Welcome To GK BITS IN TELUGU Blog
1. ప్రపంచంలో నాలుగు మ్యాచ్ ల టెస్టు క్రికెట్ సిరీస్ లో 30 వికెట్లు పడగొట్టడంతో పాటు శతకం చేసిన తొలి ఆటగాడు ?
E & OE (Errors & Omissions Expected)
(ఎ) షేన్ వార్న్
(బి) అనిల్ కుంబ్లే
(సి) రవిచంద్రన్ అశ్విన్
(డి) ముత్తయ్య మురళీధరన్
2. 2021-22 బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'స్వచ్ఛంద వాహన తుక్కు విధానం' ప్రకారం .. 'యజమానులు పాత వాహనాలు వదిలించుకునేందుకు ప్రోత్సహించేలా, కొత్తవాటి కొనుగోలుపై ఎంత శాతం రాయితీని తయారీ సంస్థలు అందిస్తాయి ?
(ఎ) 5%
(బి) 10%
(సి) 15%
(డి) 20%
3. 'షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా' (SCI) వజ్రోత్సవాలతోపాటు 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' ను పురస్కరించుకొని 'ఎస్ సీ ఐ' కు చెందిన "స్వర్ణక్రిష్ణ" (SWARNA KRISHNA) అనే భారీ నౌకలో పూర్తిగా మహిళా సిబ్బందితో కూడిన నౌకా యాత్రను 'కేంద్ర రేవులు, నౌకాయాన శాఖ' మంత్రి 'మన్ సుఖ్ మాండవీయ' ప్రారంభించిన తేదీ ? [ప్రపంచ నౌకాయాన చరిత్రలో ఒక నౌకను పూర్తిగా మహిళా అధికారులే నడపడం ఇదే మొదటిసారి]
(ఎ) 2021 మార్చ్ 4
(బి) 2021 మార్చ్ 5
(సి) 2021 మార్చ్ 6
(డి) 2021 మార్చ్ 7
4. దేశ సరిహద్దులపై ఎప్పటికప్పుడు నిఘా వేయడానికి మరియు ప్రకృతి విపత్తులను శరవేగంగా పర్యవేక్షించడానికి కూడా ఉపయోగపడే "జీ ఐ శాట్ - 1" (GISAT-1) ఉపగ్రహాన్ని 'జీ ఎస్ ఎల్ వీ - ఎఫ్ 10' (GSLV-F10) రాకెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి 'ఇస్రో' (ISRO) ప్రయోగించనున్న తేదీ ? [ఈ ఉపగ్రహాన్ని అంతిమంగా .. భూమధ్య రేఖకు ఎగువన 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు]
(ఎ) 2021 మార్చ్ 28
(బి) 2021 మార్చ్ 29
(సి) 2021 మార్చ్ 30
(డి) 2021 మార్చ్ 31
5. 'స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ' (BWF SWISS OPEN SUPER 300 (BADMINTON)) లో 2021 మార్చ్ 7న 'బాసెల్' (స్విట్జర్లాండ్) లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షట్లర్, ప్రపంచ ఛాంపియన్ 'పి.వి.సింధు' పై 21-12, 21-5 స్కోర్ తో గెలిచిన "కరోలినా మారీన్" (CAROLINA MARIN) ది ఏ దేశం ?
(ఎ) స్పెయిన్
(బి) స్విట్జర్లాండ్
(సి) పోర్చుగల్
(డి) ఫ్రాన్స్
6. తన సహచర భారత బాక్సర్ (ఆశిష్ కుమార్ - 75 కేజీల విభాగం) కు 'కరోనా' పాజిటివ్ గా తేలడంతో 'బాక్సమ్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీ' (BOXHAM INTERNATIONAL BOXING TOURNAMENT) లో నిబంధనలకు లోబడి ఫైనల్ మ్యాచ్ ఆడకుండా 'వాకోవర్' (WALKOVER) ఇవ్వాల్సి రావడంతో 'రజతం' తో సరిపెట్టుకున్న "మహమ్మద్ హుసాముద్దిన్" (57 కేజీల విభాగం) స్వరాష్ట్రం ?
(ఎ) ఆంధ్రప్రదేశ్
(బి) తెలంగాణ
(సి) కర్ణాటక
(డి) కేరళ
7. మహిళా సాధికారతే లక్ష్యంగా సామాజిక మాధ్యమ వేదిక "హర్ సర్కిల్" (HER CIRCLE) ను ప్రారంభించినది ?
(ఎ) నీతా అంబానీ
(బి) పి.వి. సింధు
(సి) రాణి సురేందర్
(డి) షానీ దండా
8. వ్యాపార సంస్థల టర్నోవరు ఎంతకు మించితే 2021 ఏప్రిల్ 1 నుంచి 'ఇ-రశీదులు' తప్పనిసరిగా ఇవ్వాలని 'కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు' తెలిపింది ? ['జీ ఎస్ టీ చట్టం' (GST ACT) లో భాగంగా .. టర్నోవరు రూ. 500 కోట్లు మించిన వారికి 2020 అక్టోబర్ 1 నుంచి, రూ. 100 కోట్లు మించిన వారికి 2021 జనవరి 1 నుంచి 'ఇ-రశీదు' విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది]
(ఎ) రూ. 10 కోట్లు
(బి) రూ. 25 కోట్లు
(సి) రూ. 50 కోట్లు
(డి) రూ. 75 కోట్లు
9. దేశంలోనే 'పసుపు' (TURMERIC) పంటకు అత్యధిక ధర చెల్లిస్తున్న మార్కెట్ గా పేరొందిన "సాంగ్లీ" ఏ రాష్ట్రంలో ఉంది ?
(ఎ) కర్ణాటక
(బి) తెలంగాణ
(సి) మహారాష్ట్ర
(డి) గుజరాత్
10. వన్డే ఛేదనల్లో వరుసగా 10 అర్ధ సెంచరీలు సాధించి ప్రపంచ రికార్డు నమోదు చేసిన తొలి మహిళా క్రికెటర్ ? [న్యూజిలాండ్ క్రికెటర్ 'సుజీ బేట్స్' (వరుసగా 9 అర్ధ సెంచరీలు) పేరిట ఉన్న రికార్డును ఈమె తిరగరాసింది]
(ఎ) స్మృతి మంథాన
(బి) పూనమ్ రౌత్
(సి) మిథాలీ రాజ్
(డి) జులన్ గోస్వామి
కీ (KEY) (GK TEST-39 DATE : 2021 MARCH 7)
1) సి 2) ఎ 3) డి 4) ఎ 5) ఎ 6) బి 7) ఎ 8) సి 9) సి 10) ఎ E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి