ఈ బ్లాగును సెర్చ్ చేయండి

29, మార్చి 2021, సోమవారం

GK TEST-47 YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

Welcome To GK BITS IN TELUGU Blog

1. ఫెడరేషన్ కప్ (FEDERATION CUP) జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ లో 200 మీటర్ల సెమీఫైనల్ హీట్స్ లో 23.26 సెకన్లలో లక్ష్యాన్ని చేరి, 1998లో దిగ్గజ అథ్లెట్ 'పీటీ ఉష' (23.80 సెకన్లు) నెలకొల్పిన మీట్ రికార్డును బద్దలు కొట్టిన 'తమిళనాడు' కు చెందిన మహిళా అథ్లెట్ ? 
(ఎ) ద్యుతిచంద్ 
(బి) హిమదాస్   
(సి) స్వప్నా బర్మన్  
(డి) ధనలక్ష్మి 

2. గ్రామీణ ప్రాంత ఇంటర్నెట్ చందాదారుల్లో మొదటి నాలుగు స్థానాలలో ఉన్న రాష్ట్రాలు వరుసగా .. ? [దేశవ్యాప్తంగా 2020 నాటికి గ్రామాల్లో 30.2 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. 'భారత్ నెట్' (BHARATNET) కార్యక్రమం కింద 'ఆంధ్రప్రదేశ్' లో 1,707, తెలంగాణాలో 2,047 గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు] 
(ఎ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, బిహార్ 
(బి) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర  
(సి) ఉత్తర్ ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్   
(డి) ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ 

3. తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ చర్యలకు ఏర్పాటు చేసిన సలహా కమిటీకి చైర్మన్ గా వ్యవహరించేది ?   
(ఎ) జస్టిస్ కే.శ్రీధర్ రావు  
(బి) జస్టిస్ ఎం.సీతారామమూర్తి 
(సి) జస్టిస్ జాస్తి చలమేశ్వర్ 
(డి) జస్టిస్ రాకేశ్ కుమార్ 



4. జాతీయ భద్రతా దళం (NSG) అధిపతిగా నియమితులైన సీనియర్ ఐపీఎస్ అధికారి ? 
(ఎ) ఎం.ఎ. గణపతి 
(బి) కుల్దీప్ సింగ్ 
(సి) మనోజ్ ఆహూజా 
(డి) పీకే సిన్హా 

5. 'వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2020' (WORLD AIR QUALITY REPORT 2020) పేరిట ఓ స్విస్ సంస్థ రూపొందించిన నివేదిక ప్రకారం .. ప్రపంచంలో అత్యంత కాలుష్య పీడిత నగరంగా గుర్తింపు పొందినది ? [ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొదటి 30 మురికి నగరాల్లో 22 నగరాలు భారత్ లోనే ఉన్నాయి. అత్యంత కాలుష్య పీడిత రాజధాని నగరంగా 'దిల్లీ' అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది] 
(ఎ) ఝిమ్ఝియాంగ్   
(బి) గాజియాబాద్   
(సి) ఫరీదాబాద్  
(డి) బీజింగ్ 

6. "కంపెనీ సెక్రటరీ" (COMPANY SECRETARY) విద్యార్హతను 'యూజీసీ' (UGC) దేనితో సమానంగా పరిగణిస్తూ నిర్ణయం తీసుకుంది ? [దీంతో 'కంపెనీ సెక్రటరీ' అర్హత ఉన్నవారు 'వాణిజ్య శాస్త్రం, ఇతర అనుబంధ సబ్జెక్టుల్లో 'పీహెచ్డీ' (PhD) చేసేందుకు వీలు కలుగుతుంది]
(ఎ) గ్రాడ్యుయేషన్ 
(బి) పోస్ట్ గ్రాడ్యుయేషన్ 
(సి) డిప్లొమా 
(డి) పీజీ డిప్లొమా 



7. 'టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్' (TMS - దేవాలయాల నిర్వహణ వ్యవస్థ) లో క్యూఆర్ కోడ్ ద్వారా 'ఇ-హుండీ' (e-HUNDI) కి కానుకలు సమర్పించే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' ప్రారంభించిన తేదీ ? [ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థను నిర్వహించే 'యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' .. తొలుత అన్నవరం ఆలయానికి 'ఇ-హుండీ' (e-HUNDI) ద్వారా రూ. 10,116 విరాళాన్ని సీఎం చేతుల మీదుగా అందజేసింది]    
(ఎ) 2021 మార్చ్ 14 
(బి) 2021 మార్చ్ 15 
(సి) 2021 మార్చ్ 16 
(డి) 2021 మార్చ్ 17 

8. 'వైఎస్సార్ జగనన్న కాలనీ' (YSR JAGANANNA COLONY) ల్లో ప్రభుత్వం నిర్మించనున్న ఇంటి విస్తీర్ణం ? [ఇందులో 272 చ.అ. విస్తీర్ణంలో 'హాలు, వంట గది, పడక గది, మరుగు దొడ్డి' లను ఏర్పాటు చేయనుంది. మిగతా స్థలంలో 'వరండా' ఏర్పాటు చేస్తారు]   
(ఎ) 300 చదరపు అడుగులు  
(బి) 320 చదరపు అడుగులు  
(సి) 340 చదరపు అడుగులు 
(డి) 360 చదరపు అడుగులు  

9. 'టీ20 క్రికెట్లో' (T20 CRICKET) మూడు వేల పరుగులు సాధించిన తొలి బ్యాట్సమన్ ? 
(ఎ) జో రూట్ 
(బి) బెన్ స్టోక్స్  
(సి) విరాట్ కోహ్లి   
(డి) రోహిత్ శర్మ  



10. ఒలింపిక్స్ కు వెళ్ళబోతున్న తొలి భారత ఫెన్సర్ (FENCER) గా రికార్డుల్లోకి ఎక్కిన "సి.ఎ. భవాని దేవి" స్వరాష్ట్రం ? 
(ఎ) తమిళనాడు 
(బి) కర్ణాటక 
(సి) ఆంధ్రప్రదేశ్ 
(డి) తెలంగాణ              

కీ (KEY) (GK TEST-47 YEAR : 2021)
1) డి    2) సి    3) ఎ    4) ఎ    5) ఎ    6) బి    7) బి    8) సి    9) సి    10) ఎ  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి