1. మొత్తం 700 MHz సామర్థ్యం గల స్పెక్ట్రమ్ లో రైల్వేల సిగ్నళ్లు, కమ్యూనికేషన్ల కోసం ఎంత స్పెక్ట్రమ్ ను కేటాయిస్తూ కేంద్ర మంత్రి మండలి 2021 జూన్ 9న నిర్ణయం తీసుకుంది ? [ఇంతవరకు ఆప్టికల్ ఫైబర్ విధానం ద్వారా సిగ్నలింగ్, ఇతర వ్యవస్థలను నిర్వహిస్తుండగా .. ఇకపై అత్యంత వేగం గల రేడియో తరంగాల ద్వారా వీటిని నడుపుతారు. దీని వలన లైవ్ వీడియో ద్వారా రైలు కదలికలను గుర్తించడానికి వీలవుతుంది. ఇందుకు అయిదేళ్లలో రూ. 25 వేల కోట్లు ఖర్చు చేస్తారు] (How much spectrum in 700 MHz band to Indian Railways ?)
(ఎ) 3 MHz
(బి) 4 MHz
(సి) 5 MHz
(డి) 6 MHz
2. తాజాగా ప్రకటించిన 'క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్స్ 2022' (QS WORLD UNIVERSITY RANKINGS 2022) లో భారతదేశానికి చెందిన ఎన్ని ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు వెయ్యిలోపు స్థానం దక్కించుకున్నాయి ? (TOP INDIAN INSTITUTES NAMES, RANKINGS IN 'QS WORLD UNIVERSITY RANKINGS 2022' REPORT)
(ఎ) 21
(బి) 22
(సి) 23
(డి) 24
3. కృష్ణా జలాలకు సంబంధించి .. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య 'ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు, తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు వినియోగం ఏవిధంగా ఉండాలి' అనే విషయాలపై నిర్ణయం తీసుకోవాలని 'బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్' కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది ?
(ఎ) 86
(బి) 87
(సి) 88
(డి) 89
4. 2021-22 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి .. కేంద్ర ప్రభుత్వం 'వరి' (PADDY) పంటకు కనీస మద్దతు ధరను క్వింటాల్ కు రూ. 1,868 నుంచి ఎంతకు పెంచింది ?
(ఎ) రూ. 1,910
(బి) రూ. 1,920
(సి) రూ. 1,930
(డి) రూ. 1,940
5. కరోనా వైరస్ పై 'సర్జికల్ స్ట్రైక్' (SURGICAL STRIKE) చేయాలని కేంద్ర ప్రభుత్వానికి తెలిపిన కోర్టు ?
(ఎ) బాంబే హైకోర్టు
(బి) మద్రాస్ హైకోర్టు
(సి) తెలంగాణ హైకోర్టు
(డి) దిల్లీ హైకోర్టు
6. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ (Election Commissioner of India) గా 2021 జూన్ 9న బాధ్యతలు స్వీకరించిన మాజీ ఐఏఎస్ అధికారి ?
(ఎ) అనూప్ చంద్ర పాండే
(బి) దువ్వూరి సుబ్బారావు
(సి) నీలం సాహ్ని
(డి) ఐవైఆర్ కృష్ణారావు
7. భారత వైమానిక దళం (IAF) కోసం మొట్టమొదటిసారిగా ఎంతమంది మహిళా అధికారులను యుద్ధ హెలికాఫ్టర్ల పైలట్ల శిక్షణకు భారత సైన్యం ఎంపిక చేసింది ? [ఈ మహిళా అధికారులు మహారాష్ట్రలోని 'నాసిక్' లో శిక్షణ తీసుకోనున్నారు. దీన్ని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత వచ్చే ఏడాది జూలైలో వారు విధుల్లో చేరనున్నారు]
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4
8. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) 'జస్టిస్ ఎన్వీ రమణ' చొరవతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఒకేసారి 24 నుంచి ఎంతకు పెరిగింది ? [దీనికి సంబంధించి సీజేఐ (CJI) 'జస్టిస్ ఎన్వీ రమణ' 2021 జూన్ 8న ఆమోదముద్ర వేశారు]
(ఎ) 40
(బి) 41
(సి) 42
(డి) 43
9. కేంద్ర ప్రభుత్వం "స్వామిత్వ" (SVAMITVA) పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా ప్రారంభించిన తేదీ ? [ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 2021 జూన్ 9న "స్వామిత్వ" (SVAMITVA) సర్వే ప్రారంభమైంది. రెవిన్యూ డివిజన్ కు ఒకటి చొప్పున 51 గ్రామాల్లో ఆస్తుల సర్వేను మొదలుపెట్టారు]
(ఎ) 2020 జనవరి 1
(బి) 2020 ఏప్రిల్ 24
(సి) 2020 అక్టోబర్ 11
(డి) 2020 డిసెంబర్ 10
10. 'కొవిషీల్డ్' (COVISHIELD) టీకా మొదటి, రెండో డోసుల మధ్య వ్యవధిని 6-8 వారాల నుంచి ఎన్ని వారాలకు పొడిగిస్తూ 2021 మే 13న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ? ['నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్' సిఫార్సుల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని 'కేంద్ర ఆరోగ్య శాఖ' తెలిపింది]
'
(ఎ) 12-13 వారాలు
(బి) 12-14 వారాలు
(సి) 12-15 వారాలు
(డి) 12-16 వారాలు
కీ (KEY) (GK TEST-72 YEAR : 2021)
1) సి 2) బి 3) డి 4) డి 5) ఎ 6) ఎ 7) బి 8) సి 9) బి 10) డి E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి