Welcome To GK BITS IN TELUGU Blog
1. భారతదేశంలో 'ఐఐటీ' (IIT), ఐసర్ (IISER)' లు ఒకేచోట ఉన్న ఏకైక నగరం ? [దేశంలోనే అత్యధికంగా 18% మంది విద్యార్థినులు ఈ 'ఐఐటీ' లో చదువుతున్నారు]
E & OE (Errors & Omissions Expected)
(ఎ) చెన్నై
(బి) తిరుపతి
(సి) బాంబే
(డి) కాన్పూర్
2. ఏ తేదీ నుంచి ప్రతి నెలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థినులకు (7 నుంచి 12వ తరగతి వరకు) బ్రాండెడ్ కంపెనీల 'శానిటరీ న్యాప్కిన్స్' (SANITARY NAPKINS) ఉచితంగా అందించనున్నట్లు ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' 2021 మార్చ్ 5న ప్రకటించారు ? [ఒక్కో విద్యార్థినికి నెలకు 10 చొప్పున ఏడాదికి 120 'శానిటరీ న్యాప్కిన్స్' అందిస్తారు]
(ఎ) 2021 ఏప్రిల్ 1
(బి) 2021 మే 1
(సి) 2021 జూన్ 1
(డి) 2021 జూలై 1
3. ఏ తేదీ నుంచి కొత్తగా తయారయ్యే కారు మోడళ్లకు డ్రైవర్ పక్కన ముందు సీట్లో కూర్చునేవారికి తప్పనిసరిగా "ఎయిర్ బ్యాగ్స్" (AIR BAGS) అమర్చాలని 'కేంద్ర రహదారి రవాణా శాఖ' నిర్దేశించింది ? [ప్రస్తుతం ఉత్పత్తిలో ఉన్న మోడళ్లకు సంబంధించి 2021 ఆగస్ట్ 31 నాటికల్లా 'ఎయిర్ బ్యాగ్స్' అమర్చాలని ఆ శాఖ పేర్కొంది]
(ఎ) 2021 ఏప్రిల్ 1
(బి) 2021 మే 1
(సి) 2021 జూన్ 1
(డి) 2021 జూలై 1
4. వచ్చే ఏడాది జరగబోయే 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని 'నరేంద్ర మోదీ' నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 259 మంది ప్రముఖులతో 'ఉన్నత స్థాయి జాతీయ కమిటీ' ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తొలి సమావేశం జరిగే తేదీ ? [భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా నిర్వహించాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నది ఈ కమిటీ నిర్ణయిస్తుంది]
(ఎ) 2021 మార్చ్ 6
(బి) 2021 మార్చ్ 7
(సి) 2021 మార్చ్ 8
(డి) 2021 మార్చ్ 9
5. సామాజిక మాధ్యమాలు, మీడియాలో దురుద్దేశపూర్వకంగా జరిగే తప్పుడు ప్రచారాలను ఆధారాలతో సహా ఖండించేందుకు "ఏపీ ఫ్యాక్ట్ చెక్" (AP FACT CHECK) వెబ్ సైట్, ట్విటర్ ఖాతాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' ప్రారంభించిన తేదీ ?
(ఎ) 2021 మార్చ్ 2
(బి) 2021 మార్చ్ 3
(సి) 2021 మార్చ్ 4
(డి) 2021 మార్చ్ 5
6. 'నాబార్డు' (NABARD) చైర్మన్ గా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి 'డాక్టర్ గోవిందరాజులు చింతల' .. "ఆసియా పసిఫిక్ గ్రామీణ, వ్యవసాయ పరపతి సంఘం' (APRACA) చైర్మన్ గానూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 'అప్రాకా' (APRACA) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? [ఇతను రెండేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎన్నికైన మొదటి వ్యక్తి కూడా ఇతనే]
(ఎ) బ్యాంకాక్ (థాయిలాండ్)
(బి) కౌలాలంపూర్ (మలేషియా)
(సి) సింగపూర్ (సింగపూర్)
(డి) మాలె (మాల్దీవులు)
7. 'రోడ్ సేఫ్టీ ప్రపంచ సిరీస్ టీ20 టోర్నమెంట్' (ROAD SAFETY WORLD SERIES T20 TOURNAMENT) 2021 మార్చ్ 5న ప్రారంభమైన ప్రదేశం ? [దిగ్గజ క్రీడాకారులైన మాజీ క్రికెటర్ల ఆటను చూసే అవకాశం ఈ టోర్నమెంట్ ద్వారా కలుగనుంది]
(ఎ) రాయ్ పుర్
(బి) భిలాయ్
(సి) కోర్బా
(డి) బిలాస్ పుర్
8. పద్మభూషణ్ 'అనుమోలు రామకృష్ణ' జీవిత చరిత్ర 'బిల్డింగ్ ఎ లెగసి' (BUILDING A LEGACY) తెలుగు అనువాద పుస్తకం "వారసత్వ నిర్మాత" ను తిరుపతిలో భారత ఉప రాష్ట్రపతి 'ఎం.వెంకయ్య నాయుడు' ఆవిష్కరించిన తేదీ ?
(ఎ) 2021 మార్చ్ 2
(బి) 2021 మార్చ్ 3
(సి) 2021 మార్చ్ 4
(డి) 2021 మార్చ్ 5
9. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులలో రైతులతో పాటు ఉద్యమిస్తున్న మహిళలపై .. "నన్ను భయపెట్టలేరు. నన్ను కొనలేరు" శీర్షికన ప్రచురించినది ? [దిల్లీలోని టిక్రి సరిహద్దు వద్ద సుమారు 20 మంది మహిళలు ఆందోళన చేపడుతుండటాన్ని 'మార్చ్ 2021' సంచిక ముఖచిత్రంగా ముద్రించింది. దీనికి 'ఆన్ ది ఫ్రంట్ లైన్స్ ఆఫ్ ఇండియా'స్ ప్రొటెస్ట్' (On the frontlines of the India's protest) అనే వ్యాఖ్యను జోడించింది]
(ఎ) ది వాల్ స్ట్రీట్ జర్నల్
(బి) టైమ్ మ్యాగజైన్
(సి) ది న్యూయార్క్ టైమ్స్
(డి) ఉమన్స్ డే
10. భారత్, ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన టెస్ట్ క్రికెట్ సిరీస్ ను భారత్ 3-1 తో చేజిక్కించుకుంది. స్వదేశంలో భారత్ కు ఇది వరుసగా ఎన్నో సిరీస్ విజయం ? [2013లో ఆస్ట్రేలియాపై 4-0 విజయంతో ఈ జైత్రయాత్ర మొదలైంది]
(ఎ) 11
(బి) 12
(సి) 13
(డి) 14
కీ (KEY) (GK TEST-37 DATE : 2021 MARCH 5)
1) బి 2) డి 3) ఎ 4) సి 5) డి 6) ఎ 7) ఎ 8) సి 9) బి 10) సి E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి