1. రుమటాయిడ్ ఆర్థరైటిస్, జాయింట్ సెల్ ఆర్థరైటిస్ వ్యాధులు అదుపు చేయడానికి వినియోగించే ఔషధం 'టొసిలిజుమ్యాబ్' (TOCILIZUMAB) ను తయారు చేస్తున్న 'రోష్' (ROCHE) కంపెనీది ఏ దేశం ? (వాస్తవానికి ఈ సూది మందుకు 'అత్యవసర వినియోగ అనుమతి' మాత్రమే ఉంది. ఇంకా నిర్ధరణ కాని, ప్రయోగాల దశలో ఉన్న ఔషధం అయినా ఏమాత్రం వెనుకాడకుండా 'కొవిడ్-19' వ్యాధిగ్రస్తులకు (Covid-19 Patients) వినియోగిస్తున్నారు. దీనివల్ల దుష్ఫలితాలు కనిపించే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు)
(ఎ) ఆస్ట్రేలియా
(బి) స్వీడన్
(సి) స్పెయిన్
(డి) స్విట్జర్లాండ్
2. కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్యశాఖా మంత్రి పీయూష్ గోయల్ 2020 సెప్టెంబర్ 5న ప్రకటించిన 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-2019' (EODB-2019) ర్యాంకుల్లో తొలి నాలుగు స్థానాలలో నిలిచిన రాష్ట్రాలు ? (డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) ప్రతి సంవత్సరం కొన్ని నిబంధనలు (RULES) ఆధారంగా ర్యాంకులను విడుదల చేస్తుంది)
(ఎ) ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్
(బి) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్
(సి) ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ
(డి) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్
3. మనదేశ పురోగతిలో ప్రధాన అవరోధంగా నిలుస్తున్న పోషకాహార లోపాన్ని అరికట్టేందుకు 1982 నుంచి ఏటా ఏయే తేదీల మధ్య కేంద్ర ప్రభుత్వం 'జాతీయ పోషకాహార వారోత్సవాలు' ను నిర్వహిస్తోంది ?
(ఎ) సెప్టెంబర్ 1 - 7
(బి) సెప్టెంబర్ 8 - 14
(సి) సెప్టెంబర్ 15 - 21
(డి) సెప్టెంబర్ 22 - 28
4. భారత ప్రధాని 'నరేంద్ర మోదీ'కి సంబంధించి హ్యాకింగ్ కు గురైన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతా ? (ఈ ఖాతాను 25 లక్షల మంది అనుసరిస్తున్నారు)
(ఎ) పేస్ బుక్
(బి) ట్విటర్
(సి) ఇన్స్టాగ్రామ్
(డి) టంబ్లర్
5. విద్వేష ప్రసంగాలు, సందేశాల తొలగింపు విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటున్న సామాజిక మాధ్యమ దిగ్గజం 'ఫేస్ బుక్' (Facebook) ఏ భాజపా ఎమ్ ఎల్ ఏ (BJP MLA) సామాజిక ఖాతాపై నిషేధం విధించింది ?
(ఎ) హెచ్.రాజా (తమిళనాడు)
(బి) రవీందర్ రైనా (జమ్మూ కాశ్మీర్)
(సి) స్వామి అగ్నివేష్ (హరియాణ)
(డి) రాజా సింగ్ (తెలంగాణ)
6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'ఫిషరీస్ యూనివర్సిటీ' ని ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు ?
(ఎ) శ్రీకాకుళం
(బి) విశాఖపట్నం
(సి) తూర్పుగోదావరి
(డి) పశ్చిమగోదావరి
7. 'యునెస్కో' (UNESCO) ఏ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 5న "అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం"ను ప్రపంచమంతటా నిర్వహిస్తోంది ?
(ఎ) 1992
(బి) 1993
(సి) 1994
(డి) 1995
8. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం ? (గరిష్ఠ నీటి నిల్వ 215.807 టీఎంసీలు)
(ఎ) 875 అడుగులు
(బి) 880 అడుగులు
(సి) 885 అడుగులు
(డి) 890 అడుగులు
9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020 డిసెంబర్ 1 నుంచి ఇంటింటికీ రేషన్ బియ్యం సరఫరా కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువకులకు ప్రభుత్వం అందజేస్తున్న 9,260 వాహనాలపై ఎంత శాతం రాయితీ ఇవ్వనున్నారు ? (వాహనం ధరలో 10 శాతం లబ్ధిదారు సమకూర్చుకోవాలి)
(ఎ) 20%
(బి) 40%
(సి) 60%
(డి) 80%
(బి) 40%
(సి) 60%
(డి) 80%
10. ఈ సంవత్సరం యూఏఈ లో జరగనున్న 'ఐపీల్' క్రికెట్ టోర్నీ టైటిల్ స్పాన్సర్ షిప్ హక్కులను గెలుచుకున్న సంస్థ ? (ఈ ఒప్పందం టోర్నీ జరిగే 4 నెలల 13 రోజులకు మాత్రమే వర్తిస్తుంది)
(ఎ) డ్రీమ్ 11
(బి) బైజూస్
(సి) వివో
(డి) అన్ అకాడమీ
(ఎ) డ్రీమ్ 11
(బి) బైజూస్
(సి) వివో
(డి) అన్ అకాడమీ
కీ (GK TEST-64 DATE : 2020 SEPTEMBER 7)
1) డి 2) ఎ 3) ఎ 4) బి 5) డి 6) డి 7) సి 8) సి 9) సి 10) ఎ
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి