1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆసుపత్రులలో 'కొవిడ్' టీకా పొందాలనుకునే వారి వయసు గుర్తించేందుకు ఏ తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు ?
E & OE (Errors & Omissions Expected)
(ఎ) 2020 జనవరి 1
(బి) 2021 జనవరి 1
(సి) 2022 జనవరి 1
(డి) 2023 జనవరి 1
2. 2021 ఏప్రిల్ లో జరగనున్న 93వ ఆస్కార్ పురస్కార్ వేడుకల్లో భాగంగా ఉత్తమ చిత్రంగా నామినేషన్ దక్కించుకున్న 366 చిత్రాలలో (OSCAR NOMINATIONS 2021) 'సూర్య' నటించిన తమిళ చిత్రం "సురారై పొట్రు" కి స్థానం దక్కింది. ఏ విమానయాన సంస్థ అధినేత (జీ.ఆర్.గోపీనాథ్) జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు ? [నామినేషన దక్కించుకున్న చిత్రాలలో ఒడిశా చిత్రం 'కలిర అటిత', ప్రియాంక చోప్రా, రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆంగ్ల చిత్రం 'ది వైట్ టైగర్' కూడా ఉన్నాయి]
(ఎ) ఎయిర్ డెక్కన్
(బి) ఎయిరేషియా ఇండియా
(సి) అలయన్స్ ఎయిర్
(డి) గో ఎయిర్
3. వరుసగా రెండు త్రైమాసికాల క్షీణత నుంచి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్ 2020) లో నమోదైన 'స్థూల దేశీయోత్పత్తి' (GDP) ?
(ఎ) 0.1 %
(బి) 0.2 %
(సి) 0.3 %
(డి) 0.4 %
4. ఆరోగ్య బీమా, సాధారణ బీమా కంపెనీలు 2021 ఏప్రిల్ 1 నుంచి ప్రామాణిక వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని "సరళ్ సురక్ష బీమా" (SARAL SURAKSHA BIMA POLICY) పేరుతో అందించాలని 'ఐ ఆర్ డీ ఏ ఐ' (IRDAI) స్పష్టం చేసింది. ఈ బీమా పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 18 ఏళ్లు కాగా, గరిష్ఠ వయస్సు ? [ఈ పథక కనీస మొత్తం బీమా ప్రయోజనం రూ. 2.5 లక్షలు, గరిష్ఠ మొత్తం బీమా ప్రయోజనం రూ. కోటి]
(ఎ) 60 సంవత్సరాలు
(బి) 65 సంవత్సరాలు
(సి) 70 సంవత్సరాలు
(డి) 75 సంవత్సరాలు
5. తితిదే (TTD) ధర్మకర్తల మండలి 2021-22 ఆర్ధిక సంవత్సరానికి ఆమోదించిన బడ్జెట్ విలువ ?
(ఎ) రూ. 2,637.82 కోట్లు
(బి) రూ. 2,737.82 కోట్లు
(సి) రూ. 2,837.82 కోట్లు
(డి) రూ. 2,937.82 కోట్లు
6. ప్రభుత్వోద్యోగి కనిపించలేదని 'ఎఫ్ ఐ ఆర్' (FIR) నమోదైనప్పటి నుంచి ఆ ఉద్యోగికి ఏడేళ్లకు పైగా సర్వీస్ మిగిలి ఉంటేనే కుటుంబసభ్యులు కారుణ్య నియామకానికి అర్హులవుతారన్న నిబంధన వివక్షాపూరితమని తప్పుపడుతూ దానికి సంబంధించిన జీవో 378 ను ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ 2021 ఫిబ్రవరి 27న కొట్టివేసింది. ఆ జీవోను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన తేదీ ? [ఉద్యోగి మరణిస్తే కుటుంబసభ్యులకు వెంటనే కారుణ్య నియామకంతోపాటు అన్ని ప్రయోజనాలు అందిస్తున్నారని .. కనిపించకుండా పోయిన ఉద్యోగి విషయంలో వీటికోసం ఏడేళ్లవరకు వేచిచూడాల్సి రావడం సరికాదని హైకోర్ట్ పేర్కొంది]
(ఎ) 1999 ఆగస్ట్ 21
(బి) 1999 ఆగస్ట్ 22
(సి) 1999 ఆగస్ట్ 23
(డి) 1999 ఆగస్ట్ 24
7. తూర్పు నౌకాదళం (ENC) "ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్" (FOC-in-C) గా నియమితులైనది ?
(ఎ) అజేంద్ర బహదూర్ సింగ్
(బి) ఆర్.హరి కుమార్
(సి) అతుల్ కుమార్ జైన్
(డి) ఏ.కే. చావ్లా
8. ఆఫ్రికా ఖండంలోని 'కిలిమంజారో' (5,685 మీటర్లు) పర్వతాన్ని (MOUNT KILIMANJARO) 2021 ఫిబ్రవరి 27న 'అనంతపురం జిల్లా, తాడిమర్రి మండలం, ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన "రిత్వికశ్రీ" అధిరోహించింది. ఆసియా ఖండం నుంచి చిన్న వయసులో 'కిలిమంజారో' పర్వతాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తిగా 'రిత్వికశ్రీ' రికార్డులకెక్కగా, ప్రపంచంలో ఎన్నో స్థానంలో నిలిచింది ?
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4
9. 'ప్రపంచ ఆవిష్కరణల సూచీ' (GII 2020) ప్రకారం .. ప్రపంచ ఆర్థికవ్యవస్థల్లో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ?
(ఎ) స్విట్జర్లాండ్
(బి) స్వీడన్
(సి) అమెరికా
(డి) బ్రిటన్
10. దేశవ్యాప్తంగా పంటల సాగును వర్గీకరించి 'డిమాండ్-సరఫరా' (DEMAND-SUPPLY) ల మధ్య సమతుల్యం పాటించాలన్న ఉద్దేశంతో ప్రతి జిల్లాలో ఒక పంట సాగుపై దృష్టి సారించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా దేశంలోని 728 జిల్లాలను విభజించింది. ధాన్యాగారంగా పేరొందిన 'ఆంధ్రప్రదేశ్' నుంచి వరి సాగుకు కేటాయించిన జిల్లాలు ?
(ఎ) 0
(బి) 1
(సి) 2
(డి) 3
కీ (KEY) (GK TEST-32 DATE : 2021 FEBRUARY 28)
1) సి 2) ఎ 3) డి 4) సి 5) డి 6) డి 7) ఎ 8) బి 9) ఎ 10) ఎ E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి