ఈ బ్లాగును సెర్చ్ చేయండి

26, మే 2021, బుధవారం

ఈ-కోర్ట్స్ సర్వీసెస్ మొబైల్ యాప్ ∣ E-COURTS SERVICES MOBILE APP DETAILS IN TELUGU

కోర్టుల్లో నడుస్తున్న కేసుల స్థితిగతులను తెలిపే "ఈ-కోర్ట్స్ సర్వీసెస్ మొబైల్ యాప్" (E-COURTS SERVICES MOBILE APP) సేవలను భారత సుప్రీంకోర్టు తెలుగు సహా దేశంలోని 14 ప్రధాన భాషల్లోకి అందుబాటులోకి తెచ్చింది.



"ఈ-కోర్ట్స్ సర్వీసెస్ మొబైల్ యాప్" (E-COURTS SERVICES MOBILE APP) ద్వారా 'కక్షిదారులు, సాధారణ ప్రజలు, న్యాయవాదులు, పోలీసులు, ప్రభుత్వ సంస్థలు' కేసుల స్థితిగతులను తెలుసుకోవడానికి వీలవుతుంది.

2021 మే 24 నాటికి "ఈ-కోర్ట్స్ సర్వీసెస్ మొబైల్ యాప్" (E-COURTS SERVICES MOBILE APP) ను 57 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నట్లు 'కేంద్ర న్యాయ శాఖ' పేర్కొంది.



కరోనా కాలంలో ప్రజలకు సులువుగా సమాచారం అందించేందుకే "ఈ-కోర్ట్స్ సర్వీసెస్ మొబైల్ యాప్" (E-COURTS SERVICES MOBILE APP) ను తెచ్చినట్లు 'సుప్రీకోర్టు ఈ-కమిటీ' (SUPREME COURT E-COMMITTEE) చైర్మన్ 'జస్టిస్ డీవై చంద్రచూడ్' పేర్కొన్నారు.

"ఈ-కోర్ట్స్ సర్వీసెస్ మొబైల్ యాప్" (E-COURTS SERVICES MOBILE APP) లో కేసు, సీ ఎన్ ఆర్, ఫైలింగ్ నంబర్లు, పార్టీ పేర్లు, ఎఫ్ ఐ ఆర్ నెంబర్, న్యాయవాది వివరాల ఆధారంగా శోధించవచ్చు. కేసు విచారణ ముగిసే వరకు చరిత్ర అందుబాటులో ఉంటుంది.



హైకోర్టు, జిల్లా కోర్టుల్లో ఉన్న కేసుల ఆర్డర్లు, జడ్జిమెంట్లు, బదిలీ వివరాలు తెలుసుకోవచ్చు. 'మై కేసెస్' (MY CASES) కింద న్యాయవాదులు, కక్షిదారులు, న్యాయసంస్థలు 'డిజిటల్ డైరీ' (DIGITAL DIARY) నిర్వహించుకోవచ్చు. ఒకసారి ఇందులో కేసు నెంబర్లు నమోదు చేస్తే దానికి సంబంధించిన అప్డేట్స్ (UPDATES) నిరంతరం వస్తాయి.

24 గంటలూ "ఈ-కోర్ట్స్ సర్వీసెస్ మొబైల్ యాప్" (E-COURTS SERVICES MOBILE APP) సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయని 'కేంద్ర న్యాయ శాఖ' తెలిపింది.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి