Welcome To GK BITS IN TELUGU Blog
1. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) "బిలీవ్ ఇన్ స్పోర్ట్స్" (BELIEVE IN SPORTS) ప్రచారానికి 'అథ్లెట్ రాయబారులు' (ATHLETE AMBASSADORS) గా 'పీవీ సింధు (భారత్), మిచెల్లె లీ' ఎంపికయ్యారని 'ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య' (BWF) 2021 మే 3న ప్రకటించింది. 'మిచెల్లె లీ' ఏ దేశానికి చెందిన షట్లర్ ? [ఈ ఇద్దరు అగ్రశ్రేణి షట్లర్లు అంతర్జాల వెబినార్లు, సామాజిక మాధ్యమాల సందేశాల ద్వారా బ్యాడ్మింటన్ ప్లేయర్లకు అవగాహన కల్పిస్తారు]
(ఎ) చైనా
(బి) ఇండోనేషియా
(సి) అమెరికా
(డి) కెనడా
2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాసంస్థలు, సర్వీసుల్లో వెనకబడిన కులాల (ఏ, బీ, సీ, డీ, ఈ) కు రిజర్వేషన్లను మరో పదేళ్లపాటు పొడిగించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన తేదీ ? [ఉద్యోగాల భర్తీకి గరిష్ఠ వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు ఇచ్చింది. 2021 జూన్ 1 నుంచి 2031 మే 31 వరకు ఈ రిజర్వేషన్లను వర్తింపజేస్తారు]
(ఎ) 2021 మే 1
(బి) 2021 మే 2
(సి) 2021 మే 3
(డి) 2021 మే 4
3. రెండో దశ కొవిడ్ గ్రామాలకు విస్తరిస్తుండడంతో .. వీటిని నియంత్రించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన కొన్ని మార్గదర్శకాల ప్రకారం 'గ్రామాల్లో మాస్క్ పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై విధించే కనిష్ఠ, గరిష్ఠ జరిమానాలు' వరుసగా ... ? [సర్పంచి అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించి తీర్మానం చేసి అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది] తేదీ : 2021 మే 4.
(ఎ) రూ. 50, రూ. 100
(బి) రూ. 50, రూ. 200
(సి) రూ. 50, రూ. 300
(డి) రూ. 50, రూ. 500
4. తన ఎం.టి.30 మెరైజ్ ఇంజిన్ల ప్యాకేజింగ్, ఇన్స్టలేషన్, మార్కెటింగ్ సేవలకు సాయం కోసం 'హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్' (HAL) తో 2021 మే 4న ఒప్పందం కుదుర్చుకున్న 'రోల్స్ రాయిస్' (ROLLS-ROYCE) సంస్థది ఏ దేశం ?
(ఎ) ఇంగ్లాండ్
(బి) జర్మనీ
(సి) ఫ్రాన్స్
(డి) స్విట్జర్లాండ్
5. బాలీవుడ్ నటి 'కంగనా రనౌత్' (KANGANA RANAUT) పదే పదే నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ .. ఆమె ఖాతాను శాశ్వతంగా రద్దు చేసిన ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ? [ప్రత్యేకించి 'విద్వేషపూరిత ప్రవర్తన, దుర్భాషలాడే స్వభావం నిబంధన' కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సామాజిక మాధ్యమ వేదిక 2021 మే 4న ఓ ప్రకటనలో వెల్లడించింది]
(ఎ) ట్విటర్
(బి) ఇన్స్టాగ్రామ్
(సి) పేస్ బుక్
(డి) లింక్డ్ ఇన్
6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు (RTI) కమిషనర్లుగా న్యాయవాది 'కాకర్ల చెన్నారెడ్డి', పాత్రికేయుడు 'ఉల్చాల హరిప్రసాదరెడ్డి' లను ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' సారధ్యంలోని కమిటీ 2021 మే 4న ఎంపిక చేసింది. వీరితో కలిపి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ లో ఉన్న మొత్తం కమిషనర్ల సంఖ్య ?
(ఎ) 5
(బి) 6
(సి) 7
(డి) 8
7. 2021 మే 23 వరకు లభించిన సమాచారం మేరకు .. "బిద్యాదేవి భండారి" (BIDYA DEVI BHANDARI) ఏ దేశానికి అధ్యక్షురాలిగా ఉన్నారు ?
(ఎ) నేపాల్
(బి) శ్రీలంక
(సి) భూటాన్
(డి) మయన్మార్
8. భారత్ నుంచి "సమగ్ర వ్యూహాత్మక భాగస్వామి" (COMPREHENSIVE STRATEGIC PARTNERSHIP) హోదా పొందిన మొట్టమొదటి ఐరోపా దేశం ? [ఈ దేశ ప్రధాని మరియు భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' ల మధ్య 2021 మే 4న వర్చువల్ విధానంలో జరిగిన భేటీలో '2030 మార్గసూచీ' (ROADMAP 2030) పై చర్చించారు]
(ఎ) ఫ్రాన్స్
(బి) జర్మనీ
(సి) స్పెయిన్
(డి) బ్రిటన్
9. భారతదేశంలోనే తొలిసారిగా ఏ జంతుప్రదర్శనశాల (ZOO) లో 8 ఆసియా సింహాలకు 'కరోనా' వైరస్ సోకినట్లు 2021 మే 4న నిర్ధారణ అయ్యింది ?
(ఎ) నందన్ కానన్ జూలాజికల్ పార్క్ - భువనేశ్వర్
(బి) నెహ్రూ జూలాజికల్ పార్క్ - హైదరాబాద్
(సి) పద్మజ నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ - డార్జిలింగ్
(డి) ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ - విశాఖపట్నం
10. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదంటూ 'ఇందిరా సాహ్నీ' (Indra Sawhney Etc. Etc Vs Union of India and Others, Etc. ...) కేసులో సుప్రీంకోర్టు 9 మంది సభ్యుల ధర్మాసనం తీర్పునిచ్చిన తేదీ ? ['మండల్ తీర్పు' గా అభివర్ణించే ఈ తీర్పు ప్రకారం .. 'కొన్ని ప్రత్యేకమైన, అసాధారణ' పరిస్థితుల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉంది]
(ఎ) 1992 నవంబర్ 16
(బి) 1993 నవంబర్ 16
(సి) 1994 నవంబర్ 16
(డి) 1995 నవంబర్ 16
కీ (KEY) (GK TEST-63 YEAR : 2021)
1) డి 2) డి 3) బి 4) ఎ 5) ఎ 6) డి 7) ఎ 8) డి 9) బి 10) ఎ E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com



కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి