"వైఎస్సార్ సంపూర్ణ పోషణ" మరియు "వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్" పథకాలు
(YSR SAMPOORNA POSHANA and YSR SAMPOORNA POSHANA PLUS)
- అంగన్వాడీ (ANGANWADI)) కేంద్రాలలో నమోదైన గర్భవతులు, బాలింతలు, చిన్నారులకు సంపూర్ణ పోషణ అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం "వైఎస్సార్ సంపూర్ణ పోషణ" మరియు "వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్" పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది.
పథకం ఉద్దేశ్యం :
- "గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లల్లో పోషకాహారం లోపం వల్ల కలిగే రక్తహీనత, ఎదుగుదల లోపం, మాతాశిశు మరణాలు తదితర ఆరోగ్య సమస్యలను నివారించి సుసంపన్నమైన, ఆరోగ్యవంతమైన భావి భారత పౌరులను తీర్చిదిద్దడం" ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం.
పథకం ప్రారంభం :
- 2020 సెప్టెంబర్ 7న రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో "వైఎస్సార్ సంపూర్ణ పోషణ" మరియు "వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్" పథకాలను ప్రారంభించారు.
పథకం - కొన్ని విశేషతలు :
- 6 నెలల నుంచి 6 ఏళ్ల వయసున్న చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు ఈ పథకాలను అమలు చేస్తారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 55,607 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో మొత్తం 30,16,000 మందికి ఈ పథకాల వలన లబ్ది చేకూరుతుంది.
- ఈ పథకాల కోసం మొత్తమ్మీద రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,864 కోట్లు ఖర్చు చేయనుంది.
- ప్రస్తుత సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ... రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు : 53%, తక్కువ బరువుతో జన్మిస్తున్న శిశువులు : 31.9%, బరువుకు తగ్గ ఎత్తు లేని చిన్నారులు : 17.2%, వయసుకు తగ్గ ఎత్తులేని బాలబాలికలు : 32% ఉన్నారు. వీరందరికీ ఈ పథకాలవల్ల తప్పనిసరి ప్రయోజనం కలగనుంది.
I. వైఎస్సార్ సంపూర్ణ పోషణ (YSR SAMPOORNA POSHANA) :
- 'వైఎస్సార్ సంపూర్ణ పోషణ' ద్వారా మైదాన ప్రాంతాలలోని 47,287 అంగన్వాడీల పరిధిలో 26,36,000 మంది లబ్ధిదారులకు రూ. 1,555.56 కోట్లతో ప్రతిరోజు మధ్యాహ్న భోజనం, నెలవారీ పౌష్ఠికాహారం పంపిణీ చేస్తారు.
గర్భవతులు మరియు బాలింతలకు ప్రతి నెలా అందించే పోషకాహారం :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 5,80,000 మంది గర్భవతులు మరియు బాలింతలకు 'వైఎస్సార్ సంపూర్ణ పోషణ' పథకం ద్వారా ప్రతి నెలా ఈ క్రింది పోషకాహారం అందించనున్నారు.
- రాగి పిండి : 1 కేజీ
- బెల్లం : 250 గ్రాములు
- వేరుశెనగ చిక్కి : 250 గ్రాములు
- ఎండు ఖర్జూరం : 250 గ్రాములు
- సజ్జ/జొన్న పిండి : 1 కేజీ
- అటుకులు : 1 కేజీ
ప్రతి రోజూ అన్నము, పప్పు, ఆకుకూర, కూరగాయలతో సాంబారు, కోడిగ్రుడ్డు, 200 మి.లీ. పాలతో మధ్యాహ్న భోజనం అందిస్తారు.
6-36 నెలల పిల్లలకు ప్రతి నెలా అందించే పోషకాహారం :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13,50,000 మంది చిన్నారులకు 'వైఎస్సార్ సంపూర్ణ పోషణ' పథకం ద్వారా ప్రతి నెలా ఈ క్రింది పోషకాహారం అందించనున్నారు.
- బాలామృతం : 2.5 కేజీలు
- కోడి గ్రుడ్లు : 25
- పాలు : 2.5 లీటర్లు
36-72 నెలల పిల్లలకు ప్రతి నెలా అందించే పోషకాహారం :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 7,06,000 మంది పిల్లలకు 'వైఎస్సార్ సంపూర్ణ పోషణ' పథకం ద్వారా ప్రతి నెలా ఈ క్రింది పోషకాహారం అందించనున్నారు.
- ఉడికించిన శనగలు : ప్రతి రోజూ 20 గ్రాములు
- కోడి గ్రుడ్డు ప్రతి రోజూ 1
- పాలు ప్రతి రోజూ 100 మి.లీ.
ప్రతి రోజూ అన్నము, పప్పు, ఆకుకూర, కూరగాయల సాంబారుతో మధ్యాహ్న భోజనం అందిస్తారు.
II. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ (YSR SAMPOORNA POSHANA PLUS) :
'వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్' ద్వారా 77 గిరిజన మండలాల్లోని 8,320 అంగన్వాడీల పరిధిలో 3,80,000 మంది లబ్ధిదారులకు రూ. 307.55 కోట్లతో ప్రతి రోజూ మధ్యాహ్న భోజనం, నెలవారీ పౌష్ఠికాహారం పంపిణీ చేస్తారు.
గర్భవతులు మరియు బాలింతలకు ప్రతి నెలా అందించే పోషకాహారం :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 66,000 మంది గర్భవతులు మరియు బాలింతలకు 'వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్' పథకం ద్వారా ప్రతి నెలా ఈ క్రింది పోషకాహారం అందించనున్నారు.
- బెల్లం : 500 గ్రాములు
- వేరుశెనగ చిక్కి : 500 గ్రాములు
- ఎండు ఖర్జూరం : 500 గ్రాములు
- సజ్జ/జొన్న పిండి : 500 గ్రాములు
- మల్టీ గ్రైన్ ఆటా : 2 కేజీలు
ప్రతి రోజూ అన్నము, పప్పు, ఆకుకూర, కూరగాయలతో సాంబారు, కోడిగ్రుడ్డు, 200 మి.లీ. పాలతో మధ్యాహ్న భోజనం అందిస్తారు.
6-36 నెలల పిల్లలకు ప్రతి నెలా అందించే పోషకాహారం :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 1,64,000 మంది చిన్నారులకు 'వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్' పథకం ద్వారా ప్రతి నెలా ఈ క్రింది పోషకాహారం అందించనున్నారు.
- బాలామృతం : 2.5 కేజీలు
- కోడి గ్రుడ్లు : 30
- పాలు : 6 లీటర్లు
36-72 నెలల పిల్లలకు ప్రతి నెలా అందించే పోషకాహారం :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 1,50,000 మంది పిల్లలకు 'వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం ద్వారా ప్రతి నెలా ఈ క్రింది పోషకాహారం అందించనున్నారు.
- బాలామృతంతో చేసిన లడ్డు/కేక్ ప్రతి రోజూ 1 (50 గ్రాములు)
- కోడి గ్రుడ్డు ప్రతి రోజూ 1
- పాలు ప్రతి రోజూ 200 మి.లీ.
ప్రతి రోజూ అన్నము, పప్పు, ఆకుకూర, కూరగాయల సాంబారుతో మధ్యాహ్న భోజనం అందిస్తారు.
ఒక్కొక్క లబ్దిదారునిపై ప్రభుత్వానికయ్యే ఖర్చు :
- గిరిజన ప్రాంతాలలో గర్భవతులు, బాలింతలకు నెలకు 1100 రూపాయలు, 6-36 నెలల చిన్నారులకు 620 రూపాయలు, 36-72 నెలల పిల్లలకు 553 రూపాయల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
- మైదాన ప్రాంతాలలో గర్భవతులు, బాలింతలకు నెలకు 850 రూపాయలు, 6-36 నెలల చిన్నారులకు 412 రూపాయలు, 36-72 నెలల పిల్లలకు 350 రూపాయల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
టోల్ ఫ్రీ నంబరు :
అంగన్వాడీ సేవలు, ఫిర్యాదులు, సలహాల కొరకు 14408 టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి