1. 'కేంద్ర దర్యాప్తు సంస్థ' (CBI) కొత్త డైరెక్టర్ గా 2021 మే 26న బాధ్యతలు చేపట్టిన 'మహారాష్ట్ర' కేడర్ కు చెందిన 'ఐ పీ ఎస్' (IPS) అధికారి ? [ప్రధాన మంత్రి 'నరేంద్ర మోదీ' సారథ్యంలో సుప్రీకోర్టు చీఫ్ జస్టిస్ 'ఎన్వీ రమణ', లోక్ సభలో విపక్షనేత 'అధీర్ రంజన్ చౌధురి' లతో కూడిన త్రిసభ్య కమిటీ ఈ అధికారిని ఎంపిక చేసింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లపాటు అతను ఈ పదవిలో కొనసాగుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ 2021 మే 25న తెలిపింది]
(ఎ) రిషి కుమార్ శుక్లా
(బి) కుమార్ రాజేష్ చంద్ర
(సి) సుబోధ్ కుమార్ జైశ్వాల్
(డి) వీ ఎస్ కే కౌముది
2. 'జాతీయ టీకా కార్యక్రమ సాంకేతిక సలహా మండలి' (NTAGI) ప్రస్తుత చైర్మన్ ? [సమాచార తేదీ : 2021 మే 25]
(ఎ) డాక్టర్ ఎన్.కె. అరోడా
(బి) డాక్టర్ బలరాం భార్గవ
(సి) డాక్టర్ మన్నం గోపీచంద్
(డి) డాక్టర్ తర్జనీ వివేక్ దవే
3. సామాజిక మాధ్యమాలు, వార్తా సైట్లు, ఓటీటీ వేదికలకు సంబంధించి .. భారత కేంద్ర ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలో ప్రకటించిన కొత్త ఐటీ నియమ నిబంధనలు 2021 మే 26 నుంచి అమల్లోకి వచ్చాయి. కానీ ఈ నిబంధనల్లోని 4(2) నియమం 'భారత రాజ్యాంగం' కల్పించిన భావ ప్రకటన స్వేచ్చకు విరుద్ధమని, దీన్ని కొట్టేయాలని కోరుతూ 2021 మే 25న 'దిల్లీ హైకోర్టు' (DELHI HIGH COURT) లో పిటిషన్ దాఖలు చేసిన ప్రముఖ సామాజిక మాధ్యమం ?
(ఎ) ట్విటర్
(బి) పేస్ బుక్
(సి) వాట్సాప్
(డి) గూగుల్
4. టోల్ గేట్ల వద్ద వాహనాల వరుస ఎన్ని మీటర్లకు మించి ఉండకూడదని స్పష్టం చేస్తూ .. రహదారి నిర్వాహకులకు 'జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ' (NHAI) మార్గదర్శకాలు జారీ చేసింది ? [జాతీయ రహదారుల్లో రద్దీ గరిష్ఠంగా ఉన్న సమయంలోనూ టోల్ గేట్ల వద్ద ఒక్కో వాహనం 10 సెకన్లకు మించి వేచి ఉండటానికి వీల్లేదని 'ఎన్ హెచ్ ఏ ఐ' (NHAI) పేర్కొంది. (సమాచార తేదీ : 2021 మే 26)]
(ఎ) 50
(బి) 100
(సి) 150
(డి) 200
5. 'భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ' (DRDO) రూపొందించి, నూతన సాంకేతికతతో తయారు చేసిన 'ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంటు' దేశంలోనే ప్రథమంగా ఏ ప్రభుత్వాసుపత్రిలో ప్రారంభమైంది ?
(ఎ) ఏలూరు (పశ్చిమగోదావరి జిల్లా)
(బి) గుంటూరు (గుంటూరు జిల్లా)
(సి) కాకినాడ (తూర్పుగోదావరి జిల్లా)
(డి) హిందూపురం (అనంతపురం జిల్లా)
6. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే 'గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్' (GATE-22) లో మరో రెండు సబ్జెక్టు (నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజినీరింగ్, జియోమేటిక్ ఇంజినీరింగ్) లను చేర్చాలని 'ఐఐటీ' (IIT) లు నిర్ణయించాయి. అదనంగా ప్రవేశపెట్టిన ఈ రెండు పేపర్లతో కలిపి మొత్తం ఎన్ని సబ్జెక్టుల్లో 'గేట్-22' (GATE-22) పరీక్ష జరగనుంది ? ['గేట్-22' (GATE-22) పరీక్ష నిర్వహణ బాధ్యత '\ఐఐటీ-ఖరగ్ పుర్' (IIT-KHARAGPUR) కు దక్కింది]
(ఎ) 25
(బి) 27
(సి) 29
(డి) 23
7. 'ప్రపంచ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్' (WORLD JUNIOR WEIGHTLIFTING CHAMPIONSHIP) లో 73 కేజీల విభాగంలో 'రజతం' సాధించిన భారత ఆటగాడు ? [2021 మే 26న జరిగిన పోటీలో ఈ ఆటగాడు 313 కిలోల (స్నాచ్ 141 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ 172 కేజీలు) బరువులు ఎత్తాడు]
(ఎ) అచింత షులి
(బి) సెరోబియన్ గెవోర్గ్
(సి) జెరెమీ లాల్రినుగా
(డి) జునియన్ షా రిజ్కి
8. 2021 మే 26న ఉదయం 'ఒడిశా' లోని బాలేశ్వర్ జిల్లాకు చేరువలోని "బహనాగ" (BAHANAGA) వద్ద 'యాస్' (YAAS CYCLONE) తుఫాను తీరాన్ని తాకింది. ఈ తుఫానుకు 'యాస్' అనే పేరును 'ఒమన్' (OMAN) దేశం సూచించింది. అక్కడి భాషలో 'యాస్' అంటే ఏమని అర్ధం ?
(ఎ) లిల్లీ పువ్వు
(బి) మందార పువ్వు
(సి) మల్లె పువ్వు
(డి) గులాబీ పువ్వు
9. 'అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ' (IOC) ప్రస్తుత అధ్యక్షుడి పేరు ? [సమాచార తేదీ : 2021 మే 19]
(ఎ) టెడ్రోస్ అథనామ్
(బి) థామస్ బాక్
(సి) నరిందర్ బాత్రా
(డి) జాన్ కోట్స్
10. 'కొవిడ్-19' (COVID-19) కారణంగా తల్లిదండ్రులు చనిపోయి అనాథలైన పిల్లల (18 ఏళ్ల లోపు వయసున్నవారు) సంరక్షణ కోసం 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం' ఎంత మొత్తాన్ని జాతీయ బ్యాంక్ లో డిపాజిట్ (EX-GRATIA AS FDs FOR CHILDREN) చేస్తుంది ?
(ఎ) రూ. 5 లక్షలు
(బి) రూ. 10 లక్షలు
(సి) రూ. 15 లక్షలు
(డి) రూ. 20 లక్షలు
కీ (KEY) (GK TEST-67 YEAR : 2021)
1) సి 2) ఎ 3) సి 4) బి 5) డి 6) సి 7) ఎ 8) సి 9) బి 10) బి E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com



కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి