ఈ బ్లాగును సెర్చ్ చేయండి

5, మార్చి 2021, శుక్రవారం

GK TEST-34 DATE : 2021 MARCH 2

1. 2021 ఫిబ్రవరి 28న 'ఇస్రో' (ISRO) విజయంతంగా ప్రయోగించిన 'పీ ఎస్ ఎల్ వీ - సి51' (PSLV-C51) ద్వారా మొదటగా నిర్ధారిత కక్ష్యలోకి చేరిన ఉపగ్రహం ? 
(ఎ) సింధునేత్ర (ఆర్-శాట్) 
(బి) సతీశ్ ధవన్ శాట్   
(సి) యూనిటీ శాట్  
(డి) అమెజానియా-1 

2. హిందూ మహాసముద్రంలో నౌకల కదలికలను గుర్తించేందుకు కొన్ని ఉపగ్రహాలను రూపొందించేందుకు భారతదేశం ఏ దేశంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది ? 
(ఎ) అమెరికా 
(బి) రష్యా  
(సి) ఫ్రాన్స్  
(డి) జపాన్ 

3. దిల్లీలోని 'ఎయిమ్స్' (AIMS) లో ఉదయం 6 గంటల 30 నిముషాలకు స్వదేశీ పరిజ్ఞానంతో 'భారత్ బయోటెక్' సంస్థ రూపొందించిన "కొవాగ్జిన్" (COVAXIN) టీకాను భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' కి ఇచ్చిన తేదీ ? [ఈ తేదీ నుంచే సాధారణ ప్రజానీకానికి .. అంటే '60 ఏళ్లు పైబడ్డవారికి, వివిధ వ్యాధులు ఉన్న 45-59 ఏళ్ల వారిని అర్హులుగా గుర్తించి టీకాలు ఇవ్వడం ప్రారంభించారు] 
(ఎ) 2021 ఫిబ్రవరి 27  
(బి) 2021 ఫిబ్రవరి 28 
(సి) 2021 మార్చ్ 1 
(డి) 2021 మార్చ్ 2 



4. ప్రాథమిక విద్యలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు 'ప్రపంచ బ్యాంకు' (WORLD BANK) సహకారంతో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ చేపట్టిన "ఆంధ్ర అభ్యసన పరివర్తన" ప్రాజెక్ట్ ను ఎన్ని సంవత్సరాల పాటు అమలు చేయనున్నారు ? [ప్రపంచ బ్యాంకు రూ. 1,838.75 కోట్లు సాయం చేయనున్న ఈ ప్రాజెక్ట్ లో భాగంగా పూర్వ ప్రాథమిక విద్యను బోధించే అంగన్వాడీ కార్యకర్తలు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణనివ్వనున్నారు]  
(ఎ) 5 
(బి) 6 
(సి) 7 
(డి) 8 

5. ఎన్నికల వ్యూహకర్త 'ప్రశాంత్ కిశోర్' (PRASHANT KISHOR) తనకు ముఖ్య సలహాదారునిగా వ్యవహరిస్తారని 2021 మార్చ్ 1న తెలిపిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ? ['ప్రశాంత్ కిశోర్' కు కేబినెట్ మంత్రి హోదాలో ప్రభుత్వపరమైన సదుపాయాలన్నీ కల్పిస్తూ, నామమాత్ర గౌరవ వేతనం కింద ఒక రూపాయి చెల్లిస్తారు]   
(ఎ) మమతా బెనర్జీ   
(బి) కెప్టెన్ అమరీందర్ సింగ్  
(సి) వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి  
(డి) నితీశ్ కుమార్ 

6. గతేడాది భారత్-చైనాల మధ్య లద్దాఖ్ సరిహద్దుల్లో ఘర్షణలు జరుగుతున్న సమయంలో .. భారత్ విద్యుత్ గ్రిడ్ లపై సైబర్ దాడులు చేసి .. దేశాన్ని చిమ్మ చీకట్లోకి నెట్టాలని చైనా ప్రయత్నించిందని సంచలనాత్మక విషయాలను బయటపెట్టిన "రికార్డెడ్ ఫ్యూచర్" (RECORDED FUTURE) సంస్థది ఏ దేశం ? [ఉదా : 2020 అక్టోబర్ 12న ముంబయిలో విద్యుత్ గ్రిడ్ విఫలమై ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోయాయి]
(ఎ) అమెరికా 
(బి) రష్యా 
(సి) ఇజ్రాయెల్ 
(డి) ఫ్రాన్స్ 



7. 2020 జూలై 20న "గౌ-ధన్ న్యాయ యోజన" (GODHAN NYAY YOJANA) పథకాన్ని ప్రకటించి కిలో ఆవు పేడను రూ. 2 కి కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ?  
(ఎ) మధ్యప్రదేశ్ 
(బి) ఛత్తీస్ గఢ్ 
(సి) బీహార్ 
(డి) ఝార్ఖండ్ 

8. "భారత సముద్రయాన సదస్సు-2021" (MARITIME INDIA SUMMIT 2021) ను భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన తేదీ ?  
(ఎ) 2021 ఫిబ్రవరి 27  
(బి) 2021 ఫిబ్రవరి 28  
(సి) 2021 మార్చ్ 1 
(డి) 2021 మార్చ్ 2  

9. ఏ సంవత్సరం నాటికి అత్యంత చౌకగా, పర్యావరణానికి నష్టం లేకుండా సరకు రవాణా చేయడానికి 23 జల రవాణా మార్గాలను అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ? 
(ఎ) 2024 
(బి) 2027 
(సి) 2030  
(డి) 2033  



10. బహిరంగ మార్కెట్ నుంచి అప్పులు తీసుకోవడంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ? 
(ఎ) 1 
(బి) 2 
(సి) 3 
(డి) 4              

కీ (KEY) (GK TEST-34 DATE : 2021 MARCH 2)
1) డి    2) సి    3) సి    4) ఎ    5) బి    6) ఎ    7) బి    8) డి    9) సి    10) డి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి