ఈ బ్లాగును సెర్చ్ చేయండి

14, అక్టోబర్ 2020, బుధవారం

2020 NOBEL PRIZE WINNERS

 2020వ సంవత్సర నోబెల్ ప్రైజ్ విజేతలు

(2020 NOBEL PRIZE WINNERS)


1. వైద్య శాస్త్రం (PHYSIOLOGY OR MEDICINE) :

  • అమెరికాకు చెందిన "హార్వీ జె ఆల్టర్, చార్లెస్ ఎం రైస్, బ్రిటన్ లో జన్మించిన మైఖేల్ హౌటన్" (HARVEY J. ALTER, MICHAEL HOUGHTON, CHARLES M. RICE) లకు ఈ ఏడాది వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది.
  • ఈ పురస్కారం కింద వీరికి 11,18,000 డాలర్లు దక్కుతాయి.
  • ప్రపంచవ్యాప్తంగా కోట్లమందిని ఇబ్బంది పెడుతున్న కాలేయ వ్యాధికి కారణమవుతున్న "హెపటైటిస్ సి" (HEPATITIS C) వైరస్ ను కనుగొనడంలో ఈ ముగ్గురి శాస్త్రవేత్తల పాత్ర ఉంది.
  • "వీరి పరిశోధన కారణంగా .. వైరస్ ను గుర్తించడానికి మెరుగైన రక్త పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. రక్త మార్పిడి తర్వాత వచ్చే హెపటైటిస్ (HEPATITIS C) ను ప్రపంచంలో అనేకచోట్ల దాదాపుగా నిర్మూలించారు. ఫలితంగా ప్రజారోగ్యం చాలావరకు మెరుగుపడింది" అని నోబెల్ కమిటీ వివరించింది.
  • ఈ ముగ్గురు శాస్త్రవేత్తల ఆవిష్కరణ కారణంగా 'హెపటైటిస్ సి' (HEPATITIS C) ని లక్ష్యంగా చేసుకునే యాంటీ వైరల్ ఔషధాలను వేగంగా అభివృద్ధి చేయడానికి వీలైంది. దీని వలన హెపటైటిస్ సి (HEPATITIS C) వైరస్ ను ప్రపంచం నుంచి పూర్తిగా నిర్మూలించేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయి.


2. భౌతిక శాస్త్రం (PHYSICS) :

  • "రోజర్ పెన్ రోజ్ (బ్రిటన్), రెయిన్ హార్డ్ గెంజెల్ (జర్మనీ), ఆండ్రియా గెజ్ (అమెరికా)" (ROGER PENROSE (BRITAIN), REINHARD GENZEL (GERMANY), ANDREA GHEZ (USA)) లకు ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది.
  • నోబెల్ పురస్కారం కింద దక్కే సుమారు 11 లక్షల డాలర్లలో సగం మొత్తాన్ని రోజర్ పెన్ రోజ్ (బ్రిటన్) కు ఇవ్వనున్నట్లు ఎంపిక కమిటీ 'రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్' (Royal Swedish Academy of Sciences) తెలిపింది.
  • కృష్ణబిలాల ఆవిర్భావం సాధ్యమేనని గణితశాస్త్ర విధానాల సాయంతో 1965లో రోజర్ పెన్ రోజ్ (బ్రిటన్) రుజువు చేసారు.
  • మన పాలపుంత గెలాక్సీ మధ్య భాగంలో ఉన్న భారీ కృష్ణ బిలాన్ని రెయిన్ హార్డ్ గెంజెల్ (జర్మనీ), ఆండ్రియా గెజ్ (అమెరికా) లు కనుగొన్నారని, అవార్డు మొత్తంలో రెండో సగ భాగాన్ని ఈ ఇద్దరు శాస్త్రవేత్తలకు సమానంగా పంచనున్నట్లు అకాడమీ వెల్లడించింది.


3. రసాయన శాస్త్రం (CHEMISTRY) :

  • "ఎమాన్యుయెల్లె చార్పెంటియెర్ (ఫ్రాన్స్), జెన్నీఫర్ ఎ డౌడ్నా (అమెరికా)" (EMMANUELLE CHARPENTIER (FRANCE), JENNIFER A. DOUDNA (USA)) లకు రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించింది.
  • పురస్కారంతోపాటు అందే 11 లక్షల డాలర్ల నగదు బహుమతిని చార్పెంటియెర్, డౌడ్నా చెరిసగం పంచుకోనున్నారు.
  • ప్రాణాంతక క్యాన్సర్ల నుంచి మానవాళికి రక్షణ కల్పించే దిశగా ఆశలు రేకెత్తిస్తున్న అద్భుత జన్యు సాధనాన్ని ఈ ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
  • జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవుల డీఎన్ఏ (DNA)లో అవసరమైన మార్పులను (జీన్ ఎడిటింగ్) అత్యంత కచ్చితత్వంతో చేయగల 'క్రిస్పర్ కాస్9' (CRISPR Cas9) సాంకేతికతను వీరు సంయుక్తంగా అభివృద్ధి చేసారు.
  • 'అణు కత్తెర' వంటి ఈ సాంకేతికత .. మానవుల్లో జన్యు లోపాల కారణంగా వచ్చే వ్యాధులు, క్యాన్సర్లు వంటి మహమ్మారులను నయం చేసేందుకు భవిష్యత్తులో దోహదపడే అవకాశముంది.
  • రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ఇద్దరు మహిళలు పంచుకోవడం ఇదే తొలిసారి.
  • జన్యు లోపాలను సరిదిద్ధేందుకు 'క్రిస్పర్ కాస్9' (CRISPR Cas9) సాంకేతికత దోహదపడుతుంది. కానీ, దీన్ని అత్యంత జాగ్రత్తగా వినియోగించుకోవాలి.
  • వాస్తవానికి క్రిస్పర్ సాంకేతికతపై ఇప్పటివరకు చాలామంది శాస్త్రవేత్తలు విశేష పరిశోధనలు చేసారు. అయితే- తక్కువ ఖర్చులో, అత్యంత సులువుగా వినియోగించుకునేందుకు వీలుగా దాన్ని తీర్చిదిద్దిన ఘనత మాత్రం చార్పెంటియెర్, డౌడ్నాలదే.


4. సాహిత్యం (LITERATURE) :

  • "లూయీస్ గ్లక్" (అమెరికా) (LOUISE GLUCK (USA)) కు సాహిత్య రంగంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం వరించింది.
  • నోబెల్ బహుమతి కింద ఆమెకు 11 లక్షల డాలర్లు లభిస్తాయి.
  • ఏమాత్రం విమర్శలకు తావివ్వని రీతిలో రాజీలేని కృషి కొనసాగిస్తున్నందుకు ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రకటిస్తున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది.
  • యేల్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగ ప్రొఫెసర్ గా ఉన్న ఆమె న్యూయార్క్ (NEW YORK) లో జన్మించారు.
  • 1968లో 'ఫస్ట్ బోర్న్' (FIRSTBORN) కవిత ద్వారా రచనా వ్యాసంగంలో అడుగు పెట్టారు.
  • కుటుంబ జీవితం ఇతివృత్తంగా సంసారంలో సరిగమలపై ఎక్కువ రచనలు చేసిన ఆమె .. తగినంత హాస్యాన్నీ వాటికి రంగరిస్తూ వస్తున్నారు.
  • సాహిత్య రంగంలో నోబెల్ పొందిన 16వ మహిళ ఆమె.
  • "డెసెండింగ్ ఫిగర్, ది ట్రయంప్ ఆఫ్ అచిల్లెస్, అరారత్" (DESCENDING FIGURE, THE TRIUMPH OF ACHILLES, ARARAT) వంటి కవితా సంకలనాలపై నోబెల్ పురస్కారాల కమిటీ ప్రశంసలు కురిపించింది.
  • గతంలో ప్రతిష్ఠాత్మక పులిట్జర్ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 'లూయీస్ గ్లక్' (LOUISE GLUCK) అనేక పురస్కారాలు పొందారు.

నోబెల్ పురస్కారాల వాయిదా :

  • సాహిత్య రంగంలో నోబెల్ ప్రదానం చేయడానికి ఎంపికలు చేసే అకాడమీపై 2018లో వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా ఆ ఏడాది పురస్కారాన్ని వాయిదా వేశారు. తర్వాత నోబెల్ ఫౌండేషన్ విశ్వాసాన్ని తిరిగి చూరగొనే స్థాయిలో అకాడమీని పూర్తిస్థాయిలో సంస్కరించారు.
  • 2018, 2019 సంవత్సరాలకు నోబెల్ పురస్కారాలను 2019లో ఒకేసారి ప్రకటించారు.
  • 2019 పురస్కారాన్ని ఆస్ట్రియా రచయిత 'పీటర్ హండ్కే' కు ఇవ్వడం మరో దుమారాన్ని రేపింది.


5. నోబెల్ శాంతి బహుమతి (NOBEL PEACE PRIZE) :

  • సంక్లిష్టమైన ప్రాంతాల్లో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి .. ప్రాణాలకు తెగించి .. అన్నార్తుల క్షుద్బాధను తీరుస్తున్న "ప్రపంచ ఆహార కార్యక్రమం" (WFP ⇒ World Food Programme) ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైంది.
  • అవార్డు కింద 1.1 లక్షల డాలర్ల నగదు, స్వర్ణ పతకం లభించనున్నాయి.
  • ఐక్యరాజ్య సమితికి చెందిన 'డబ్ల్యు ఎఫ్ పీ' (WFP ⇒ World Food Programme) .. రోమ్ కేంద్రంగా పని చేస్తోంది.
  • సాయుధ ఘర్షణలు, పెను సంక్షోభాలతో అతలాకుతలమైన దేశాల్లో ఆకలితో అలమటిస్తున్న అభాగ్యుల కడుపు నింపుతున్న కార్యక్రమమే "ప్రపంచ ఆహార కార్యక్రమం" (WFP ⇒ World Food Programme).
  • 'డబ్ల్యు ఎఫ్ పీ' (WFP ⇒ World Food Programme) కి 'డేవిడ్ బీస్లీ' నేతృత్వం (Executive Director) వహిస్తున్నారు.
  • 'డబ్ల్యు ఎఫ్ పీ' (WFP ⇒ World Food Programme) గత ఏడాది .. ప్రపంచవ్యాప్తంగా 88 దేశాల్లోని 10 కోట్ల మందికి సాయం అందించింది.

318 నామినేషన్లు (318 NOMINATIONS) :

  • ఈ దఫా నోబెల్ శాంతి పురస్కారం కోసం 211 మంది వ్యక్తులు, 107 సంస్థలు తరపున నామినేషన్లు వచ్చాయి. ఈసారి నోబెల్ శాంతి బహుమతి దక్కే అవకాశం ఉన్న సంస్థల్లో 'డబ్ల్యు ఎఫ్ పీ' (WFP ⇒ World Food Programme) ఉందని అంతర్జాతీయ మేథోమథన సంస్థ 'స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్' (SIPRI) అంచనా వేసింది.


6. ఆర్ధిక శాస్త్రం (ECONOMIC SCIENCE) :

  • "రాబర్ట్ బి విల్సన్, పౌల్ ఆర్ మిల్ గ్రోమ్" (అమెరికా) (ROBERT B. WILSON, PAUL R. MILGROM) (USA) లకు ఈ ఏడాది ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది.
  • వేలం సిద్ధాంతాన్ని (AUCTION THEORY) మరింతగా అభివృద్ధి చేయడం, కొత్త తరహా వేలం పద్ధతులు (AUCTION FORMATS) కనిపెట్టినందుకు ఈ పురస్కారాన్ని ఇస్తున్నట్లు 'రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్' (Royal Swedish Academy of Sciences) తెలిపింది.
  • రాబర్ట్ బి విల్సన్, పౌల్ ఆర్ మిల్ గ్రోమ్ లు గురు శిష్యుల్లాంటివారు. పౌల్ ఆర్ మిల్ గ్రోమ్ 'పీ హెచ్ డీ' (PhD) చేస్తున్నప్పుడు విల్సన్ ఆయనకు అడ్వైజర్ గా వ్యవహరించారు.
  • ఇద్దరూ ఒకే వీధిలో ఎదురెదురుగా ఉంటారు.

గమనిక (NOTE) :

  • ఈ ఏడాది మొత్తం 11 మందికి నోబెల్ పురస్కారాలు రాగా అందులో ఏడుగురు అమెరికా వాసులు కావడం గమనార్హం.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి