ఈ బ్లాగును సెర్చ్ చేయండి

19, మే 2021, బుధవారం

GK TEST-64 YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

Welcome To GK BITS IN TELUGU Blog

1. ఏ తేదీ నుంచి 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (LIC) కార్యాలయాలన్నీ 'సోమవారం నుండి శుక్రవారం' (MONDAY TO FRIDAY) వరకు మాత్రమే పనిచేస్తాయి ? [ఎస్.ఓ. 1630 (ఇ) తేదీ 2021 ఏప్రిల్ 15 నాటి నోటిఫికేషన్ ప్రకారం .. కేంద్ర ప్రభుత్వం ప్రతి శనివారాన్ని 'ఎల్ ఐ సీ' (www.licindia.in) కు సెలవు దినంగా ప్రకటించింది. LIC కార్యాలయాలు సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 : 00 నుంచి సాయంత్రం 05 : 30 గంటల వరకు పనిచేస్తాయి]    
(ఎ) 2021 మే 5 
(బి) 2021 మే 10  
(సి) 2021 మే 15  
(డి) 2021 మే 20 

2. 2020లో రుణ పునర్నిర్మాణం చేయని వ్యక్తులు, చిన్న, మధ్య స్థాయి కంపెనీలకు రెండేళ్లపాటు రుణ పునర్నిర్మాణం చేసుకోవడానికి 'ఆర్ బీ ఐ' (RBI) అవకాశం ఇచ్చింది. ఎంత మొత్తం వరకు రుణాలున్న వారికి ఈ సదుపాయం వర్తిస్తుంది ? [2021 మార్చ్ నెల నాటికి ఎవరి ఖాతాలు అయితే 'ప్రామాణికం' గా వర్గీకరించి ఉంటాయో వారికే ఈ సౌకర్యం వర్తిస్తుంది] 

(ఎ) రూ. 25 కోట్లు 
(బి) రూ. 50 కోట్లు  
(సి) రూ. 75 కోట్లు  
(డి) రూ. 100 కోట్లు 

3. ఆరోగ్య సంరక్షణ రంగానికి చెందిన 'టీకా తయారీదార్లు, టీకా-ముఖ్యమైన వైద్య పరికరాలను దిగుమతి చేసుకునేవారు, సరఫరా చేసేవారికి, ఆసుపత్రులకు, ఇతరత్రా ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులకు' తాజా రుణాల రూపంలో అందించడానికి బ్యాంకులకు 'ఆర్ బీ ఐ' (RBI) రూ. 50,000 కోట్ల ద్రవ్యలభ్యతను అందించనుంది. ఈ రుణాలు ఏ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి ? [మూడేళ్ల వ్యవధి ఉండే ఈ రుణాలను 'రేపో' (REPO) రేటు వద్ద పొందొచ్చు]  

(ఎ) 2022 మార్చ్ 31  
(బి) 2023 మార్చ్ 31 
(సి) 2024 మార్చ్ 31 
(డి) 2025 మార్చ్ 31 



4. 2021 మే 5న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా "మమతా బెనర్జీ" (MAMATA BANERJEE) ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ఈ పదవిని చేపట్టడం వరసగా ఇది ఎన్నోసారి ?
MAMATA BANERJEE

  

(ఎ) 1 
(బి) 2 
(సి) 3 
(డి) 4 

5. 'ఉపాధ్యాయుల్లో వృత్తిపరమైన అభివృద్ధి, విద్యార్థుల అభ్యసనను అంచనా వేసే పద్ధతుల్లో సంస్కరణలు తీసుకొచ్చి సామర్థ్య ఆధారిత బోధనాభ్యసన విద్యావిధానాన్ని పెంపొందించడం, సమాజ భాగస్వామ్యంతో సంస్థాగత సామర్థ్యాలను పెంపొందించడం' అనే ప్రధాన లక్ష్యాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న "అభ్యసన పరివర్తన ప్రాజెక్ట్" కు ప్రపంచ బ్యాంకు (WORLD BANK) అందించే రుణ సాయం విలువ ? 

(ఎ) రూ. 2,160 కోట్లు   
(బి) రూ. 2,060 కోట్లు  
(సి) రూ. 1,960 కోట్లు  
(డి) రూ. 1,860 కోట్లు 

6. 'డీ ఎం కే' (DMK) అధ్యక్షుడు "ఎం.కే. స్టాలిన్" (MK STALIN) తమిళనాడు రాష్ట్రానికి ఎన్నవ ముఖ్యమంత్రిగా 2021 మే 7న గిండీలోని రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు ?
MK STALIN

  

(ఎ) 12 
(బి) 13 
(సి) 14 
(డి) 15 



7. 'ఎన్నార్ కాంగ్రెస్' అధ్యక్షుడు "రంగసామి" (N.RANGASAMY) 2021 మే 7న 'పుదుచ్చేరి' ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అతను ఈ పదవిని చేపట్టడం ఇది ఎన్నోసారి ?
N RANGASAMY

 

(ఎ) 1 
(బి) 2 
(సి) 3 
(డి) 4 

8. రొమ్మును స్కాన్ చేసి 'కొవిడ్-19' (COVID-19) కారక ఇన్ఫెక్షన్ ను 96.73 % కచ్చితత్వంతో గుర్తించగల "అట్ మాన్" ఏఐ టూల్ (ATMAN AI TOOL) ను అభివృద్ధి చేసిన సంస్థలు ? [త్వరలో దేశవ్యాప్తంగా 1000 ఆసుపత్రుల్లో ఈ డిజిటల్ నెట్వర్క్ ను అందుబాటులోకి తేనున్నారు ]  

(ఎ) డీ ఆర్ డీ ఓ, సీ ఏ ఐ ఆర్   
(బి) డీ ఆర్ డీ ఓ, ఎన్ ఎస్ టీ ఎల్  
(సి) డీ ఆర్ డీ ఓ, ఇన్ఫోసిస్ 
(డి) డీ ఆర్ డీ ఓ, టీ సీ ఎస్  

9. 'కరోనా' నియంత్రణలో 'నరేంద్ర మోదీ' నేతృత్వంలోని భారత ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ప్రఖ్యాత మెడికల్ జర్నల్ "లాన్సెట్" (LANCET) తన ఏ తేదీ సంచికలో విమర్శనాత్మక సంపాదకీయం రాసింది ?

(ఎ) 2021 మే 6 
(బి) 2021 మే 7 
(సి) 2021 మే 8  
(డి) 2021 మే 9  



10. 2021 ఏప్రిల్ 9న భారత్ లో ప్రారంభమైన 'ఐ పీ ఎల్-14' (IPL-14) క్రికెట్ టోర్నమెంట్ అర్ధంతరంగా ఆగిపోయిన తేదీ ? [24 గంటల వ్యవధిలో 'ఐ పీ ఎల్' లీగ్ పరిధిలో ఆరుగురు క్రికెటర్లకు 'కరోనా' సోకడంతో 'ఐ పీ ఎల్-14' (IPL-14) ను నిరవధికంగా వాయిదా వేశారు]   

(ఎ) 2021 మే 2 
(బి) 2021 మే 3 
(సి) 2021 మే 4 
(డి) 2021 మే 5              

కీ (KEY) (GK TEST-64 YEAR : 2021)
1) బి    2) ఎ    3) ఎ    4) సి    5) డి    6) సి    7) డి    8) ఎ    9) సి    10) సి  

UPDATE (నవీకరణ) :

  • 'సంగం డెయిరీ' ని స్వాధీనం చేసుకొంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2021 ఏప్రిల్ 27న ఇచ్చిన 'జీవో 19' అమలును నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు 2021 మే 7న ఉత్తర్వులిచ్చింది. 

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి