Welcome To GK BITS IN TELUGU Blog
1. భారత్-బంగ్లాదేశ్ నడుమ నిర్మించిన "మైత్రీ సేతు" (MAITRI SETU) ను భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' 2021 మార్చ్ 9న ప్రారంభించారు. ఈ వంతెన భారత్ లోని 'సబ్రూం', బంగ్లాదేశ్ లోని 'రాంఘర్' లను కలుపుతుంది. 'సబ్రూం' ఏ రాష్ట్రంలో ఉంది ? ['ఫెని' నది (FENI RIVER) పై రూ. 133 కోట్ల నిధులతో భారత్ కు చెందిన 'జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ' నిర్మించిన 1.9 కి.మీ. 'మైత్రీ సేతు' (MAITRI SETU) ను 'నరేంద్ర మోదీ' వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు]
(ఎ) అసోం
(బి) సిక్కిం
(సి) త్రిపుర
(డి) నాగాలాండ్
2. వాణిజ్య సందేశాల నియంత్రణకు 'ట్రాయ్' (TRAI) 2018లో రూపొందించిన కొత్త నిబంధనలు ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి ? [మోసపూరిత, అనధికారిక సంక్షిప్త సందేశాలను నిలువరించేందుకే 'బ్లాక్ చైన్ సాంకేతికత' (BLOCKCHAIN TECHNOLOGY) ఆధారిత నిబంధనలను 'ట్రాయ్' (TRAI) తీసుకొచ్చింది. వీటి ప్రకారం .. బ్యాంకులు, చెల్లింపుల కంపెనీలు వంటివి 'ఎస్ ఎం ఎస్' (SMS), 'ఓ టీ పీ' (OTP) లు పంపినప్పుడు ఆయా సంస్థలు బ్లాక్ చైన్ లో రిజిస్టర్ చేసుకున్న టెంప్లేట్లతో (TEMPLATES) వాటిని సరిపోల్చుతారు. అవి సరిగ్గా ఉంటేనే .. ఆ 'ఎస్ ఎం ఎస్' (SMS), 'ఓ టీ పీ' (OTP) లు సంబంధిత వ్యక్తులకు వెళతాయి. ఈ ప్రక్రియను "ఎస్ ఎం ఎస్ స్క్రబ్బింగ్" (SMS SCRUBBING) అంటారు]
(ఎ) 2021 మార్చ్ 8
(బి) 2021 మార్చ్ 9
(సి) 2021 మార్చ్ 10
(డి) 2021 మార్చ్ 11
3. 2021 మార్చ్ 21న 'మిలిటరీ డైరెక్ట్' (MILITARY DIRECT) అనే వెబ్ సైట్ విడుదల చేసిన అధ్యయన నివేదిక ప్రకారం .. ప్రపంచంలోనే అత్యంత బలమైన సైనిక శక్తి గల దేశాలలో మొదటి ఐదు స్థానాలలో ఉన్నవి వరుసగా ... ? ["రక్షణ బడ్జెట్లు, క్రియాశీల, రిజర్వు బలగాల సంఖ్య, వైమానిక, నౌకా శక్తి, అణ్వస్త్రాలు" వంటి అంశాల ఆధారంగా సైనిక సామర్ధ్యాన్ని లెక్కించారు]
(ఎ) అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్, భారత్
(బి) రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్
(సి) చైనా, అమెరికా, రష్యా, భారత్, ఫ్రాన్స్
(డి) అమెరికా, రష్యా, చైనా, భారత్, ఇజ్రాయెల్
4. 2021 మార్చ్ 25న 'ఓర్వకల్లు' లో కర్నూలు విమానాశ్రయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' ప్రారంభించి, జాతికి అంకితమిచ్చారు. రాష్ట్రంలో ఇది ఎన్నో విమానాశ్రయం ? [1847లోనే కర్నూలు గడ్డపై రైతుల పక్షాన పోరాడి పరాయి పాలకుల గుండెల్లో నిద్రపోయిన మహా సమరయోధుడు "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి" పేరును ఈ విమానాశ్రయానికి పెట్టారు]
(ఎ) 4
(బి) 5
(సి) 6
(డి) 7
5. 2020 వ సంవత్సరానికి "యు.బి.రాఘవేంద్రరావు స్మారక పురస్కారం" ను పొందిన 'ముళ్లపూడి నరేంద్రనాథ్' ఏ చక్కెర పరిశ్రమకు 'జేఎండీ' గా ఉన్నారు ? [చక్కెర పరిశ్రమకు చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, అవార్డు కమిటీ ఏకగ్రీవంగా పురస్కారానికి ఎంపిక చేశాయి]
(ఎ) శ్రీ రాయలసీమ సుగర్ ఎనర్జీ (ప్రైవేట్) లిమిటెడ్
(బి) ఆంధ్రా సుగర్స్ లిమిటెడ్
(సి) జైపూర్ సుగర్ కంపెనీ లిమిటెడ్
(డి) కిర్లంపూడి సుగర్ మిల్స్ లిమిటెడ్
6. గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ లోని ఏ గ్రామాన్ని "ఫైవ్ స్టార్ పోస్టల్ విలేజ్" (FIVE STAR VILLAGE) గా 'భారత తపాలా శాఖ' ఎంపిక చేసింది ?
(ఎ) గణపవరం
(బి) పెరలి
(సి) యాజలి
(డి) బుద్దం
7. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఆర్ధిక సంవత్సరం (2021-22) లో రైతులకు బ్యాంకుల ద్వారా రూ. 1,13,000 కోట్ల పంట రుణాలను అందించే అవకాశం ఉందని 'నాబార్డు' (NABARD) పేర్కొంది. మొత్తంగా ప్రాధాన్య రంగానికి రూ. 2,31,000 కోట్ల మేర రుణాలు ఇస్తామంది. నిరుటితో పోలిస్తే తన రుణ ప్రణాళికను ఎంత మేర పెంచింది ?
(ఎ) 6%
(బి) 7%
(సి) 8%
(డి) 9%
8. బంగ్లాదేశ్ విమోచన ఉద్యమం స్వర్ణోత్సవాల్లో భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' గౌరవ అతిథిగా పాల్గొన్న తేదీ ? ['కొవిడ్' తలెత్తిన అనంతరం ప్రధాని మోదీ జరిపిన తొలి విదేశీ పర్యటన ఇదే. వీవీఐపీ (VVIP) ల కోసం నూతనంగా కొనుగోలు చేసిన బీ777 విమానం (ఎయిర్ ఇండియా వన్ / ఏఐ 1) లో మోదీ తొలిసారిగా ప్రయాణించారు. ఈ సందర్భంగా మోదీ 'ముజిబ్ జాకెట్' ను ధరించారు]
(ఎ) 2021 మార్చ్ 24
(బి) 2021 మార్చ్ 25
(సి) 2021 మార్చ్ 26
(డి) 2021 మార్చ్ 27
9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్ గా ఎవరి పేరును గవర్నర్ 'బిశ్వభూషణ్ హరిచందన్' ఖరారు చేశారు ?
(ఎ) నీలం సాహ్ని
(బి) ప్రేమ్ చంద్రారెడ్డి
(సి) శామ్యూల్
(డి) అజయ్ ప్రకాష్ సాహ్ని
10. 'ఆత్మనిర్భర్ భారత్ అభియాన్' లో రెండో విడత కింద డిస్కంలకు నిధులు విడుదల చేయడానికి ఎప్పటిలోగా అన్ని ప్రభుత్వ విభాగాల్లో 'ప్రీపెయిడ్ మీటర్ల' (SMART METERS) ను ఏర్పాటు చేయాలన్న నిబంధనను కేంద్ర ప్రభుత్వం విధించింది ?
(ఎ) 2022 జనవరి
(బి) 2022 ఫిబ్రవరి
(సి) 2022 మార్చ్
(డి) 2022 ఏప్రిల్
కీ (KEY) (GK TEST-42 YEAR : 2021)
1) సి 2) ఎ 3) సి 4) సి 5) బి 6) బి 7) డి 8) సి 9) ఎ 10) సి E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి