స్వామిత్వ యోజన (యాజమాన్య ప్రణాళిక)
SVAMITVA (Survey of Village And Mapping with Improvised Technology in Village Areas)
పథకం ప్రారంభం :
- 2020 అక్టోబర్ 11న 'గ్రామాల్లోని ఇళ్ల స్థలాలకు యాజమాన్య హక్కులను ఖరారు చేస్తూ రూపొందించిన కార్డులను పంపిణీ చేయడానికి ఉద్దేశించిన "స్వామిత్వ" (SVAMITVA ⇒ సర్వే ఆఫ్ విలేజ్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్)' కార్యక్రమాన్ని భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' వీడియో సమావేశంలో ప్రారంభించారు.
పథకం - కొన్ని విశేషతలు :
- గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలకు సంబంధించి కచ్చితమైన ఆస్తి హక్కు పత్రాలను సృష్టించి లబ్ధిదారులకు అందించేందుకు ఉద్దేశించిన పథకమే "స్వామిత్వ" (SVAMITVA).
- ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం.
- వచ్చే నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 6.2 లక్షల (6,20,000) గ్రామాల్లోని ఆస్తులను సర్వే చేసి ఆస్తి హక్కు కార్డులు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
- పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా 2020 ఏప్రిల్ 24న ప్రధాన మంత్రి 'నరేంద్ర మోదీ' 'స్వామిత్వ యోజన' (యాజమాన్య ప్రణాళిక) ను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.
- ఆరు నెలల్లో ఆరు రాష్ట్రాల్లోని 763 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి 1.32 లక్షల మంది (1,32,000) కి సంబంధించిన ఆస్తి హక్కు పత్రాలను తయారు చేసారు.
- డ్రోన్ సర్వే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గ్రామాల్లోని ఇళ్లను సర్వే చేసి ప్రజలకు రికార్డ్ ఆఫ్ రైట్స్ కార్డులు (Record of Rights Cards) మంజూరు చేస్తారు.
- పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ దీనికి నోడల్ ఏజెన్సీ (NODAL AGENCY) గా వ్యవహరిస్తుంది.
- రాష్ట్రాల్లో రెవిన్యూ, ల్యాండ్ రికార్డ్ శాఖలు నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయి. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖతో కలిపి ఈ రెండు విభాగాలు సర్వే పూర్తిచేస్తాయి.
- సర్వే ఆఫ్ ఇండియా (SURVEY OF INDIA) సంస్థ ఈ పథకం అమలులో సాంకేతిక భాగస్వామి (Technical Partner) గా వ్యవహరించనుంది.
- 2024 మార్చ్ నాటికి 6.2 లక్షల గ్రామాల ఆస్తులను సర్వే చేస్తారు.
- గ్రామాల ప్రణాళికను క్రమబద్ధీకరిస్తారు. పన్ను వసూళ్లు పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి హక్కులపై స్పష్టతనిస్తారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17,950 గ్రామాలలో (2021-22 ⇒ 4,000 ; 2022-23 ⇒ 8,400 ; 2023-24 ⇒ 5,550) మరియు తెలంగాణ రాష్ట్రంలో 11,234 గ్రామాలలో (2023-24 ⇒ 11,234) 'స్వామిత్వ' (SVAMITVA) పథకాన్ని అమలు చేయనున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి