30 లేదా అంతకంటే ఎక్కువ వికెట్ల ఘనతను 'రవిచంద్రన్ అశ్విన్' ఎన్నిసార్లు సాధించాడు ? [ఈ ఘనతను సాధించిన తొలి భారత బౌలర్ కూడా ఇతనే] 
(ఎ) 1 
(బి) 2 
(సి) 3 
(డి) 4              

కీ (KEY) (GK TEST-38 DATE : 2021 MARCH 6)
1) డి    2) సి    3) డి    4) సి    5) సి    6) బి    7) ఎ    8) బి    9) ఎ    10) బి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి