ఈ బ్లాగును సెర్చ్ చేయండి

11, మే 2021, మంగళవారం

GK TEST-62 YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

Welcome To GK BITS IN TELUGU Blog

1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 'అమరావతి' ప్రాంత ప్రజలు, రైతులు, రైతు కూలీలు రాజధాని కోసం గాంధేయ మార్గంలో చేస్తున్న పోరాటం ఏ తేదీ నాటికి 500వ రోజుకు చేరింది ?   
(ఎ) 2021 ఏప్రిల్ 30 
(బి) 2021 మే 1  
(సి) 2021 మే 2  
(డి) 2021 మే 3 

2. 'ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్' (EDLI) స్కీమ్-1976 కింద ఉన్న రూ. 6 లక్షల బీమా గరిష్ఠ పరిమితిని ఎంతకు పెంచుతూ 'ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ' (EPFO) ట్రస్టీలు తీసుకున్న నిర్ణయాన్ని 'కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ' అమల్లోకి తీసుకొచ్చింది ? [కేంద్ర కార్మిక మంత్రి 'సంతోష్ గాంగ్వార్' అధ్యక్షతన 'ఈ పీ ఎఫ్ ఓ' కేంద్ర ట్రస్టీల బోర్డు 2020 సెప్టెంబర్ 9న దృశ్య మాధ్యమ సమావేశంలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద కనిష్ఠ బీమా మొత్తం రూ. 2.5 లక్షలను కొనసాగించాలని ట్రస్టీల బోర్డు నిర్ణయించింది]     

(ఎ) రూ. 7 లక్షలు 
(బి) రూ. 8 లక్షలు  
(సి) రూ. 9 లక్షలు  
(డి) రూ. 10 లక్షలు 

3. ప్రపంచంలోనే ఎక్కువ వయస్సు కలిగిన మహిళా షార్ప్ షూటర్ గా నిలిచిన "చంద్రో తోమర్" (ఉత్తర్ ప్రదేశ్) జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ (BOLLYWOOD) లో వచ్చిన సినిమా ? [60 ఏళ్లు దాటాక తుపాకీ పట్టి .. జాతీయస్థాయిలో పతకాలు కొల్లగొట్టి .. "షూటర్ దాది" (SHOOTER DADI) గా పేరు తెచ్చుకున్న 'చంద్రో తోమర్' 2021 ఏప్రిల్ 30న 'కొవిడ్-19' వ్యాధితో కన్నుమూశారు]   

(ఎ) దంగల్  
(బి) చక్ దే ఇండియా 
(సి) సాండ్ కి ఆంఖ్ 
(డి) పాన్ సింగ్ తోమర్ 



4. భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం, మానవ హక్కులకు సంబంధించిన ఎన్నో కేసుల్లో గట్టి వాదనలు వినిపించి, హక్కుల న్యాయవాదిగా పేరుగాంచిన "సోలీ జహంగీర్ సొరాబ్జీ" 2021 ఏప్రిల్ 30న తుదిశ్వాస విడిచారు. విశేష న్యాయ సేవలు అందించినందుకు గానూ .. అతనికి లభించిన అత్యున్నత పౌర పురస్కారం ? [1989-90, 1998-2004 మధ్య భారత అటార్నీ జనరల్ గానూ 'సోలీ సొరాబ్జీ' పనిచేశారు] 

(ఎ) భారతరత్న 
(బి) పద్మవిభూషణ్ 
(సి) పద్మభూషణ్ 
(డి) పద్మశ్రీ 

5. ఆసియా ఉత్తమ వంద మంది శాస్త్రవేత్తల జాబితాలో చోటు దక్కించుకున్న "డాక్టర్ సురజిత్ దారా" (SURAJIT DHARA) ఏ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్రం ఆచార్యుడిగా పనిచేస్తున్నారు ? [2016 నుంచి ఏటా ఆసియా శాస్త్రవేత్తల మ్యాగజైన్ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు చేస్తున్నారు. ఈ జాబితాలో చోటు దక్కించుకోవాలంటే శాస్త్రవేత్త అంతకుముందు ఏడాదిలో జాతీయ లేదా అంతర్జాతీయ పురస్కారం దక్కించుకోవడంతో పాటు శాస్త్ర పరిశోధన రంగంలో ఆవిష్కరణలు చేసుండాలి. 'డాక్టర్ సురజిత్ దారా' 2012లో భారత భౌతికశాస్త్ర సంఘం నుంచి 'ఎన్ ఎస్ సత్యమూర్తి మెమోరియల్ అవార్డు', 2013లో 'వర్శిటీ కులపతి అవార్డు', 2015లో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ తరపున 'స్వర్ణజయంతి ఫెలోషిప్ అవార్డు', ఇటీవల శాస్త్ర సాంకేతిక విభాగంలో ప్రతిష్ఠాత్మక 'శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు-2020' లను అందుకున్నారు]    

(ఎ) హైదరాబాద్ కేంద్రియ విశ్వవిద్యాలయం   
(బి) హైదరాబాద్ జె ఎన్ టీ యూ   
(సి) ఉస్మానియా విశ్వవిద్యాలయం  
(డి) ఐ ఐ ఐ టి హైదరాబాద్ 

6. 'జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ' (NBA) సభ్యుడిగా నియమితులైన హైదరాబాద్ కు చెందిన 'ఐ ఎఫ్ ఎస్' అధికారి ?[ఇతను 2023 జూన్ 10వ తేదీ వరకు ఈ సంస్థలో సభ్యుడిగా కొనసాగుతారు. ఈ మేరకు 'కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ' ఉత్తర్వులు జారీ చేసింది] 

(ఎ) ఎస్. సురేష్ రెడ్డి 
(బి) ఎన్. ప్రతీప్ కుమార్   
(సి) సి. అచలేందర్ రెడ్డి 
(డి) డాక్టర్ గుజ్జు చెన్నారెడ్డి 



7. 'దేశ రాజధాని ప్రాంత దిల్లీ ప్రభుత్వ (సవరణ) చట్టం' ను కేంద్ర హోంశాఖ అమలులోకి తెచ్చిన తేదీ ? [ఈ చట్టం ప్రకారం .. రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్య తీసుకోవాలన్నా ముందుగా 'ఎల్ జీ' (LG) కి చెప్పాల్సిందే] 

(ఎ) 2021 ఏప్రిల్ 25 
(బి) 2021 ఏప్రిల్ 26 
(సి) 2021 ఏప్రిల్ 27 
(డి) 2021 ఏప్రిల్ 28 

8. ప్రపంచంలో మరే దేశంలో లేని విధంగా భారత్ లో ఒక్క రోజులో 4 లక్షలకు పైగా 'కరోనా' కేసులు (FIRST TIME MORE THAN 4 LAKH 'COVID-19' POSITIVE CASES IN INDIA) తొలిసారిగా నమోదైన తేదీ ?   

(ఎ) 2021 ఏప్రిల్ 30  
(బి) 2021 మే 1  
(సి) 2021 మే 2 
(డి) 2021 మే 3  

9. భారతదేశంలో తొలి మహిళా స్టాండప్ కమెడియన్ (INDIA'S FIRST FEMALE STANDUP COMEDIAN) గా పేరొందినది ?

(ఎ) నీతి పల్తా  
(బి) శ్యామా హరిణి 
(సి) భారతీ సింగ్  
(డి) అదితీ మిట్టల్  



10. పుదుచ్చేరి (PUDUCHERRY) లోని 'యానాం' లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి .. మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ ఉద్దండుడు అయిన 'ఎన్. రంగసామి' పై 655 ఓట్ల ఆధిక్యంతో గెలిచి సంచలన విజయాన్ని నమోదు చేసిన 28 ఏళ్ల యువకుడు ? [పుదుచ్చేరిలో 2021 ఏప్రిల్ 6న ఎన్నికలు జరిగాయి] 

(ఎ) దయానిధి మారన్    
(బి) డాక్టర్ ఎం. గురుమూర్తి 
(సి) ఉదయనిధి స్టాలిన్ 
(డి) గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్              

కీ (KEY) (GK TEST-62 YEAR : 2021)
1) ఎ    2) ఎ    3) సి    4) బి    5) ఎ    6) సి    7) సి    8) బి    9) డి    10) డి  

UPDATES (నవీకరణలు) :

  • ప్రజారోగ్యం తీవ్రమైన సంక్షోభంలో ఉన్న పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసు టీకా (కొవాగ్జిన్) ను రూ. 400 ధరకు సరఫరా చేయాలని 'భారత్ బయోటెక్' సంస్థ నిర్ణయించింది.
  • 'సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు 'కొవిషీల్డ్' టీకాను డోసుకు రూ. 400గా ప్రకటించి, తదుపరి రూ. 300కు తగ్గించింది.
  • కేంద్ర ప్రభుత్వ సంప్రదింపుల మేరకు ఈ కంపెనీలు టీకా ధరలను తగ్గించాయి.   

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి