ఈ బ్లాగును సెర్చ్ చేయండి

31, మే 2021, సోమవారం

పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం ∣ PM CARES FOR CHILDREN SCHEME DETAILS IN TELUGU

NARENDRA MODI
నరేంద్ర మోదీ 


'కరోనా' (CORONA) కారణంగా తల్లిదండ్రులను కోల్పోయినవారు, ఉన్న ఒక తల్లినో తండ్రినో పోగొట్టుకున్నవారు, చట్టపరమైన సంరక్షకులు, దత్తత తల్లిదండ్రులను కోల్పోయిన వారందరికీ "పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్" పథకం (PM CARES FOR CHILDREN SCHEME) ద్వారా కేంద్ర ప్రభుత్వం చేయూతనందించనుంది.

"పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్" పథకం (PM CARES FOR CHILDREN SCHEME) వివరాలను భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' 2021 మే 29న ప్రకటించారు. "పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్" పథకం (PM CARES FOR CHILDREN SCHEME) ద్వారా కన్నవారి మృతితో అనాథలైన చిన్నారుల జీవితానికి ఆర్ధిక భరోసా కల్పించడంతో పాటు విద్యనందించే ఏర్పాటు చేయనున్నారు. బాధిత పిల్లలు 18 ఏళ్ల వయసుకు వచ్చే నాటికి వారి పేరున రూ. 10 లక్షల మూల నిధిని "పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్" పథకం (PM CARES FOR CHILDREN SCHEME) ద్వారా ప్రభుత్వం సమకూర్చుతుంది.

పిల్లల పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ (FIXED DEPOSIT ON CHILDREN NAME) :

  • ప్రత్యేక పథకం కింద 'పీఎం కేర్స్ నిధి' తో ప్రతి చిన్నారి 18 ఏళ్లకు చేరుకునే సమయానికి వారి పేరున రూ. 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మూలనిధిగా ఉపయోగిస్తారు.
  • ఆ నిధి నుంచి 18వ సంవత్సరం నుంచి అయిదేళ్లపాటు నెలవారీ భృతి మంజూరు చేస్తారు.
  • 23 ఏళ్ల వయసుకు వచ్చిన తర్వాత రూ. 10 లక్షల నిధిని వ్యక్తిగత, వృత్తిగత అవసరాల కోసం తీసుకోవడానికి వీలు కల్పిస్తారు.

పదేళ్ల లోపు వారికి పాఠశాల విద్య (SCHOOL EDUCATION FOR THOSE UNDER TEN) :

  • తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులకు సమీప కేంద్రీయ విద్యాలయంలో, లేదా ప్రైవేటు పాఠశాలలో 'డే స్కాలర్' (DAY SCHOLAR) గా ప్రవేశం కల్పిస్తారు.
  • ఒకవేళ చిన్నారి ప్రైవేటు పాఠశాలలో చేరితే విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం వారి బోధనా రుసుములను 'పీఎం కేర్స్' నిధుల ద్వారా చెల్లిస్తారు.
  • యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాల కోసమూ 'పీఎం కేర్స్' నుంచి చెల్లింపులు జరుగుతాయి.

11-18 ఏళ్లలో రెసిడెన్షియల్ చదువులు (RESIDENTIAL EDUCATION FOR CHILDREN FROM 11-18 YEARS) :

  • 11-18 ఏళ్ల వయసు వారికి సైనిక్ స్కూల్, నవోదయ విద్యాలయం లాంటి కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశం కల్పిస్తారు.
  • ఒకవేళ చిన్నారి .. సంరక్షకులు / అవ్వా తాతలు / సమీప బంధువుల సంరక్షణలో ఉన్నట్లయితే వారికి సమీపంలోని కేంద్రీయ విద్యాలయం, ప్రైవేటు విద్యా సంస్థల్లో 'డే స్కాలర్' కింద ప్రవేశం కల్పిస్తారు.
  • ప్రైవేటు విద్యా సంస్థల్లో చేరితే విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం వారి బోధనా రుసుములను 'పీఎం కేర్స్' నిధుల ద్వారా చెల్లిస్తారు.
  • యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాల కోసమూ 'పీఎం కేర్స్' నుంచి చెల్లింపులు జరుగుతాయి.

ఉన్నత విద్యకు సాయం (ASSISTANCE FOR HIGHER EDUCATION) :

  • మనదేశంలో వృత్తి విద్యా కోర్సులు చేయడానికి, ఉన్నత విద్య అభ్యసించడానికి అవసరమయ్యే ఖర్చుల కోసం విద్యారుణ నిబంధనల కింద రుణాలు ఇప్పించడానికి ప్రభుత్వం సాయం చేస్తుంది. ఆ రుణాలపై వడ్డీని 'పీఎం కేర్స్' నిధుల నుంచి చెల్లిస్తారు.
  • అర్హులైన పిల్లలకు కేంద్ర / రాష్ట్ర పథకాల కింద అండర్ గ్రాడ్యుయేట్ / ఒకేషనల్ కోర్సులు చేసేవారికి బోధనా రుసుములు / కోర్సు రుసుముకు సమానమైన ఉపకార వేతనాలను చెల్లిస్తారు. ప్రస్తుతమున్న స్కాలర్షిప్ పథకాల కిందికి రాని వారికి 'పీఎం కేర్స్' నుంచి ఉపకారవేతనాలకు సమానమైన మొత్తాన్ని చెల్లిస్తారు.

ఆరోగ్య బీమా (HEALTH INSURANCE) :

కన్నవారిని కోల్పోయిన చిన్నారులందరికీ 'ఆయుష్మాన్ భారత్' పథకం (AYUSHMAN BHARAT YOJANA) కింద రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తారు.

వీరికి 18 ఏళ్లు వచ్చేంత వరకూ ఈ బీమా ప్రీమియం మొత్తాన్ని 'పీఎం కేర్స్' నిధుల నుంచే సమకూర్చుతారు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి