ఈ బ్లాగును సెర్చ్ చేయండి

27, మార్చి 2021, శనివారం

GK TEST-43 YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

Welcome To GK BITS IN TELUGU Blog

1. ఏ దేశ విద్యార్థులకు "సుబర్ణో జయంతి" ఉపకార వేతనాలు మంజూరు చేస్తామని భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' ప్రకటించారు ? 
(ఎ) బంగ్లాదేశ్ 
(బి) భూటాన్  
(సి) మయన్మార్  
(డి) శ్రీలంక 

2. నవీకరించిన 'స్పందన' పోర్టల్ ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' ప్రారంభించిన తేదీ ? 
(ఎ) 2021 మార్చ్ 24 
(బి) 2021 మార్చ్ 25  
(సి) 2021 మార్చ్ 26  
(డి) 2021 మార్చ్ 27 

3. 'మహీంద్రా అండ్ మహీంద్రా' కొత్త మేనేజింగ్ డైరెక్టర్, ముఖ్య కార్యనిర్వహణాధికారి (MD-CEO) గా 2021 ఏప్రిల్ 2న బాధ్యతలు స్వీకరించనున్నది ?  
(ఎ) అనీశ్ షా  
(బి) పవన్ గోయెంకా 
(సి) ఆనంద్ మహీంద్రా 
(డి) మనోజ్ ఆహూజా 



4. అంతరిక్షంలో మొక్కల ఎదుగుదలకు సహకరించే కొత్త రకం బ్యాక్టీరియా ఉన్నట్లు 'నాసా, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ (HCU)' పరిశోధకులు గుర్తించారు. అంతరిక్షం నుంచి సేకరించిన నమూనాల్లో 'మిథైలో బ్యాక్టీరియాసియె' కుటుంబానికి చెందిన బ్యాక్టీరియా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనకు నాయకత్వం వహించినది ? [మొత్తం నాలుగు రకాల స్ట్రెయిన్లను గుర్తించగా, వాటిల్లో ఒక రకం బ్యాక్టీరియా 'మిథైలోరుబ్రమ్ రోడెసియానమ్' గా తేలింది. మిగిలిన మూడు .. కొత్త తరహా బ్యాక్టీరియాగా తేల్చారు. జన్యు క్రమాల ఆధారంగా వీటికి 'మిథైలో బ్యాక్టీరియం ఇండికం' అనే రకానికి దగ్గరి పోలికలు ఉన్నట్లు కనుగొన్నారు. వీటికి ప్రముఖ భారత శాస్త్రవేత్త "అజ్మల్ ఖాన్" (AJMAL KHAN) పేరిట 'మిథైలో బ్యాక్టీరియం అజ్మల్లీ' గా నామకరణం చేశారు]       
(ఎ) డాక్టర్ రాంప్రసాద్  
(బి) ప్రొఫెసర్ పొదిలే అప్పారావు 
(సి) సీసీ వాంగ్ 
(డి) డాక్టర్ కస్తూరి వెంకటేశ్వరన్ 

5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన 'డ్రాయింగ్ డిస్బర్స్మెంట్ అధికారి' (DDO) బాధ్యతలను 'పంచాయతీ కార్యదర్శి' నుంచి "గ్రామ రెవెన్యూ అధికారి" (VRO) కి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన తేదీ ? [గ్రామ సచివాలయంలోని పంచాయతీ కార్యదర్శి (1వ గ్రేడ్ నుంచి 5వ గ్రేడ్), పంచాయతీలో రెగ్యులర్, ఒప్పంద, పొరుగు సేవల కింద పనిచేసే సిబ్బందికి మినహా సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ తో సహా మిగతా ఉద్యోగులందరికీ 'డీడీవో' (DDO) గా 'వీఆర్వో' (VRO) కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. గ్రామ వాలంటీర్లకు కూడా 'వీఆర్వో' (VRO) నే 'డీడీవో' (DDO) గా వ్యవహరిస్తారు]  
(ఎ) 2021 మార్చ్ 24   
(బి) 2021 మార్చ్ 25  
(సి) 2021 మార్చ్ 26  
(డి) 2021 మార్చ్ 27 

6. 'గ్రామ రెవెన్యూ అధికారి' (VRO) తో పాటు పంచాయతీలో పనిచేసే సిబ్బందికి 'డీడీవో' (DDO) గా వ్యవహరించేది ? 
(ఎ) గ్రామ సర్పంచ్ 
(బి) గ్రామ ఉప సర్పంచ్ 
(సి) పంచాయతీ కార్యదర్శి 
(డి) వీఆర్వో  



7. పంచాయతీ కార్యదర్శి మినహా గ్రామ సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న మిగతా ఉద్యోగులకు సాధారణ సెలవు కావాలంటే ఎవరి ద్వారా దరఖాస్తు వెళ్లాలి ? [కార్యదర్శులు, ఇతర సిబ్బందికి సాధారణ సెలవు మంజూరు చేసే అధికారాన్ని ప్రభుత్వం 'సర్పంచ్' లకు అప్పగించింది]   
(ఎ) వీఆర్వో 
(బి) పంచాయతీ కార్యదర్శి 
(సి) గ్రామ ఉప సర్పంచ్ 
(డి) ఈవో ఆర్డీ  

8. 'జాతీయ మౌలిక వసతులు, అభివృద్ధి పెట్టుబడుల బ్యాంకు' (NBFID) బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపిన తేదీ ? [మౌలిక వసతుల కల్పనకు నిధులు సమకూర్చడమే 'నాబ్ ఫిడ్' (NBFID) ప్రధాన ఉద్దేశ్యం. 'నాబ్ ఫిడ్' (NBFID) నేరుగా రిజర్వు బ్యాంకు నుంచి రుణాలు పొందుతుంది. 'నాబ్ ఫిడ్' (NBFID) కు ప్రభుత్వం రూ. 5,000 కోట్ల గ్రాంట్ ఇస్తూ .. రూ. 20 వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది]   
(ఎ) 2021 మార్చ్ 23  
(బి) 2021 మార్చ్ 24  
(సి) 2021 మార్చ్ 25 
(డి) 2021 మార్చ్ 26  

9. 'కొవిడ్-19' కారణంగా రుణ వాయిదాలు చెల్లించని వారికి ఇచ్చిన మినహాయింపు ఏ తేదీతో ముగిసింది ? [ఈ తేదీ ముగియడం వలన దివాలా చట్టం కింద రుణ పరిష్కార ప్రక్రియ చేపట్టడాన్ని పునరుద్ధరించినట్లు 'ఐబీబీఐ' (IBBI) చైర్ పర్సన్ 'ఎంఎస్ సాహూ' వెల్లడించారు]
(ఎ) 2021 మార్చ్ 23  
(బి) 2021 మార్చ్ 24 
(సి) 2021 మార్చ్ 25  
(డి) 2021 మార్చ్ 26  



10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ నూతన చైర్మన్ ? [జ్యుడీషియల్ సభ్యుడిగా 'డి.సుబ్రహ్మణ్యం', నాన్ జ్యుడీషియల్ సభ్యుడిగా 'జి.శ్రీనివాసరావు' నియమితులయ్యారు]  
(ఎ) జస్టిస్ నిస్సార్ అహ్మద్ 
(బి) జస్టిస్ రాకేశ్ కుమార్ 
(సి) జస్టిస్ జాస్తి చలమేశ్వర్ 
(డి) జస్టిస్ ఎం.సీతారాంమూర్తి              

కీ (KEY) (GK TEST-43 YEAR : 2021)
1) ఎ    2) సి    3) ఎ    4) డి    5) బి    6) సి    7) ఎ    8) సి    9) బి    10) డి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి