1. 'కరోనా' వైరస్ ను పారదోలడంలో కీలక పాత్ర పోషించిన "జసిండా ఆర్డెన్" (JACINDA ARDERN) భారీ మెజారిటీతో వరుసగా రెండోసారి ప్రధాన మంత్రి కాబోతున్న దేశం ? (ఈ దేశంలో 24 ఏళ్ల క్రితం దామాషా ఓటింగ్ పధ్ధతి ప్రవేశపెట్టిన తర్వాత ఓ పార్టీ (Labour Party) ఒంటరిగా అధికారంలోకి రావడం ఇదే తొలిసారి)
(ఎ) న్యూజీలాండ్
(బి) ఆస్ట్రేలియా
(సి) జర్మనీ
(డి) స్విట్జర్లాండ్
2. 'భారత ఎడిటర్స్ గిల్డ్' (Editors Guild of India) నూతన అధ్యక్షురాలిగా ఎన్నికైన "సీమా ముస్తఫా" (Seema Mustafa) ఏ పత్రికకు ఎడిటర్ గా ఉన్నారు ?
(ఎ) ది సిటిజన్ (The Citizen)
(బి) హార్డ్ న్యూస్ (Hardnews)
(సి) ది కారవాన్ (The Caravan)
(డి) అమర్ ఉజాలా (Amar Ujala)
3. తక్కువ కాలపరిమితితోపాటు తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే "ఇంద్రావతి (వీ ఆర్ - 1101)" వంగడాన్ని రూపొందించి 'విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానం' జాతీయస్థాయిలో ఖ్యాతిని దక్కించుకుంది. 'ఇంద్రావతి (వీ ఆర్ - 1101)' ఏ చిరుధాన్యానికి సంబంధించిన వంగడం ? (సూక్ష్మ పోషకాలు అధికంగా ఉన్న 17 రకాల వంగడాలను ప్రధాని 'నరేంద్ర మోదీ' రైతులకు అంకితం చేసారు. ఇందులో 'ఇంద్రావతి (వీ ఆర్ - 1101) వంగడానికి చోటు దక్కింది)
(ఎ) రాగి
(బి) సజ్జ
(సి) కొర్ర
(డి) సామ
4. తెలుగు దేశం పార్టీ (TDP) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ?
(ఎ) కళా వెంకట్రావు
(బి) నిమ్మకాయల చినరాజప్ప
(సి) కింజరాపు అచ్చెన్నాయుడు
(డి) ఎల్.రమణ
5. కాంగ్రెస్ అగ్రనేత 'రాహుల్ గాంధీ' (Rahul Gandhi) ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ నియోజకవర్గం ?
(ఎ) వయనాడ్
(బి) కోజికోడ్
(సి) తిరువనంతపురం
(డి) పాలక్కడ్
6. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 28 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 3న ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ప్రచారపర్వంలో భాగంగా ఆ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి 'ఇమర్తీ దేవి' ని "ఐటం" (ITEM) అని వ్యాఖ్యానించిన మాజీ ముఖ్యమంత్రి ?
(ఎ) దిగ్విజయ్ సింగ్
(బి) కమల్ నాథ్
(సి) బాబూలాల్ గౌర్
(డి) అరుణ్ యాదవ్
7. ఐపీల్ (IPL ⇒ Indian Premier League) టీ 20 క్రికెట్ టోర్నీలో వరుస మ్యాచుల్లో రెండు సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్ మన్ ?
(ఎ) వీరేంద్ర సెహ్వాగ్
(బి) శిఖర్ ధావన్
(సి) రోహిత్ శర్మ
(డి) విరాట్ కోహ్లి
8. కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన తొలి రాష్ట్రం ?
(ఎ) పశ్చిమ బెంగాల్
(బి) రాజస్థాన్
(సి) కేరళ
(డి) పంజాబ్
9. రిటైల్, ఎస్ఎంఈ రుణాలకు అధికంగా నిధుల లభ్యత ఉండడం కోసం ఆర్బీఐ (RBI) 'రెగ్యులేటరీ రిటైల్' (Regulatory Retail) పరిమితిని రూ. 5 కోట్ల నుంచి ఎంతకు పెంచింది ?
(ఎ) రూ. 5.5 కోట్లు
(బి) రూ. 6.5 కోట్లు
(సి) రూ. 7.5 కోట్లు
(డి) రూ. 8.5 కోట్లు
10. ఆర్బీఐ (RBI) పరపతి విధాన కమిటీలోని మొత్తం సభ్యుల సంఖ్య ?
(ఎ) 5
(బి) 6
(సి) 7
(డి) 8
కీ (GK TEST-75 DATE : 2020 OCTOBER 25)
1) ఎ 2) ఎ 3) ఎ 4) సి 5) ఎ 6) బి 7) బి 8) డి 9) సి 10) బి All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి