1. 'అమెజాన్' (AMAZON) సంస్థ 'సీ ఈ ఓ' (CEO) బాధ్యతల నుంచి "జెఫ్ బెజోస్" (JEFF BEZOS) వైదొలిగే తేదీ ? [ఈ తేదీ నుంచి 'అమెజాన్' సంస్థ కొత్త 'సీ ఈ ఓ' (CEO) గా 'ఆండీ జాస్సీ' (ANDY JASSY) బాధ్యతలు చేపట్టనున్నారు. సరిగ్గా 27 ఏళ్ల క్రితం ఇదే తేదీన 'అమెజాన్' కార్పొరేట్ సంస్థగా మారింది]
(ఎ) 2021 జూలై 3
(బి) 2021 జూలై 4
(సి) 2021 జూలై 5
(డి) 2021 జూలై 6
2. ఒక్క డోసులో ఇచ్చే 'కరోనా' టీకా (SINGLE DOSE 'CORONA' VACCINE) ? [ఇది అందుబాటులోకి వస్తే భారతదేశంలో ఇచ్చే తొలి 'సింగిల్ డోసు టీకా' ఇదే అవుతుంది]
(ఎ) కొవావ్యాక్స్
(బి) స్పుత్నిక్ వి
(సి) స్పుత్నిక్ లైట్
(డి) కొవాగ్జిన్
3. మహిళా టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు (24) గెలిచి, 'ఆల్ టైమ్ గ్రేట్' (ALL TIME GREAT IN WOMEN'S TENNIS HISTORY) గా భావించబడుతున్న క్రీడాకారిణి ?
(ఎ) మార్గరెట్ కోర్ట్
(బి) మార్టీనా నవ్రతిలోవా
(సి) సెరెనా విలియమ్స్
(డి) స్టెఫీగ్రాఫ్
4. నేపాల్ కు చెందిన 'టెన్సింగ్ నార్కే', న్యూజీలాండ్ దేశస్థుడు 'ఎడ్మండ్ హిల్లరీ' సంయుక్తంగా 'ఎవరెస్టు' (MOUNT EVEREST) శిఖరాన్ని అధిరోహించిన తేదీ ? [అందుకే ఈ తేదీని 'అంతర్జాతీయ ఎవరెస్టు దినోత్సవం' గా ప్రకటించారు]
(ఎ) 1953 మే 28
(బి) 1953 మే 29
(సి) 1953 మే 30
(డి) 1953 మే 31
5. 'కరోనా' నియంత్రణ కోసం 'భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ' (DRDO) రూపొందించిన "2-డీజీ" (2-DG) మందు ఒక్కో పొట్లం ధరను ఎంతగా నిర్ణయించారు ? ['ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్' , డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ సంయుక్తంగా ఈ మందును ఉత్పత్తి చేస్తున్నాయి. పొడి రూపంలో వచ్చే ఈ మందును నీళ్లలో కలుపుకొని తాగడం ద్వారా వైరస్ ను నియంత్రించవచ్చని 'డీ ఆర్ డీ ఓ' (DRDO) ప్రకటించింది. మధ్యస్థాయి నుంచి తీవ్రమైన కరోనా లక్షణాలున్న రోగుల చికిత్స కోసం దీన్ని విక్రయించనున్నారు]
(ఎ) రూ. 960
(బి) రూ. 970
(సి) రూ. 980
(డి) రూ. 990
6. ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి వలస వచ్చి .. గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లోని 13 జిల్లాల్లో నివశిస్తున్న ముస్లిమేతర శరణార్థులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని 'కేంద్ర హోంశాఖ' నోటిఫికేషన్ (NOTIFICATION FOR INDIAN CITIZENSHIP APPLICATION) జారీ చేసిన తేదీ ? [ముస్లిమేతర మైనార్టీలుగా 'హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైన్ లు, పార్శీలు, క్రైస్తవులు' తదితరులను పేర్కొంది. పౌరసత్వ చట్టం-1955 కింద, 2009లో చేసిన చట్టంలోని నిబంధనల కింద ఈ నోటిఫికేషన్ ను ప్రభుత్వం జారీ చేసింది]
(ఎ) 2021 మే 26
(బి) 2021 మే 27
(సి) 2021 మే 28
(డి) 2021 మే 29
7. 'కరోనా' కారణంగా తల్లిదండ్రులను కోల్పోయినవారు, ఉన్న ఒక తల్లినో తండ్రినో పోగొట్టుకున్నవారు, చట్టపరమైన సంరక్షకులు, దత్తత తల్లిదండ్రులను కోల్పోయిన వారందరికీ "పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్" (PM CARES FOR CHILDREN) పథకం ద్వారా ప్రతి చిన్నారి 18 ఏళ్లకు చేరుకునే సమయానికి వారి పేరున రూ. 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మూలనిధిగా ఉపయోగిస్తామని ప్రధాని 'నరేంద్ర మోదీ' 2021 మే 29న ప్రకటించారు. అటువంటి పిల్లలు ఏ వయసుకు వచ్చిన తర్వాత రూ. 10 లక్షల నిధిని వ్యక్తిగత, వృత్తిగత అవసరాలకోసం తీసుకోవడానికి వీలు కల్పిస్తారు ?
(ఎ) 18 సంవత్సరాలు
(బి) 21 సంవత్సరాలు
(సి) 23 సంవత్సరాలు
(డి) 25 సంవత్సరాలు
8. ఉద్యోగి మృతి చెందితే వర్తింపజేసే 'కార్మిక రాజ్య బీమా సంస్థ' (ESIC) పింఛను పథకం ప్రయోజనాన్ని 'కొవిడ్' తో మృతి చెందినా బాధిత కుటుంబాలకూ వర్తింపజేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. మరణించిన వ్యక్తిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు దివంగత ఉద్యోగి రోజువారీ వేతనంలో సగటున ఎంత శాతానికి సమానమైన మొత్తాన్ని పింఛను కింద అందించనున్నారు ?
(ఎ) 60%
(బి) 70%
(సి) 80%
(డి) 90%
9. ఎన్ఠీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'ఎన్ఠీఆర్ సాహిత్య పురస్కారం' ను పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్య, సంచాలకుడు ? [ఈ పురస్కారాన్ని విద్యా శాఖ మంత్రి 'ఆదిమూలపు సురేష్' 2021 మే 29న 'ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం' (ANU) లో విజేతకు అందజేశారు]
(ఎ) బుడితి రాజశేఖర్
(బి) వాడ్రేపు చినవీరభద్రుడు
(సి) ఆచార్య హేమచంద్రా రెడ్డి
(డి) ధూళిపాళ్ల రామకృష్ణ
10. 'కొవిడ్' నియంత్రణ చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఎన్ని సాధికార కమిటీలను (EMPOWERMENT COMMITTEES FOR COVID CONTROL MEASURES) ఏర్పాటు చేసింది ? [ఒక్కో కమిటీలో కనిష్ఠంగా 9, గరిష్ఠంగా 12 మంది విభిన్న శాఖలకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను సభ్యులుగా నియమించారు. (సమాచార తేదీ : 2021 మే 29)]
(ఎ) 5
(బి) 10
(సి) 15
(డి) 20
కీ (KEY) (GK TEST-68 YEAR : 2021)
1) సి 2) సి 3) ఎ 4) బి 5) డి 6) సి 7) సి 8) డి 9) బి 10) బి UPDATES (నవీకరణలు) :
- 2021 జూన్ 7 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన 10వ తరగతి పరీక్షలను వాయిదా వేసినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి 'ఆదిమూలపు సురేష్' 2021 మే 27న వెల్లడించారు.
- 'కరోనా' ఉద్ధృతి, విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా 'సీఎం' వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.
E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి