ఈ బ్లాగును సెర్చ్ చేయండి

9, మే 2021, ఆదివారం

GK TEST-61 YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

Welcome To GK BITS IN TELUGU Blog

1. చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రంలోని నాలుగో రియాక్టర్ లో సాంకేతిక నిపుణులు చేసిన ఒక ప్రయోగం వికటించి పెను విస్ఫోటానికి (CHERNOBYL DISASTER) దారితీసిన తేదీ ? ['చెర్నోబిల్' ప్రస్తుతం 'ఉక్రెయిన్' లో ఉన్నా, అది పూర్వ సోవియట్ యూనియన్ లో అంతర్భాగంగా ఉండేది] 

(ఎ) 1986 ఏప్రిల్ 26 
(బి) 1986 ఏప్రిల్ 27  
(సి) 1986 ఏప్రిల్ 28  
(డి) 1986 ఏప్రిల్ 29 


2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్లను ఇచ్చే ప్రక్రియను ఎప్పటికి పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ?  

(ఎ) 2023 జనవరి 
(బి) 2023 ఫిబ్రవరి  
(సి) 2023 మార్చ్  
(డి) 2023 ఏప్రిల్ 

3. బంగ్లాదేశ్ విమోచన కోసం ఇండియా-పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో .. విశ్రాంత మేజర్ జనరల్ 'సీవీ వేణుగోపాల్' గుర్తుగా "స్వర్ణిమ్ విజయ్ దివస్" (SWARNIM VIJAY DIWAS) పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్సవాలు నిర్వహించిన నగరం ? ['సీవీ వేణుగోపాల్' 2021 ఏప్రిల్ 27 రాత్రి కన్నుమూశారు. నాటి యుద్ధం (1971) లో మేజర్ చూపిన తెగువకు మెచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆయనకి 'మహావీర్ చక్ర' అవార్డు (MAHA VIR CHAKRA AWARD) ను అందజేసింది]     

(ఎ) తిరుపతి  
(బి) విజయవాడ 
(సి) కాకినాడ 
(డి) విశాఖపట్నం 



4. గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీ (SANGAM DAIRY) ని 'ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ' (APDDC) పరిధిలోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి తీసుకున్న తేదీ ? [డెయిరీ నిర్వహణ బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్ 'మయూర్ అశోక్' కు అప్పగించింది. డెయిరీ నిర్వహణ బాధ్యతను గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి అప్పగిస్తూ .. 1978 జూలై 17న ఇచ్చిన ఉత్తర్వు (జీవో 515) లను ఉపసంహరించుకుంది]   

(ఎ) 2021 ఏప్రిల్ 26 
(బి) 2021 ఏప్రిల్ 27 
(సి) 2021 ఏప్రిల్ 28 
(డి) 2021 ఏప్రిల్ 29 

5. 2020 ఏప్రిల్ 1 నాటికి అమెరికా జనాభా లెక్కల విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం .. ఆ దేశ జనాభా ? [గత పదేళ్లలో అమెరికా జనాభా 7.4 శాతమే పెరిగిందని .. ఇదే రెండో అత్యల్ప జనాభా వృద్ధిగా ఆ విభాగం పేర్కొంది. అమెరికాలో ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కలు, ఇతర గణాంకాలు విడుదలవుతుంటాయి]  

(ఎ) 33,14,49,281   
(బి) 33,14,49,381  
(సి) 33,14,49,481  
(డి) 33,14,49,581 

6. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ (WORLD CHESS CHAMPIONSHIP) లో డిఫెండింగ్ ఛాంప్ "మాగ్నస్ కార్ల్ సన్" ను సవాల్ చేయనున్న "ఇయాన్ నెపోమ్నియాచి" ఏ దేశస్థుడు ? [కాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచిన 'ఇయాన్ నెపోమ్నియాచి' ఈ ఏడాది ఆఖర్లో దుబాయ్ లో 'మాగ్నస్ కార్ల్ సన్' తో ప్రపంచ పోరుకు అర్హత సాధించాడు]   

(ఎ) నార్వే 
(బి) ఫ్రాన్స్ 
(సి) సెర్బియా 
(డి) రష్యా 



7. 1974లో ప్రచురితమైన 'క్యారియింగ్ ద ఫైర్' (Carrying the Fire : An Astronaut's Journeys) ఎవరి ఆత్మకథ ? 

(ఎ) నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ 
(బి) బజ్ ఆల్డ్రిన్ 
(సి) మైఖేల్ కొలిన్స్ 
(డి) యూరి గగారిన్  

8. భారత్ లో 'కరోనా' మరణాలు 2 లక్షలు దాటిన తేదీ ? [తొలి లక్ష మరణాలకు 248 రోజులు పట్టగా, మలి లక్ష మరణాలు 208 రోజుల్లో చోటుచేసుకున్నాయి]   

(ఎ) 2021 ఏప్రిల్ 26  
(బి) 2021 ఏప్రిల్ 27  
(సి) 2021 ఏప్రిల్ 28 
(డి) 2021 ఏప్రిల్ 29  

9. 'కొవిడ్' (COVID-19) బాధితుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో 'గృహ ఏకాంతవాసం' (HOME ISOLATION) లో ఉండేవారికోసం 'కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ' 2021 ఏప్రిల్ 29న జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం .. 'కొవిడ్' లక్షణాలు కనిపించడం మొదలైన నాటి నుంచి కనీసం ఎన్ని రోజులు తర్వాత, వరుసగా 3 రోజులు జ్వరం రాకపోయినప్పుడే రోగి 'హోం ఐసోలేషన్' ను ముగించాలి ? [గత ఏడాది జూలై 2 తర్వాత మార్గదర్శకాలను సవరించడం ఇదే తొలిసారి]      

(ఎ) 10 
(బి) 12 
(సి) 14  
(డి) 15  



10. నగదు రహిత కొవిడ్-19 చికిత్స క్లెయిములకు సంబంధించి తుది బిల్లు అందిన ఎన్ని నిమిషాల్లోపు నిర్ణయం తీసుకోవాలని బీమా సంస్థలను 'భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ' (IRDAI) 2021 ఏప్రిల్ 29న ఆదేశించింది ? [అలా వేగంగా నిర్ణయం తీసుకోవడం వల్ల ఆసుపత్రిలోని సంబంధిత పడక తదుపరి రోగికి త్వరగా అందుబాటులోకి వస్తుందని 'ఐ ఆర్ డీ ఏ ఐ' తెలిపింది]  

(ఎ) 30 
(బి) 60 
(సి) 90 
(డి) 120              

కీ (KEY) (GK TEST-61 YEAR : 2021)
1) ఎ    2) సి    3) ఎ    4) బి    5) ఎ    6) డి    7) సి    8) సి    9) ఎ    10) బి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి