ఈ బ్లాగును సెర్చ్ చేయండి

9, మార్చి 2021, మంగళవారం

GK TEST-36 DATE : 2021 MARCH 4

Welcome To GK BITS IN TELUGU Blog

1. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ దేశంలోని 111 నగరాల్లోని పరిస్థితుల్ని మదింపు చేసి .. 2019-20వ  సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన వివరాల ప్రకారం .. 'ఉత్తమ పనితీరు కనబరిచిన మున్సిపాలిటీల' (MPI) విభాగంలో 10 లక్షలకు పైబడిన నగరాల్లో "విశాఖపట్నం" సాధించిన ర్యాంక్ ? [ఈ విభాగంలో 'విజయవాడ' 27వ ర్యాంక్ సాధించింది]  
(ఎ) 6 
(బి) 7  
(సి) 8  
(డి) 9 

2. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ దేశంలోని 111 నగరాల్లోని పరిస్థితుల్ని మదింపు చేసి .. 2019-20వ  సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన వివరాల ప్రకారం .. 'ఉత్తమ పనితీరు కనబరిచిన మున్సిపాలిటీల' (MPI) విభాగంలో 10 లక్షల్లోపు జనాభా ఉన్న నగరాల్లో "తిరుపతి" దక్కించుకున్న ర్యాంక్ ? 
(ఎ) 1 
(బి) 2  
(సి) 3  
(డి) 4 

3. 'ఆర్బిటర్, ల్యాండర్, రోవర్' లతో కూడిన చైనా వ్యోమనౌక 'తియాన్వెన్-1' (TIANWEN-1) అంగారక కక్ష్యలోకి ప్రవేశించిన తేదీ ? [ఈ ఏడాది మే లేదా జూన్ లో అరుణ గ్రహ (MARS PLANET) దక్షిణార్ధగోళంలోని 'ఉటోపియా ప్లానీషియా' అనే ప్రాంతంలో 'ల్యాండర్, రోవర్' లు దిగుతాయి] 
(ఎ) 2021 ఫిబ్రవరి 21  
(బి) 2021 ఫిబ్రవరి 22 
(సి) 2021 ఫిబ్రవరి 23 
(డి) 2021 ఫిబ్రవరి 24 



4. భారతదేశ తీర్మానం మేరకు ఏ సంవత్సరాన్ని "అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం" (INTERNATIONAL YEAR OF MILLETS) గా పాటించేందుకు 193 సభ్య దేశాలతో కూడిన 'ఐక్యరాజ్యసమితి' (UNO) సర్వప్రతినిధి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది ? 
(ఎ) 2021 
(బి) 2022 
(సి) 2023 
(డి) 2024 

5. 2021 మార్చ్ 4న శ్రీలంకతో జరిగిన తొలి టీ20 (FIRST T20 CRICKET MATCH BETWEEN 'WEST INDIES AND SRILANKA) లో, స్పిన్నర్ 'అఖిల ధనంజయ' వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో 'ఆరు సిక్సర్లు' బాదిన వెస్టిండీస్ క్రికెటర్ ? [2007 టీ20 ప్రపంచకప్ లో యువరాజ్ సింగ్ సిక్సర్ల తర్వాత టీ20 క్రికెట్ లో ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడు ఇతనే. మొత్తం మీద అంతర్జాతీయ క్రికెట్ లో ఒకే ఓవర్ లో ఆరు బంతులను మైదానం బయటకు పంపిన మూడో ఆటగాడు ఇతను]   
(ఎ) కీరన్ పొలార్డ్   
(బి) క్రిస్ గేల్  
(సి) జేసన్ హోల్డర్  
(డి) కీమర్ రోచ్ 

6. 'ఐ ఎస్ ఎస్ ఎఫ్' (ISSF) ప్రపంచకప్ ఫైనల్ లో భారత మహిళల ట్రాప్ జట్టు ఏ దేశ జట్టు చేతిలో ఓడిపోయి 'రజతం' (SILVER MEDAL) తో సరిపెట్టుకుంది ? [ఇదే టోర్నీలో భారత పురుషుల స్కీట్ జట్టు 'కాంస్యం' (BRONZE MEDAL) సాధించింది]
(ఎ) అమెరికా 
(బి) రష్యా 
(సి) మెక్సికొ  
(డి) దక్షిణ కొరియా 



7. ల్యాబుల్లో (DIAGNOSTIC LABS) వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఉపయోగించే 'ఫ్లోరోసెంట్ డై' హానికర రసాయనానికి ప్రత్యామ్నాయంగా పూర్తిగా వంటింట్లో దొరికే దినుసులతోనే "టింటో ర్యాంగ్" (TINTO RANG) పేరుతో వినూత్నమైన ఆవిష్కరణ చేసిన 'డాక్టర్ ఫాతిమా బెనజీర్' స్వస్థలం ? 
(ఎ) చెన్నై 
(బి) హైదరాబాద్ 
(సి) ముంబయి 
(డి) బెంగళూరు 

8. 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్' (ANDHRA PRADESH STATE ST COMMISSION CHAIRMAN) గా ప్రభుత్వం నియమించిన వ్యక్తి పేరు ? [ఇతను బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి మూడేళ్ళ పాటు కొనసాగుతారు]  
(ఎ) జూపూడి ప్రభాకరరావు  
(బి) సమిర్ధి భాస్కరరావు  
(సి) కుంభా రవిబాబు 
(డి) రామారావు దొర  

9. "దిశ" యాప్ (DISHA APP) ను డౌన్ లోడ్ చేసుకునే మహిళలకు ఎంపిక చేసిన దుకాణాల్లో 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' (INTERNATIONAL WOMEN'S DAY) రోజున మొబైల్ ఫోన్ కొనుగోలుపై ఎంత రాయితీ ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' వెల్లడించారు ?
(ఎ) 5% 
(బి) 10% 
(సి) 15%  
(డి) 20%  



10. కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి 'సంతోష్ కుమార్ గాంగ్వార్' అధ్యక్షతన 2021 మార్చ్ 4న 'శ్రీనగర్' లో జరిగిన మండలి 228వ సమావేశంలో 'ఉద్యోగుల భవిష్య నిధి' (EPF) పై 2020-21 సంవత్సరానికి ఎంత వడ్డీ ఇవ్వాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది ? 
(ఎ) 8.0 % 
(బి) 8.25 % 
(సి) 8.50 % 
(డి) 8.75 %              

కీ (KEY) (GK TEST-36 DATE : 2021 MARCH 4)
1) డి    2) బి    3) డి    4) సి    5) ఎ    6) బి    7) డి    8) సి    9) బి    10) సి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి