వైఎస్సార్ జలకళ (YSR JALAKALA)
- రైతులు బోరు వెయ్యడానికి పెట్టే ఖర్చులతో అప్పులపాలయ్యే పరిస్థితి రాకుండా, వారి పొలాలకు జలసిరులను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కానుక ... "వైఎస్సార్ జలకళ" పథకం.
పథకం ప్రారంభం :
- 2020 సెప్టెంబర్ 28న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో "వైఎస్సార్ జలకళ" (YSR JALAKALA) పథకాన్ని ప్రారంభించారు.
పథకం - విశేషాలు :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 4 ఏళ్లలో సుమారు రూ. 2,340 కోట్ల వ్యయంతో చిన్న, సన్నకారు రైతుల పొలాల్లో దాదాపు 2 లక్షల బోర్లు ఉచితంగా తవ్వించనున్నారు. బోర్లు తవ్వడమే కాకుండా ... వాటికి కేసింగ్ పైపులు కూడా ఏర్పాటు చేయిస్తారు. వాటికి ఉచితంగా మోటార్లు కూడా బిగిస్తారు. మోటార్ల బిగింపునకు అదనంగా దాదాపు రూ. 1,600 కోట్లు వ్యయమవుతుంది.
- ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి, ఆ అసెంబ్లీ నియోజకవర్గ అవసరాలకు గాను ఒక బోరు రిగ్గు ఏర్పాటు చేస్తారు. 144 గ్రామీణ, 19 సెమీ అర్బన్ నియోజకవర్గాల్లో 163 బోరు యంత్రాలు ప్రారంభిస్తారు.
- రైతులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ (www.ysrjalakala.ap.gov.in).ను ఏర్పాటు చేస్తారు.
- ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోలేనివారు వాలంటీర్ల సహకారంతో గ్రామ సచివాలయాలలో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
- హైడ్రో జియోలాజికల్ / జియోఫిజికల్ సర్వే ద్వారా శాస్త్రీయ పద్ధతిలో బోరు బావి తవ్వే స్పాట్ ను ఎంపిక చేస్తారు.
- సర్వే ఖర్చు, బోరు వేసే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది.
- "వైఎస్సార్ జలకళ" (YSR JALAKALA) ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు సాగులోకి రానున్నాయి.
- అవసరమైన ప్రతి రైతుకు ఉచితంగా ఒక బోరు వేస్తారు. ఒకవేళ ఆ బోరు ఫెయిలైతే మరొక బోరు వేస్తారు..
టోల్ ఫ్రీ :
- "వైఎస్సార్ జలకళ" (YSR JALAKALA) పథకానికి సంబంధించిన సలహాలు, ఫిర్యాదుల కొరకు 1902 టోల్ ఫ్రీ నంబర్ లో సంప్రదించవలెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి