1. 'సావిత్రిబాయి పూలే'ను మనదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా గుర్తించి, ఆమె జయంతి సందర్భంగా ఏటా ఏతేదీన "జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం"ను నిర్వహిస్తున్నారు ?
(ఎ) జనవరి 1
(బి) జనవరి 2
(సి) జనవరి 3
(డి) జనవరి 4
2. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నడుస్తున్న విద్యావిధానం ?
(ఎ) గురు కేంద్ర
(బి) శిశు కేంద్ర
(సి) విషయ కేంద్ర
(డి) సాంకేతిక కేంద్ర
3. వార్షిక ప్రపంచ ఓపెన్ ఆన్ లైన్ చెస్ టోర్నీ విజేతగా నిలిచిన భారత తొలి ఆటగాడు ?
(ఎ) ఇనియన్
(బి) సనన్
(సి) సెవియన్
(డి) నైజిక్
4. 1962లో చైనాతో యుద్ధం తర్వాత ఆదేశ జోరును కట్టడి చేయడానికి మనదేశం సిద్ధం చేసిన ఫోర్స్ ?
(ఎ) స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ (SFF)
(బి) సశస్త్ర సీమా బల్ (SSB)
(సి) భారత్-టిబెట్ సరిహద్దు పోలీస్ దళం (ITBP)
(డి) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)
5. డేటా గోప్యత, జాతీయ భద్రత కారణాలరీత్యా చైనా మూలాలున్న 'పబ్ జీ' (PUBG) సహా 118 యాప్ లను భారత్ నిషేధించిన తేదీ ?
(ఎ) 2020 సెప్టెంబర్ 1
(బి) 2020 సెప్టెంబర్ 2
(సి) 2020 సెప్టెంబర్ 3
(డి) 2020 సెప్టెంబర్ 4
6. ప్రస్తుతం చైనా కబ్జాలో ఉన్న 'ఫింగర్ 4' (FINGER 4) పర్వతాలు పాంగాంగ్ సరస్సుకు ఏ తీరంలో ఉన్నాయి ?
(ఎ) తూర్పు
(బి) పశ్చిమ
(సి) ఉత్తర
(డి) దక్షిణ
7. 'ఇస్రో' (ISRO) వచ్చే ఏడాది చేపట్టే చంద్రయాన్-3 కోసం భారీ బండరాళ్లు, గుంతలు, గడ్డకట్టిన మట్టితో ఉండే చంద్రుని ఉపరితలాన్ని పోలిన కృత్రిమ నిర్మాణాన్ని (Artificial Moon Craters) కర్ణాటక రాష్ట్రంలోని చెళ్లకెరె ప్రాంతంలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? (ఈ కృత్రిమ చంద్రుని ఉపరితల నిర్మాణం (Artificial Moon Craters) కోసం 'ఇస్రో' రూ. 24.2 లక్షలు ఖర్చు చేయనుంది)
(ఎ) సిద్దాపుర
(బి) ఉళ్లర్తి
(సి) నగరంగెరె
(డి) నన్నివళ
8. జపాన్ జాతీయ ఎన్నికల్లో 'షింజో అబే' మొత్తంగా ఎన్నిసార్లు విజయం సాధించారు ? (పెద్దప్రేగులో సమస్య కారణంగా ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్లు 'షింజో అబే' ఇటీవల ప్రకటించారు. జపాన్ లో దీర్ఘకాలం ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా 'షింజో అబే' రికార్డ్ సృష్టించారు)
(ఎ) 2
(బి) 4
(సి) 6
(డి) 8
9. కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని ఏ పంచాయతీ పరిధిలో 'ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ' (IALA - ఐలా) ఏర్పాటుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆమోదం తెలుపుతూ 2020 ఆగస్ట్ 28న ఉత్తర్వులిచ్చింది ?
(ఎ) బాహుబలేంద్రునిగూడెం
(బి) గోపవరపుగూడెం
(సి) వెంకటనరసింహపురం
(డి) వీరపనేనిగూడెం
10. 'ద బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో' (BBB ⇒ The Banks Board Bureau) సిఫారసు ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తదుపరి చైర్మన్ ?
(ఎ) ఎస్.ఎస్.మల్లికార్జునరావు
(బి) మృత్యుంజయ్ మహాపాత్ర
(సి) ఆదిత్యపురి
(డి) దినేష్ కుమార్ ఖారా
కీ (GK TEST-63 DATE : 2020 SEPTEMBER 6)
1) సి 2) బి 3) ఎ 4) ఎ 5) బి 6) సి 7) బి 8) సి 9) డి 10) డి
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి