ఈ బ్లాగును సెర్చ్ చేయండి

1, సెప్టెంబర్ 2020, మంగళవారం

NATIONAL DIGITAL HEALTH MISSION

 నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ 

(NATIONAL DIGITAL HEALTH MISSION) - NDHM


  1. "నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్" (NDHM) ను భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' 2020 ఆగస్టు 15 న ప్రారంభించారు.
  2. "నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్" (NDHM) భారత వైద్య రంగంలో కొత్త విప్లవాన్ని సృష్టించబోతోంది.
  3. ఈ విధానంలో ప్రతి భారత పౌరుడికీ 14 అంకెల జాతీయ డిజిటల్ ఆరోగ్య గుర్తింపు సంఖ్య (ID)ను ఇస్తారు. ఇది ఆరోగ్య ఖాతాలా పనిచేస్తుంది.
  4. ఆరోగ్య పరీక్షలు, జబ్బులు, ఏ డాక్టర్ దగ్గరకు ఎప్పుడు వెళ్లారు, ఏ మందులు ఇచ్చారు, ఏ రిపోర్ట్ వచ్చింది అనే వివరాలన్నీ ఇందులో నిక్షిప్తమై ఉంటాయి.
  5. జాతీయ స్థాయిలో వైద్యులు, ఆస్పత్రుల వివరాల పట్టికను రూపొందిస్తారు.

  6. మున్ముందు 'టెలిమెడిసిన్ (Telemedicine), ఈ-ఫార్మసీ (e-Pharmacy)' సదుపాయాలు కూడా 'ఎన్ డీ హెచ్ ఎం' (NDHM) పరిధిలోకి వస్తాయి.
  7. 138 కోట్ల భారతీయుల ఆరోగ్య వివరాలను ఒకే జాతీయ సమాచార నిధి లో భద్రపరచడం వల్ల మున్ముందు 'కొవిడ్-19' (COVID-19) వంటి మహమ్మారులను వేగంగా అరికట్టడం వీలవుతుంది.
  8. జనబాహుళ్యంలో క్యాన్సర్, హుద్రోగం వంటి దీర్ఘకాల వ్యాధుల (Chronic Diseases) ఛాయలను ముందే పసిగట్టగలగడంతో చికిత్స ఖర్చులు తగ్గుతాయి.
  9. వైద్య పరిశోధనలు ఊపందుకోవడానికి, తద్వారా కొత్త మందులు, కొత్త చికిత్సలను కనుగొనడానికి ఈ డిజిటల్ సమాచార నిధి ప్రాతిపదికగా నిలుస్తుంది.
  10. శీఘ్రంగా, సమర్ధంగా ప్రజారోగ్య సేవలు అందించడం సులువు అవుతుంది.
  11. ప్రస్తుతం ఈ పథకాన్ని (NDHM) ఆరు (6) కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టారు.
  12. 'ఎన్ డీ హెచ్ ఎం' (NDHM) పూర్తి స్థాయిలో ప్రారంభం కాగానే సంబంధిత వెబ్ సైట్ (Website) లో 14 అంకెల డిజిటల్ ఆరోగ్య గుర్తింపు సంఖ్య (ఐడీ) ను పొందవచ్చు. ఇంత సుదీర్ఘ సంఖ్యను గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి, ఈమెయిల్ (e-mail) తరహాలో నచ్చిన ఐడీ, పాస్ వర్డ్ లను ఉపయోగించుకునే సౌకర్యం లభిస్తుంది. ఏదైనా ఆస్పత్రిలో కూడా ఈ డిజిటల్ ఐడీ (Digital ID) ని పొందవచ్చు.
  13. ఇక అన్ని ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలు 'ఎన్ డీ హెచ్ ఎం' (NDHM) కిందకు వస్తాయి.
  14. 'ఎన్ డీ హెచ్ ఎం' (NDHM) ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను, లాబొరేటరీలను, బీమా సంస్థలు, ఔషధ దుకాణాలు, టెలిమెడిసిన్ సేవలను సమన్వయపరుస్తుంది. ఇది ప్రైవేటు రంగానికి, వెంచర్ పెట్టుబడిదారులకు ఆకర్షణీయం కానుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి