ఈ బ్లాగును సెర్చ్ చేయండి

20, సెప్టెంబర్ 2020, ఆదివారం

GK TEST-68

1. 'ఎ ప్రామిస్డ్ ల్యాండ్' (A PROMISED LAND) పుస్తక రచయిత ?
(ఎ) బరాక్ ఒబామా
(బి) మిషెల్ ఒబామా
(సి) డొనాల్డ్ జాన్ ట్రంప్
(డి) మెలానియా ట్రంప్

2. రక్షణ రంగంలో కొత్త పారిశ్రామిక లైసెన్సులు పొందే కంపెనీలకు 'ఆటోమేటిక్' (AUTOMATIC) మార్గంలో ఎంత శాతం వరకూ "విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి" (FDI ⇒ Foreign Direct Investment) ని కేంద్ర ప్రభుత్వం అనుమతించింది ? (ప్రస్తుత 'ఎఫ్ డీ ఐ' (FDI) విధానం ప్రకారం రక్షణ పరిశ్రమల్లో 100 శాతం 'ఎఫ్ డీ ఐ' (FDI) కి అనుమతి ఉంది. అయితే అందులో 'ఆటోమేటిక్' మార్గంలో 49 శాతం వరకే పెట్టుబడి పెట్టేందుకు ప్రస్తుతం అవకాశం ఉంది)
(ఎ) 49%
(బి) 51%
(సి) 74%
(డి) 100%

3. 'కొవిడ్-19' (COVID-19 ⇒ Corona Virus Disease-2019) నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించడంతో ఆర్ధిక వ్యవస్థ కుంటుపడి ఈ ఏడాది రూ. 2.35 లక్షల కోట్ల మేర 'జీఎస్టీ (GST) ఆదాయ నష్టం ఏర్పడనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 'జీఎస్టీ' వసూలు కాకపోవడంవల్ల ఏర్పడే నష్టం' మరియు 'విధి లిఖితమైన (ACT OF GOD) 'కరోనా' మహమ్మారి కారణంగా ఏర్పడిన నష్టం' వరుసగా ... ?
(ఎ) రూ. 99 వేల కోట్లు మరియు రూ. 1.36 లక్షల కోట్లు
(బి) రూ. 98 వేల కోట్లు మరియు రూ. 1.37 లక్షల కోట్లు
(సి) రూ. 97 వేల కోట్లు మరియు రూ. 1.38 లక్షల కోట్లు
(డి) రూ. 96 వేల కోట్లు మరియు రూ. 1.39 లక్షల కోట్లు



4. 'కరోనా' మహమ్మారి దెబ్బకు కుదేలై ఉపాధి లేక విలవిల్లాడుతున్న సన్న, చిన్నకారు రైతులు, రైతు కూలీల కుటుంబాలను ఆదుకునేందుకు 'మైక్రోసాఫ్ట్' (Microsoft) సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి 'అనుపమ' ఏ జిల్లాకు రూ. 2 కోట్ల సాయాన్ని అందించారు ? (2020 సెప్టెంబర్ 13న 'ఏ ఎఫ్ ఎకాలజీ కేంద్రం'లో "అదనపు జీవనోపాధుల పథకం"ను అనుపమ అందించిన నిధులతో లాంఛనంగా ప్రారంభించారు)
(ఎ) అనంతపురం
(బి) చిత్తూరు
(సి) కడప
(డి) నెల్లూరు

5. 'తుపాకీ హక్కులు కొనసాగించాలి, వలసలపై నియంత్రణలు ఉండాలి' అని వాదించే అమెరికాకు చెందిన సంప్రదాయవాద రాజకీయ పార్టీ ? (ఈ పార్టీని 'జీఓపీ' (GOP ⇒ Grand Old Party) అని కూడా పిలుస్తారు)
(ఎ) రిపబ్లికన్ పార్టీ
(బి) డెమోక్రాటిక్ పార్టీ
(సి) లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ
(డి) లేబర్ పార్టీ

6. 'అమెరికా' ఎలెక్టోరల్ కాలేజీలో ఉండే మొత్తం ఎలెక్టార్ల సంఖ్య ?
(ఎ) 535
(బి) 536
(సి) 537
(డి) 538



7. 'కరోనా' నేపథ్యంలో ఆర్ధిక పొదుపు చర్యల్లో భాగంగా మనదేశ ఎంపీల జీత భత్యాల్లో ఎంత శాతం మేర కోత విధించనున్నారు ?
(ఎ) 25%
(బి) 30%
(సి) 35%
(డి) 40%

8. మనదేశ కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్ట్ ను దక్కించుకున్న సంస్థ ? (ఈ సంస్థ దాఖలు చేసిన బిడ్ విలువ రూ. 861.90 కోట్లు)
(ఎ) ఎల్ & టీ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్
(బి) టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్
(సి) షాపూర్జీ పల్లోంజీ & కో లిమిటెడ్
(డి) గామన్ ఇండియా లిమిటెడ్

9. మనదేశంలో ఏ తేదీ నాటికి 'కరోనా' కేసుల సంఖ్య మొత్తమ్మీద అర కోటి (50 లక్షలు) దాటింది ? (దేశంలో తొలి 'కరోనా' కేసు 2020 జనవరి 30న నమోదైంది)
(ఎ) 2020 సెప్టెంబర్ 14
(బి) 2020 సెప్టెంబర్ 15
(సి) 2020 సెప్టెంబర్ 16
(డి) 2020 సెప్టెంబర్ 17



10. 'సెబీ' (SEBI ⇒ Securities and Exchange Board of India) తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, 'మల్టీ క్యాప్' తరగతికి చెందిన మ్యూచువల్ ఫండ్ పథకాలు తప్పనిసరిగా ఎంత శాతం నిధులను 'మిడ్, స్మాల్ క్యాప్' తరగతికి చెందిన షేర్లలో మదుపు చేయాలి ?
(ఎ) 25%
(బి) 30%
(సి) 35%
(డి) 40%
     
కీ (GK TEST-68 DATE : 2020 SEPTEMBER 20)
1) ఎ 2) సి 3) సి 4) ఎ 5) ఎ 6) డి 7) బి 8) బి 9) సి 10) ఎ

All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి