వాలంటీర్లకు "సేవా" పురస్కారాలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
(AWARDS FOR VOLUNTEERS-ANDHRA PRADESH STATE)
- 'ఉగాది' నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటీర్లకు 'సేవా' పురస్కారాల కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' అధికారులను ఆదేశించారు.
- వాలంటీర్లలో పక్షపాతం, అవినీతికి తావులేకుండా సేవా దృక్పథాన్ని పెంచే ఉద్దేశంతో ఈ పురస్కారాలను అందిస్తారు.
- "సచ్చీలత, మొదటి మూడు రోజుల్లోగా పింఛన్ల పంపిణీ, హాజరు, యాప్ ల వినియోగం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, కొవిడ్ సర్వే" .. తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని పురస్కారాల కోసం వాలంటీర్లను ఎంపిక చేస్తారు.
"సేవా వజ్రం" :
- రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి ఐదుగురు గ్రామ, వార్డు వాలంటీర్లను ఎంపిక చేసి "సేవా వజ్రం" పేరిట పురస్కారం, బ్యాడ్జీ, పతకంతో పాటు రూ. 30 వేలు చొప్పున నగదు అందిస్తారు.
"సేవా రత్నం" :
- ప్రతి మండలం, పట్టణం నుంచి ఐదుగురు చొప్పున వాలంటీర్లను ఎంపిక చేసి వారికి "సేవా రత్నం" పురస్కారం, బ్యాడ్జీ, రూ. 20 వేలు చొప్పున నగదు అందిస్తారు.
"సేవా మిత్ర" :
- ఏడాది పాటు నిరంతరంగా సేవలందించిన వాలంటీర్ల పేర్లు పరిశీలించి "సేవా మిత్ర" పురస్కారం, బ్యాడ్జీ, రూ. 10 వేలు చొప్పున నగదు అందిస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి