ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, మార్చి 2021, మంగళవారం

GK TEST-31 DATE : 2021 FEBRUARY 27

1. 2021 ఫిబ్రవరి 25న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన "మధ్యంతర మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక స్మృతి, 2021" (INTERMEDIARIES AND DIGITAL MEDIA ETHICS CODE 2021) ప్రకారం .. వినియోగదారుల గౌరవ మర్యాదలకు సంబంధించి ముఖ్యంగా 'అసభ్యత, అశ్లీలతలతో కూడిన సమాచారం, చిత్రాలు, వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు' వంటివాటిపై ఫిర్యాదులు అందితే వాటిని ఎన్ని గంటల్లోగా తొలగించాలి ?        
(ఎ) 24   
(బి) 48  
(సి) 72  
(డి) 96 

2. 2021 ఫిబ్రవరి 25న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన "మధ్యంతర మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక స్మృతి, 2021" (INTERMEDIARIES AND DIGITAL MEDIA ETHICS CODE 2021) ప్రకారం .. 'ఓటీటీ' (OTT) వేదికలు ప్రసారంచేసే వాటిని వీక్షకుల వయసును బట్టి ఎన్ని కేటగిరీలుగా వర్గీకరించాలి ? 
(ఎ) 3 
(బి) 4  
(సి) 5  
(డి) 6 

3. 2021 ఫిబ్రవరి 25న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన "మధ్యంతర మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక స్మృతి, 2021" (INTERMEDIARIES AND DIGITAL MEDIA ETHICS CODE 2021) ప్రకారం .. సామాజిక మాధ్యమాలు (Social Media Intermediary, Significant Social Media Intermediary) ఓ అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేసే ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం .. వచ్చిన ఫిర్యాదులను ఎన్ని రోజుల్లోగా పరిష్కరించాలి ? 
(ఎ) 1 రోజు   
(బి) 10 రోజులు 
(సి) 15 రోజులు 
(డి) 30 రోజులు 



4. 2021 ఫిబ్రవరి 25న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన "మధ్యంతర మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక స్మృతి, 2021" (INTERMEDIARIES AND DIGITAL MEDIA ETHICS CODE 2021) ప్రకారం .. 'దేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రత, శాంతిభద్రతలు, విదేశాలతో సంబంధాలతోపాటు .. అత్యాచారాలు, లైంగిక వేధింపులు' లాంటి విషయాలకు సంబంధించి మొదట ప్రచారంలో పెట్టిన వ్యక్తుల పేర్లు చెప్పాల్సి ఉంటుంది. ఈ తప్పు చేసిన వారికి ఎన్ని సంవత్సరాలకు పైబడి జైలుశిక్ష పడుతుంది ? 
(ఎ) 5 
(బి) 6 
(సి) 7 
(డి) 8 

5. కరోనా విజృంభణ రెండో దశ ప్రారంభమైన నేపథ్యంలో దేశంలో 'కొవిడ్' కట్టడి నిబంధనలు ఏ తేదీ వరకు కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ? 
(ఎ) 2021 మార్చ్ 31   
(బి) 2021 ఏప్రిల్ 30  
(సి) 2021 మే 31  
(డి) 2021 జూన్ 30 

6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత లోకాయుక్త ?
(ఎ) జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి 
(బి) జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డి 
(సి) జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ 
(డి) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి 



7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో దక్షిణ భారత న్యాయవాదుల మొదటి క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించిన 'మూలపాడు' క్రికెట్ మైదానం ఏ జిల్లాలో ఉంది ? [ఈ టోర్నమెంట్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి 'జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి' 2021 ఫిబ్రవరి 26న ప్రారంభించారు]  
(ఎ) ప్రకాశం 
(బి) గుంటూరు 
(సి) కృష్ణా 
(డి) పశ్చిమ గోదావరి  

8. 2021 ఫిబ్రవరి 23 నాటికి 'కొవిడ్' టీకా (ఫైజర్-బయో ఎన్ టెక్) లను అత్యధిక ప్రజానీకానికి అందజేసే రేసులో అందరి కన్నా ముందున్న దేశం ? [ఈ దేశం ప్రతి వంద మందికిగాను 87 మందికి టీకాలు వేసింది]   
(ఎ) అమెరికా  
(బి) బ్రిటన్  
(సి) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 
(డి) ఇజ్రాయెల్  

9. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్, ఇండియా (INSTITUTE OF TOWN PLANNERS, INDIA) ఆధ్వర్యంలో 'ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ' సహకారంతో 69వ జాతీయ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్ సమావేశం 2021 ఫిబ్రవరి 26న ఎక్కడ జరిగింది ?
(ఎ) తిరుపతి 
(బి) విజయవాడ 
(సి) విశాఖపట్నం  
(డి) శ్రీకాకుళం  



10. దేశవ్యాప్తంగా ఉన్న 'జిల్లా గ్రామీణ అభివృద్ధి సమాఖ్య' (DRDA) లను ఏ తేదీ నుంచి ఆయా రాష్ట్రాల పంచాయతీరాజ్ సంస్థల్లో విలీనం చేసే ప్రక్రియను అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది ? 
(ఎ) 2021 మార్చ్ 1 
(బి) 2021 ఏప్రిల్ 1 
(సి) 2021 మే 1 
(డి) 2021 జూన్ 1              

కీ (KEY) (GK TEST-31 DATE : 2021 FEBRUARY 27)
1) ఎ    2) సి    3) సి    4) ఎ    5) ఎ    6) బి    7) సి    8) డి    9) సి    10) బి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి