1. మనదేశంలో తొలిసారిగా 'రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం' (RRTS) తో ఆధునిక రైలును ఏ మార్గంలో నడపనున్నారు ? (2025 నాటికి ప్రారంభమయ్యే ఈ కారిడార్ దిల్లీలోని 'లోటస్ టెంపుల్' (Lotus Temple)ను ఆధారంగా చేసుకుని నమూనాను రూపొందించారు)
(ఎ) దిల్లీ - పానిపట్
(బి) దిల్లీ - గురుగ్రామ్ - షాజహాన్పూర్
(సి) నిమ్రానా - బేరోర్ అర్బన్ కాంప్లెక్స్
(డి) దిల్లీ - మీరఠ్
2. 2020 సెప్టెంబర్ 25న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన 'ఆంధ్రప్రదేశ్ గేమింగ్ (సవరణ) ఆర్డినెన్సు-2020' ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆన్లైన్ లో 'రమ్మీ, పోకర్' వంటి జూద క్రీడలు ఆడిన వారికి విధించే జైలు శిక్ష ? (జూద క్రీడల నిర్వాహకులకు మొదటిసారైతే ఏడాది, రెండోసారి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారు)
(ఎ) 3 నెలలు
(బి) 6 నెలలు
(సి) 9 నెలలు
(డి) 12 నెలలు
3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన '2020-21 సంవత్సర నూతన మద్యం విధానం' ప్రకారం రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న మద్యం మాల్స్ పేరు ?
(ఎ) వాక్ ఇన్ షాప్స్ (Walk-in-Shops)
(బి) వాక్ ఇన్ మాల్స్ (Walk-in-Malls)
(సి) వాక్ ఇన్ బజార్స్ (Walk-in-Bazars)
(డి) వాక్ ఇన్ ట్రేడ్స్ (Walk-in-Trades)
4. బిహార్ రాష్ట్రంలో గల మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య ?
(ఎ) 241
(బి) 242
(సి) 243
(డి) 244
5. 42 దేశాల్లో సర్వే నిర్వహించిన 'యువ్ గప్' (YouGov) సంస్థ ప్రకటన ప్రకారం 'ప్రపంచంలోనే అత్యంత ఆరాధ్యులైన పురుషులు' జాబితాలో తొలి నాలుగు స్థానాలలో నిలిచిన వ్యక్తులు వరుసగా ... ?
(ఎ) బరాక్ ఒబామా, షి జిన్ పింగ్, బిల్ గేట్స్, నరేంద్ర మోదీ
(బి) బరాక్ ఒబామా, నరేంద్ర మోదీ, బిల్ గేట్స్, షి జిన్ పింగ్
(సి) బరాక్ ఒబామా, బిల్ గేట్స్, నరేంద్ర మోదీ, షి జిన్ పింగ్
(డి) బరాక్ ఒబామా, బిల్ గేట్స్, షి జిన్ పింగ్, నరేంద్ర మోదీ
6. ఏటీపీ ర్యాంకింగ్స్ (ATP Rankings) లో అత్యధిక వారాలపాటు (310 వారాలు) అగ్రస్థానంలో కొనసాగిన క్రీడాకారుడు ?
(ఎ) నొవాక్ జకోవిచ్
(బి) రోజర్ ఫెదరర్
(సి) రఫెల్ నాదల్
(డి) పీట్ సంప్రాస్
7. టైటిల్ ఫేవరెట్ గా బరిలో దిగి అనుకోకుండా లైన్ అంపైర్ ను గాయపర్చడంతో 'యుఎస్ ఓపెన్ - 2020' (US OPEN-2020) నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న టెన్నిస్ క్రీడాకారుడు ?
(ఎ) నొవాక్ జకోవిచ్
(బి) రోజర్ ఫెదరర్
(సి) రఫెల్ నాదల్
(డి) డొమినిక్ థీమ్
8. భారత మహిళా క్రికెట్ సెలక్షన్ కమిటీ నూతన చైర్మన్ ?
(ఎ) హేమలత కళ
(బి) నీతూ డేవిడ్
(సి) మిథు ముఖర్జీ
(డి) రేణు మార్గరెట్
9. ఈ సంవత్సరం జరిగిన మనదేశ గణతంత్ర దినోత్సవంలో భారత బలగాలను ముందుండి నడిపించి చరిత్ర సృష్టించిన మహిళ ?
(ఎ) శివాంగీ సింగ్
(బి) అవని చతుర్వేది
(సి) భావనా కాంత్
(డి) తానియా షెర్గిల్
10. భారతీయ రైల్వే పశ్చిమ బెంగాల్ లోని 'దుర్గాపూర్' నుంచి బండరాళ్ల రవాణా తొలి సరకును ఏ దేశానికి పంపుచున్నది ?
(ఎ) బంగ్లాదేశ్
(బి) భూటాన్
(సి) నేపాల్
(డి) మయన్మార్
కీ (GK TEST-70 DATE : 2020 SEPTEMBER 28)
1) డి 2) బి 3) ఎ 4) సి 5) డి 6) బి 7) ఎ 8) బి 9) డి 10) ఎ All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి