1. 'ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ' (AIG) చైర్మన్, ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల వైద్య నిపుణులు "డాక్టర్ డి.నాగేశ్వర రెడ్డి" (Dr. D.NAGESHWAR REDDY) కి ప్రతిష్ఠాత్మక 'అమెరికన్ సొసైటీ ఫర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఎండోస్కోపీ' (ASGE) సంస్థ అత్యున్నత పురస్కారాన్ని 2021 మే 23 రాత్రి జరిగిన ఆన్లైన్ సదస్సులో 'ఏ ఎస్ జీ ఈ' (ASGE) అధ్యక్షులు 'డాక్టర్ క్లాస్ మెర్జెనర్' అందజేశారు. ఏ సంవత్సరానికి సంబంధించి 'డాక్టర్ డి.నాగేశ్వర రెడ్డి' కి ఈ గౌరవం దక్కింది ? ['అమెరికన్ గ్యాస్ట్రోస్కోపిక్ క్లబ్' వ్యవస్థాపకులు, 'ఫాదర్ ఆఫ్ గ్యాస్ట్రోస్కోపీ' (FATHER OF GASTROSCOPY) గా గౌరవించే 'డాక్టర్ రుడాల్ఫ్ వి.షిండ్లర్' పేరిట జీర్ణకోశ వ్యాధుల చికిత్సల్లో విశిష్ఠ సేవలందించిన వైద్యనిపుణులకు ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తారు]
![]() |
| DR. D.NAGESHWAR REDDY |
(ఎ) 2018
(బి) 2019
(సి) 2020
(డి) 2021
2. 'ఓఎక్స్5034' (OX5034) అంటే ?
(ఎ) కొవిడ్-19 నిరోధక టీకా
(బి) ఫంగస్ ను అదుపు చేసే ఔషధం
(సి) జన్యు మార్పిడి చేసిన దోమలు
(డి) వైరల్ న్యుమోనియా
3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'మేథో హక్కుల పరిరక్షణ' (IPR) ను ప్రోత్సహించే దిశగా ఏ విశ్వవిద్యాలయాన్ని 'నోడల్ ఏజెన్సీ' (NODAL AGENCY) గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2021 మే 12న ఉత్తర్వులు ఇచ్చింది ? [మేథో హక్కుల పరిరక్షణ, కొత్త ఆవిష్కరణలు, అంకుర ఆలోచనలను ప్రోత్సహించడానికి అవసరమైన మార్గదర్శకాన్ని ఈ విశ్వవిద్యాలయం అందిస్తుంది]
(ఎ) ఆంధ్ర విశ్వవిద్యాలయం
(బి) ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
(సి) రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం
(డి) జే ఎన్ టీ యూ (కె)
4. 'కొవిడ్-19' కారక 'సార్స్-కోవ్-2' (SARS-CoV-2) తర్వాత మానవుల్లోకి వచ్చిన కరోనా వైరస్ "సీసీవోవీ-హెచ్ యూ పీ ఎన్-2018" (CCoV-HuPn-2018) ఏ దేశంలో వెలుగు చూసింది ? [ఈ వైరస్ శునకాల నుంచి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఇది శునక-పిల్లి జాతుల్లోకి ప్రవేశించేలా రూపాంతరం చెందిన ఆల్ఫా కరోనా వైరస్ అని శాస్త్రవేత్తలు తెలిపారు. శునకాల్లోని కరోనా వైరస్ ను మానవుల్లో గుర్తించడం ఇదే మొదటిసారి. దీనివల్ల మానవుల్లో ఇన్ఫెక్షన్ కలుగుతుందని తేలితే .. ఆ కోవకు చెందిన 8వ కరోనా వైరస్ అవుతుంది]
(ఎ) ఇండోనేషియా
(బి) వియత్నాం
(సి) కంబోడియా
(డి) మలేసియా
5. అంగారకుడిపైకి చైనా పంపిన 'ఝురాంగ్' రోవర్ (CHINA'S ZHURONG ROVER ON MARS PLANET) తన ల్యాండింగ్ వేదిక నుంచి కిందకు దిగి, ఆ గ్రహ ఉపరితలాన్ని తొలిసారిగా స్పృశించిన తేదీ ? [ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ తో కూడిన 'తియాన్వెన్-1' వ్యోమనౌకను 2020 జూలైలో చైనా ప్రయోగించింది. 2021 మే 15న .. వ్యోమనౌకలోని ల్యాండర్, రోవర్ భాగం విడిపోయి అరుణ గ్రహ ఉపరితలంపై 'ఉటోపియా ప్లానిషియా' అనే ప్రాంతంలో దిగింది]
![]() |
| CHINA'S ROVER 'ZHURONG' IMAGES FROM MARS |
(ఎ) 2021 మే 21
(బి) 2021 మే 22
(సి) 2021 మే 23
(డి) 2021 మే 24
6. 'అంతర్జాతీయ హాకీ సమాఖ్య' (FIH) అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యుడు ? [2024 వరకు ఇతను 'ఎఫ్ ఐ హెచ్' (FIH) అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. ఇతను 2016లో తొలిసారిగా 'ఎఫ్ ఐ హెచ్' (FIH) అధ్యక్ష పదవిని చేపట్టారు]
(ఎ) ప్రదీప్ రాజ్ కారత్
(బి) గౌరవ్ ఖన్నా
(సి) నరిందర్ బత్రా
(డి) గోపాల్ మంజీ
7. కోర్టుల్లో నడుస్తున్న కేసుల స్థితిగతులను తెలిపే "ఈ-కోర్ట్స్ సర్వీసెస్ మొబైల్ యాప్" (E-COURTS SERVICES MOBILE APP) ను తెలుగు సహా దేశంలోని 14 ప్రధాన భాషల్లోకి అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్న 'సుప్రీంకోర్టు ఈ-కమిటీ' (SUPREME COURT E-COMMITTEE) చైర్మన్ ?
(ఎ) జస్టిస్ ఎన్.వి. రమణ
(బి) జస్టిస్ డీ.వై.చంద్రచూడ్
(సి) జస్టిస్ అశోక్ భూషణ్
(డి) జస్టిస్ ఎం.ఆర్.షా
8. ఒలింపిక్స్ లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక భారత క్రీడాకారుడిగా ఘనత వహించిన అతను .. 'సాగర్ రాణా' అనే యువ రెజ్లర్ (YOUNG WRESTLER) హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ఆ వ్యక్తి పేరు ?
(ఎ) యోగేశ్వర్ దత్
(బి) సత్పాల్ సింగ్
(సి) సుశీల్ కుమార్
(డి) బజ్ రంగ్ పునియా
9. ఏ తేదీ నుంచి 'హాల్ మార్కింగ్' (HALLMARKING) ఉన్న బంగారు నగలు మాత్రమే విక్రయించాలని 'కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ' స్పష్టం చేసింది ?
(ఎ) 2021 జూన్ 1
(బి) 2021 జూన్ 15
(సి) 2021 జూన్ 29
(డి) 2021 జూన్ 30
10. 'ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య' 2021 మే నెలలో ప్రకటించిన అండర్-18 అబ్బాయిల 110 మీటర్ల హార్డిల్స్ ర్యాంకింగ్స్ లో మూడో స్థానం (WORLD NUMBER 3 IN ATHLETICS) సాధించిన "మహమ్మద్ హనన్" ఏ రాష్ట్రానికి చెందినవాడు ? [ఓ భారత అథ్లెట్ ఏ విభాగంలోనైనా ప్రపంచ ర్యాంకింగ్స్ లో మూడో స్థానాన్ని సాధించడమంటే గొప్ప ఘనతే]
(ఎ) తెలంగాణ
(బి) పశ్చిమ బెంగాల్
(సి) తమిళనాడు
(డి) కేరళ
కీ (KEY) (GK TEST-66 YEAR : 2021)
1) డి 2) సి 3) ఎ 4) డి 5) బి 6) సి 7) బి 8) సి 9) బి 10) డి E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి