రుద్రం (యాంటీ రేడియేషన్ క్షిపణి)
RUDRAM (ANTI-RADIATION MISSILE)
- 2020 అక్టోబర్ 9న ఒడిశాలోని బాలేశ్వర్ లో 'సుఖోయ్-30 ఎం కె ఐ' యుద్ధ విమానం నుంచి ఉదయం 10.30 గంటలకు "రుద్రం-1" అనే యాంటీ రేడియేషన్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు.
"రుద్రం-1" గురించి ... కొన్ని విశేషాలు :
- రుద్రం-1 అనే ఈ అస్త్రం .. శత్రు దేశపు రాడార్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్ వర్క్ లను ధ్వంసం చేయగలదు.
- రుద్రం-1ను 'రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) రూపొందించింది.
- స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి యాంటీ రేడియేషన్ క్షిపణి ఇదే.
- ధ్వని కన్నా రెట్టింపు వేగంతో దూసుకెళుతుంది.
- 250 కిలోమీటర్ల దూరం పయనించగలదు.
- తాజా పరీక్షలో ఒడిశా తీరానికి చేరువలోని వీలర్ దీవిలో ఉన్న రేడియోధార్మిక లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది.
- గగనతలం నుంచి ప్రయోగించే వీలున్న యాంటీ రేడియోధార్మిక క్షిపణులను రూపొందించే సత్తా భారత్ కు ఉందని ఈ ప్రయోగం నిరూపించింది.
- రుద్రం-1 లో ఐఎన్ఎస్-జీపీఎస్ (INS-GPS) మార్గనిర్దేశక వ్యవస్థ ఉంది.
- తుది దశలో .. శత్రు లక్ష్యంపై విరుచుకుపడేందుకు 'ప్యాసివ్ హోమింగ్ హెడ్' (Passive-homing head) ఉంది.
- రాడార్లు, ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థల నుంచి వెలువడే రేడియేషన్ సంకేతాలను పట్టుకుని లక్ష్యాన్ని ఛేదిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి