ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, జూన్ 2021, గురువారం

2021 YEAR GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU TEST-69

1. అరుదైన మూడు ఖగోళ అద్భుతాలతో కూడిన "సూపర్ బ్లడ్ మూన్" (SUPER BLOOD MOON) నింగిలో చోటు చేసుకున్న తేదీ ? [చంద్ర గ్రహణం, బ్లడ్ మూన్, సూపర్ మూన్ .. ఒకే రోజులో వస్తే దాన్ని 'సూపర్ బ్లడ్ మూన్' (SUPER BLOOD MOON) అంటారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తూర్పు ఆసియాలో ఇది పూర్తిగా, ఈశాన్య భారతంలో పాక్షికంగా కనిపించింది]
SUPER BLOOD MOON
సూపర్ బ్లడ్ మూన్

 
(ఎ) 2021 మే 25 
(బి) 2021 మే 26  
(సి) 2021 మే 27  
(డి) 2021 మే 28 

2. 'ఏపీఎస్ఆర్టీసీ' (APSRTC) ఎండీ, ప్రజా రవాణా విభాగం కమిషనర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ? [రైల్వే విభాగం డైరెక్టర్ జనరల్ గా ఉన్న ఆయనను 2021 మే 31న ప్రభుత్వం బదిలీ చేసింది]
CH DWARAKA TIRUMALARAO

  

(ఎ) ఆర్.పీ.ఠాకూర్ 
(బి) ఎన్. సంజయ్   
(సి) పీ.వీ.సునీల్ కుమార్  
(డి) సీ.హెచ్.ద్వారకా తిరుమలరావు 

3. ప్రపంచంలోనే తొలిసారిగా 'నానో యూరియా' (NANO UREA) ను 'భారత రైతుల ఎరువుల సహకార సంస్థ' (IFFCO) ప్రవేశపెట్టిన తేదీ ? [దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ నానో యూరియా .. ద్రవ రూపంలో ఉంటుంది. త్వరలోనే వాణిజ్య వినియోగానికి అందుబాటులోకి తీసుకురానున్నారు. 500 మిల్లీలీటర్ల నానో యూరియా సీసా .. కనీసం ఒక బస్తా సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని 'ఇఫ్కో' (IFFCO) వెల్లడించింది]  

(ఎ) 2021 మే 30  
(బి) 2021 మే 31 
(సి) 2021 జూన్ 1 
(డి) 2021 జూన్ 2 



4. దేశవ్యాప్తంగా 'కొవిడ్' బారినపడి కోలుకుంటున్న వారిలో 'యాంటీబాడీల స్థాయి' (ANTIBODIES) పరీక్షించేందుకు దిల్లీలోని ఓ ప్రైవేటు సంస్థతో కలిసి 'డీ ఆర్ డీ ఓ' (DRDO) రూపొందించిన పరీక్ష కిట్ "డిప్కోవాన్" (DIPCOVAN) ను మార్కెట్ లోకి విడుదల చేసిన తేదీ ? [ఈ కిట్ కేవలం రూ. 75కే అందుబాటులో ఉంటుందని, మనిషి శరీరంలో యాంటీబాడీలు ఏమేరకు ఉన్నాయో కచ్చితమైన ఫలితాన్నిస్తుందని 'డీ ఆర్ డీ ఓ' (DRDO) చైర్మన్ 'డాక్టర్ జి.సతీష్ రెడ్డి' వెల్లడించారు]     

(ఎ) 2021 మే 30  
(బి) 2021 మే 31 
(సి) 2021 జూన్ 1 
(డి) 2021 జూన్ 2 

5. భారత్ లో మొదట వెలుగు చూసిన కరోనా రకానికి 2021 మే 31న 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' (WHO) ఖరారు చేసిన పేరు ? [సాంకేతికంగా బి.1.617 గా పిలిచే ఈ వైరస్ రకం .. అధికారికంగా 53 దేశాల్లో కనిపించిందని 'డబ్ల్యుహెచ్ఓ' తెలిపింది] 

(ఎ) ఆల్ఫా   
(బి) బీటా  
(సి) గామా  
(డి) డెల్టా వేరియంట్ 

6. ఏ సంవత్సరం నుంచి చైనాలో ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతి ఉంది ? [ఇకనుంచి ఒక్కో జంట ముగ్గురేసి పిల్లలను కనేందుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) అనుమతినిచ్చింది]

(ఎ) 2015 
(బి) 2016 
(సి) 2017 
(డి) 2018 



7. హైదరాబాద్ లోని కేంద్ర పరిశోధన సంస్థ 'సీసీఎంబీ' (CCMB) నూతన డైరెక్టర్ గా 2021 జూన్ 1న బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ ఇమ్యునాలజిస్ట్ ?   

(ఎ) డాక్టర్ వినయ్ కుమార్ నందికూరి  
(బి) డాక్టర్ రాకేశ్ మిశ్రా 
(సి) ఆలాపన్ బందోపాధ్యాయ్  
(డి) డాక్టర్ గగన్ దీప్ కాంగ్ 

8. కరోనా సంక్షోభం కారణంగా గత ఆర్ధిక సంవత్సరం (2020-21) లో నమోదైన భారత 'జీడీపీ' (GDP) వృద్ధి రేటు ? [అధిక పన్ను వసూళ్ల కారణంగా ద్రవ్యలోటు 2020-21లో 'జీడీపీ' (GDP) లో 9.3 శాతానికి పరిమితమై రూ. 18,21,461 కోట్లుగా నమోదైంది]    

(ఎ) -5.3%  
(బి) -6.3%  
(సి) -7.3% 
(డి) -8.3%  

9. 2021 జూన్ 1 నుంచి మూడు నెలలపాటు 'కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు' (CBDT) చైర్మన్ గా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నది ?

(ఎ) జగన్నాథ్ బిద్యాధర్ మహాపాత్ర 
(బి) పీసీ మోదీ  
(సి) పీసీ పంత్   
(డి) హరికృష్ణ ద్వివేది  



10. 2021-22 సంవత్సరానికి 'భారతీయ పరిశ్రమల సమాఖ్య' (CII) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైనది ?  

(ఎ) ఉదయ్ కోటక్ 
(బి) పవన్ ముంజాల్  
(సి) టీవీ నరేంద్రన్  
(డి) సంజీవ్ బజాజ్              

కీ (KEY) (GK TEST-69 YEAR : 2021)
1) బి    2) డి    3) బి    4) సి    5) డి    6) బి    7) ఎ    8) సి    9) ఎ    10) సి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి