అటవీ హక్కు పత్రాల పంపిణీ
(Distribution of Recognition of Forest Rights Pattas)
- అడవి తల్లిని నమ్ముకుని అరకొర సంపాదనతో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న గిరిజనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కానుక ... పట్టా (RoFR ⇒ Recognition of Forest Rights).
కార్యక్రమం ప్రారంభం :
- 2020 అక్టోబర్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో, రాష్ట్ర జనాభాలో 6% ఉన్న గిరిజనులకు అటవీ భూములపై హక్కు కల్పించే (RoFR ⇒ Recognition of Forest Rights) పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని వర్చువల్ (Virtual) విధానంలో ప్రారంభించారు.
కార్యక్రమం లక్ష్యం :
- గిరిపుత్రులను సిరిపుత్రులుగా మార్చాలి అనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 'అటవీ హక్కు పత్రాల పంపిణీ' కార్యక్రమాన్ని చేపట్టింది.
కార్యక్రమం ప్రయోజనాలు :
- దాదాపు 1.53 లక్షల గిరిజన కుటుంబాలకు సుమారు 3.12 లక్షల ఎకరాల అటవీ భూములకు హక్కు పత్రాలు (RoFR) పంపిణీ చేస్తారు. ఎక్కడా భూ వివాదాలకు తావులేకుండా డిజిటైజేషన్ ద్వారా సర్వే నిర్వహించి సరిహద్దులు, గట్లు ఏర్పాటు చేస్తారు.
- పేద గిరిజనులందరికీ కనీసం రెండు ఎకరాల భూమిని కేటాయిస్తారు. భూమి కేటాయింపు పత్రాలు ఆ కుటుంబంలోని స్త్రీ పేరున జారీ చేస్తారు.
- ప్రభుత్వం ఇచ్చే పట్టాలు (RoFR) పొందిన గిరిజన రైతుల భూముల అభివృద్ధి, ఉద్యానవనాలు, తోటల పెంపకం, నీటి సదుపాయాల కల్పన తదితర అభివృద్ధి పనులకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తారు.
- అర్హత కలిగిన ప్రతి గిరిజన రైతు కుటుంబానికి "వైఎస్సార్ రైతు భరోసా" కింద ఏటా రూ. 11,500 (ఖరీఫ్ పంట కాలంలో రూ. 7,500 మరియు రబీ పంట కాలంలో రూ. 4,000) పెట్టుబడి సాయం అందజేస్తారు.
- మొత్తమ్మీద గిరిజనులకు అటవీ హక్కు పత్రాల పంపిణీ చేపట్టడం ఇది నాలుగోసారి.
- 'అక్టోబర్' మాసాన్ని హక్కు పత్రాల పంపిణీ నెలగా ప్రభుత్వం ప్రకటించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి