ఈ బ్లాగును సెర్చ్ చేయండి

20, మే 2021, గురువారం

GK TEST-65 YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

Welcome To GK BITS IN TELUGU Blog

1. ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్ లక్షణాలున్న వారికి కూడా ఉపయోగపడే "2-డియాక్సీ డి-గ్లూకోజ్" (2-DG) ఔషధాన్ని అభివృద్ధి చేసిన సంస్థ ? [రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పరీక్షలలో ఈ మందు సమర్ధంగా పనిచేస్తుండడంతో అత్యవసర వినియోగానికి 'డీ సీ జీ ఐ' (DCGI) అనుమతి ఇచ్చింది]
   
(ఎ) ఫైజర్  
(బి) ఐ ఐ ఎల్  
(సి) డీ ఆర్ డీ ఓ   
(డి) హెటిరో డ్రగ్స్ 

2. కెరీర్లో వందో పోల్ పొజిషన్ సాధించి ఆ ఘనత సొంతం చేసుకున్న తొలి ఫార్ములా వన్ రేసర్ (FORMULA ONE RACER) గా చరిత్ర సృష్టించినది ?  

(ఎ) జొస్ వెర్స్టాపెన్   
(బి) వాల్టెరి బొటాస్  
(సి) లూయిస్ హామిల్టన్   
(డి) సెబాస్టియన్ వెట్టెల్ 

3. భారతదేశంలో 'కరోనా' కారణంగా పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్న నేపథ్యంలో .. పరిస్థితులను సమీక్షించి, అవసరాలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకొని మార్గదర్శనం చేసేందుకు దేశంలోని 12 మంది నిష్ణాతులతో ఒక జాతీయ టాస్క్ ఫోర్స్ (NATIONAL TASK FORCE) ను ఏర్పాటుచేస్తూ 'జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఆర్.షా' ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసిన తేదీ ? [టాస్క్ ఫోర్స్ పదవీ కాలాన్ని 6 నెలలుగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది]  

(ఎ) 2021 మే 5  
(బి) 2021 మే 6 
(సి) 2021 మే 7 
(డి) 2021 మే 8 



4. అస్సాం (ASSAM) రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా 2021 మే 10న ప్రమాణ స్వీకారం చేసినది ? [ఇతనికి ఈశాన్య భారతంలో 'సంక్షోభాల పరిష్కర్తగా' మంచి పేరుంది] 

(ఎ) శర్బానంద సోనోవాల్ 
(బి) హిమంత బిశ్వశర్మ  
(సి) అతుల్ బొరా  
(డి) రంజిత్ దత్తా  

5. రాళ్లను సజీవ శిల్పాలుగా తీర్చిదిద్ది అంతర్జాతీయంగా కళింగ ఖ్యాతి, ప్రతిష్ఠను చాటిచెప్పిన ప్రముఖ శిల్పాచార్యుడు (ARCHITECT, SCULPTOR) ? ['కొవిడ్' కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2021 మే 9న కన్నుమూశారు. ఇతను 1975లో 'పద్మశ్రీ', 2001లో 'పద్మభూషణ్', 2013లో 'పద్మవిభూషణ్' పురస్కారాలను అందుకున్నారు] 

(ఎ) జగ్మోహన్ మల్హోత్రా   
(బి) రఘునాథ మహాపాత్ర్   
(సి) రామ్ కింకర్ బైజ్    
(డి) శంఖు చౌదరి 

6. 2021 మే 9న ముగిసిన 'మాడ్రిడ్ ఓపెన్ మహిళల సింగిల్స్' (2021 MUTUA MADRID OPEN  WOMEN'S SINGLES) టెన్నిస్ టైటిల్ విజేత ? [ఈమె ఎర్రమట్టి కోర్టులో తొలి డబ్ల్యూటీఏ టైటిల్ (FIRST WTA TITLE) ను తన ఖాతాలో వేసుకుంది] 

(ఎ) ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 
(బి) సిమోనా హలెప్ (రొమేనియా) 
(సి) అరైన సబలెంక (బెలారస్)   
(డి) ఎలిసె మెర్టెన్స్ (బెల్జియం) 



7. 2021 మే 10న ముగిసిన 'మాడ్రిడ్ ఓపెన్ పురుషుల సింగిల్స్' (2021 MUTUA MADRID OPEN  MEN'S SINGLES) టెన్నిస్ టైటిల్ విజేత ? 

(ఎ) అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 
(బి) మాట్ బెరిటిని (ఇటలీ)  
(సి) రఫెల్ నాదల్ (స్పెయిన్) 
(డి) ఆండీ ముర్రే (బ్రిటన్) 

8. క్రింది వారిలో ఎవరిని "కేరళ ఉక్కు మహిళ" (IRON LADY OF KERALA) అని పిలుస్తారు ? [కేరళ తొలి ముఖ్యమంత్రి 'నంబూద్రిపాద్' నేతృత్వంలోని కేబినెట్ లో ఈమె రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1994లో కొన్ని కారణాల వల్ల ఈమెను 'సీపీఎం' (CPM) పార్టీ నుంచి బహిష్కరించడంతో సొంతంగా 'జనాధిపత్య సంరక్షణ సమితి' పార్టీని స్థాపించారు]     

(ఎ) కవితా రమణన్   
(బి) శారదా శ్రీనివాసన్  
(సి) కేఆర్ గౌరి   
(డి) గాయత్రీ చక్రవర్తి స్పినక్   

9. స్వీడన్ శాస్త్రవేత్త 'కార్ల్ విల్ హెల్మ్ షీలే' (CARL WILHELM SCHEELE) ఏ సంవత్సరంలో 'ఆక్సిజన్' (OXYGEN) ను తొలిసారి కనుగొన్నారు ? [మరో ఆంగ్ల శాస్త్రవేత్త 'జోసెఫ్ ప్రీస్ట్లీ' కూడా 1774లో ఆక్సిజన్ ను గుర్తించారు]
CARL WILHELM SCHEELE

   

(ఎ) 1771 
(బి) 1772 
(సి) 1773  
(డి) 1774  



10. కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు 'భాగస్వామ్య సంస్థ' (JV) గా ఏ కంపెనీని ఎంపిక చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2021 మే 11న ఉత్తర్వులు జారీ చేసింది ? [కడపలోని సున్నపురాళ్లపల్లె, పెద్దనందలూరు దగ్గర 3,148.68 ఎకరాల్లో ప్రతిపాదిత ఉక్కు కర్మాగారాన్ని నిర్మించి ఉత్పత్తిలోకి తీసుకురావాల్సి ఉంది]  

(ఎ) టాటా స్టీల్ 
(బి) జిందాల్ స్టీల్ 
(సి) ఎస్సార్ స్టీల్స్  
(డి) జెఎస్ డబ్ల్యూ స్టీల్              

కీ (KEY) (GK TEST-65 YEAR : 2021)
1) సి    2) సి    3) డి    4) బి    5) బి    6) సి    7) ఎ    8) సి    9) బి    10) సి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి