ఈ బ్లాగును సెర్చ్ చేయండి

28, మార్చి 2021, ఆదివారం

GK TEST-44 YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

Welcome To GK BITS IN TELUGU Blog

1. ఆంధ్రప్రదేశ్ నగరపాలక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయర్, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో రెండో వైస్ చైర్మన్ ను ఎన్నుకునేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సు "ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాల (సవరణ) ఆర్డినెన్సు-2021" ను గవర్నర్ 'బిశ్వభూషణ్ హరిచందన్' జారీ చేసిన తేదీ ? 
(ఎ) 2021 మార్చ్ 24 
(బి) 2021 మార్చ్ 25  
(సి) 2021 మార్చ్ 26  
(డి) 2021 మార్చ్ 27 

2. తీర గస్తీ ఓడ "వజ్ర" (VAJRA) ను 2021 మార్చ్ 24న సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టిన భారత రక్షణ దళాల ప్రధానాధికారి ? [ఈ ఓడను 'ఎల్ అండ్ టీ' సంస్థ చెన్నై కాట్టుపల్లిలో నిర్మించింది] 
(ఎ) జనరల్ ఎం.ఎం. నరవణే  
(బి) జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్  
(సి) జనరల్ బిపిన్ రావత్  
(డి) జనరల్ బిక్రం సింగ్ 

3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి క్షయ వ్యాధి నివారణలో జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన జిల్లా ? [కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలో 2015, 2020 సంవత్సరాల్లోని కేసులను సరిపోల్చగా ఈ జిల్లాలో 20 శాతం తగ్గుదల కనిపించడాన్ని అధికారులు గుర్తించి 'కాంస్య' పతకానికి ఎంపిక చేశారు]  
(ఎ) శ్రీకాకుళం  
(బి) విజయనగరం 
(సి) విశాఖపట్నం 
(డి) తూర్పుగోదావరి 



4. 'కరోనా' లాక్ డౌన్ కాలంలో వీడియో సమావేశాల ద్వారా దేశంలో విచారణలు ప్రారంభించిన తొలి హైకోర్టు ? 
(ఎ) తెలంగాణ హైకోర్టు  
(బి) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 
(సి) మద్రాస్ హైకోర్టు 
(డి) దిల్లీ హైకోర్టు 

5. 2021 మార్చ్ 21న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ 'సునీల్ ఆరోడా' చేతుల మీదుగా "సన్సద్ రత్న"(SANSAD RATNA) పురస్కారాన్ని అందుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యుడు ? [పార్లమెంట్ లో తగిన ప్రతిభ కనబరుస్తున్నందుకు ముగ్గురు ఎంపీలకు (భర్తృహరి మెహతాబ్ (బీజేడీ), సుప్రియా సూలే (ఎన్సీపీ), శ్రీరంగ్ అప్పా బర్నే (శివసేన)) "సన్సద్ మహా రత్న" (SANSAD MAHA RATNA), 12 మంది ఎంపీలకు "సన్సద్ రత్న"(SANSAD RATNA) పురస్కారాలను అందజేశారు. చెన్నైకు చెందిన స్వచ్ఛంద సంస్థ 'ప్రైమ్ పాయింట్', ఈ-మేగజైన్ 'ప్రీసెన్స్' లు సంయుక్తంగా వీటిని బహూకరించాయి]   
(ఎ) గల్లా జయదేవ్ (గుంటూరు)   
(బి) మార్గాని భరత్ (రాజమండ్రి)  
(సి) వై.ఎస్.అవినాష్ రెడ్డి (కడప)  
(డి) కింజరాపు రామ్మోహన్ నాయుడు (శ్రీకాకుళం) 

6. 2021 మార్చ్ 20న 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్' (RSS) నూతన జాతీయ సర్ కార్యవాహ (సెక్రటరీ జనరల్) గా ఎన్నికైన "దత్తాత్రేయ హొసబళె" ఏ రాష్ట్రానికి చెందినవారు ? [ఈ పదవిని 'ఆర్ ఎస్ ఎస్' (RSS) లో నం.2గా పరిగణిస్తారు]    
(ఎ) కర్ణాటక 
(బి) మహారాష్ట్ర 
(సి) గుజరాత్ 
(డి) మధ్యప్రదేశ్ 



7. 'ఇస్రో' (ISRO), 'సీఎన్ఈఎస్' (CNES) లు సంయుక్తంగా 2011లో 'మేఘ-ట్రాఫిక్స్', 2013లో 'సరళ్ ఆల్టికా' ప్రాజెక్టులను ప్రయోగించాయి. 'సీఎన్ఈఎస్' (CNES) అనేది ఏ దేశానికి చెందిన అంతరిక్ష సంస్థ ?  
(ఎ) జపాన్ 
(బి) బ్రెజిల్ 
(సి) ఫ్రాన్స్ 
(డి) జర్మనీ 

8. ఓ విమానం మీద 'సోనూ సూద్' (SONU SOOD) బొమ్మతోపాటు .. 'ఏ సెల్యూట్ టు సేవియర్' .. అంటూ శీర్షికని ప్రచురించి గౌరవించిన దేశీయ విమానయాన సంస్థ ? ['కరోనా' కష్టకాలంలో దేశంలోనూ, దేశం అవతల చిక్కుకున్న భారతీయుల్ని స్వస్థలాలకి చేర్చి ఎంతోమంది కళ్లల్లో ఆనందం నింపారు 'సోనూ సూద్']  
(ఎ) స్పైస్ జెట్  
(బి) ఇండిగో  
(సి) గో ఎయిర్ 
(డి) జెట్ ఎయిర్ వేస్  

9. నేటితరం ఆడపిల్లల్లో 'స్పేస్' (SPACE) పట్ల ఆసక్తిని కలిగించేందుకు "నిన్ను నువ్వు నమ్ముకుంటే .. ఏదైనా సాధించగలవు" అనే శక్తివంతమైన ప్రచారాన్ని ప్రారంభించి, రెండు కాస్మోనాట్ బార్బీ బొమ్మలని కూడా విడుదల చేసిన దేశం ? [అంతరిక్షంలోకి తొలిసారిగా మానవసహిత వ్యోమనౌకని పంపి అరవై ఏళ్లవుతున్న సందర్భాన్ని ఈ దేశం వేడుకగా చేస్తోంది. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి మహిళ 'వాలంతినా తెరిష్కోవా' 58 సంవత్సరాల తర్వాత 2021లో 'అన్నాకికినా' అనే మహిళ అడుగుపెట్టనుంది]  
(ఎ) అమెరికా 
(బి) రష్యా 
(సి) జపాన్  
(డి) ఫ్రాన్స్  



10. 2021 మార్చ్ 22న 'కేంద్ర సాంస్కృతిక శాఖ' 2019వ సంవత్సరానికి సంబంధించి "గాంధీ శాంతి పురస్కారం" ను ప్రకటించిన దివంగత సుల్తాన్ 'కబూస్ బిన్ సయిద్ అల్ సయిద్' ది ఏ దేశం ? [2020 సంవత్సరానికి దివంగత బంగబంధు 'షేక్ ముజిబుర్ రహ్మాన్' కు ప్రకటించింది. మహాత్మాగాంధీ 125వ జయంతి సందర్భంగా 1995లో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. పురస్కారం కింద కోటి రూపాయల నగదు, ప్రశంసాపత్రం, చేనేత వస్త్రాన్నిగానీ, సంప్రదాయ హస్తకళల వస్తువునుగానీ బహూకరిస్తారు]]      
(ఎ) బహ్రెయిన్ 
(బి) ఖతార్ 
(సి) ఒమన్  
(డి) సౌదీ అరేబియా              

కీ (KEY) (GK TEST-44 YEAR : 2021)
1) ఎ    2) సి    3) ఎ    4) బి    5) డి    6) ఎ    7) సి    8) ఎ    9) బి    10) సి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి