మానవ శరీరంలో చాలా రకాల యాంటీబాడీలు ఉంటాయి. వైరస్ కు వ్యతిరేకంగా పనిచేసేవి కొన్నే ఉంటాయి. అటువంటి వాటిలో 'టసిరిబిమాబ్, ఇమిడెవిమాబ్' అనే రెండు రకాలున్నాయి. వాటిని సేకరించి కొత్త యాంటీబాడీలను వృద్ధి చేస్తారు. ఇలా ప్రత్యేకంగా ఒకట్రెండు రకాలనే సేకరించి వృద్ధి చేసే విధానాన్ని "మోనోక్లోనల్ యాంటీబాడీస్" (MONOCLONAL ANTIBODIES) అంటారు.
![]() |
| మోనోక్లోనల్ యాంటీబాడీస్ (ఆకుపచ్చ రంగులో ఉన్నవి) |
ఈ రెండూ ఇంజక్షన్ల రూపంలో లభిస్తాయి. ఈ రెండింటినీ కలిపి ఒకే మోతాదులో శరీరంలోకి 'ఐవీ' (IV) ద్వారా ఎక్కిస్తారు. దీని ధర ప్రస్తుతం (సమాచార తేదీ : 2021 మే 27) రూ. 70 వేల వరకూ ఉంది.
'అమెరికా' (USA) మాజీ అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' కొవిడ్ బారిన పడినప్పుడు 'మోనోక్లోనల్ యాంటీబాడీలను' ఎక్కించారు. ఫలితంగా రెండు రోజుల్లోనే ట్రంప్ కోలుకున్నారు.



కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి