భారత ఎన్నికల సంఘం-మార్గదర్శకాలు-కొవిడ్-19 మహమ్మారి
(ELECTION COMMISSION of INDIA-GUIDELINES-COVID-19 PANDEMIC)
- 'కరోనా' నేపథ్యంలో దేశంలో నిర్వహించే ఉప, సాధారణ ఎన్నికల కోసం 'కేంద్ర ఎన్నికల సంఘం' (ELECTION COMMISSION of INDIA) 2020 ఆగస్ట్ 21 న మార్గదర్శకాలు (Guidelines) జారీ చేసింది.
- అభ్యర్థులు, ప్రచారంలో పాల్గొనే వ్యక్తులు, పోలింగ్ అధికారులు పాటించాల్సిన నియమ నిబంధనలను వివరించింది.
- 'కరోనా' నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి 2020 జూలై 29 న కేంద్ర హోంశాఖ జారీచేసిన మార్గదర్శకాలు, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిబంధనలకు లోబడి తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.
పోటీ చేసే అభ్యర్థులు (CANDIDATES) :
- అభ్యర్థులు నామినేషన్ల కార్యక్రమానికి రెండుకి మించి వాహనాల్ని వినియోగించరాదు. ఇద్దరే హాజరు కావాలి.
- సెక్యూరిటీ డిపాజిట్ (Security deposit) ఆన్ లైన్ (Online) లో చెల్లించాలి.
- నామినేషన్ పత్రం, అఫిడవిట్ ను ఆన్ లైన్ (Online) లో భర్తీ చేసే ఐచ్చికాన్ని ఇచ్చారు. తర్వాత దాన్ని ప్రింటవుట్ (Printout) తీసుకుని నోటరీ (Notary) చేయించి రిటర్నింగ్ ఆఫీసర్ కు సమర్పించాలి.
- ఇంటింటి ప్రచారంలో అభ్యర్థి సహా ఐదుగురికి మించి పాల్గొనకూడదు.
- రోడ్ షోల్లో (Road Shows) భద్రతా సిబ్బంది వాహనం సహా 5 (FIVE) వాహనాలనే అనుమతిస్తారు. కొంత వ్యవధి తర్వాత మరో 5 వాహనాలు వెళ్లవచ్చు.
అధికారులు (OFFICERS) :
- జిల్లా అధికారులు ముందుగానే బహిరంగ సభల ప్రదేశాలను గుర్తించి వాటికి వేర్వేరు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు (Separate Entrance and Exit ways) ఏర్పాటు చేయాలి.
- సభా ప్రాంగణాల్లో భౌతిక దూరం పాటించేలా సూచీలు ఏర్పాటు చేయాలి.
- ఎన్నికల ప్రక్రియలో అవసరమైన అన్నిచోట్లా 'మాస్క్, శానిటైజర్, థర్మల్ స్కానర్లు, చేతి తొడుగులు, ఫేస్ షీల్డ్ లు, పీపీఈ కిట్లు (Mask, Sanitizer, Thermal Scanners, Hand Gloves, Face Shields, PPE Kits) ఉపయోగించాలి.
- ఇదివరకు ఒక పోలింగ్ బూత్ (Polling Booth) కు గరిష్ఠంగా 1500 ఓటర్లను కేటాయించేవారు. ఇప్పుడు గరిష్ఠంగా 1000 మంది ఓటర్లకు ఒక్కో పోలింగ్ బూత్ (Polling Booth) ఉండేలా చూస్తారు.
- పోలింగ్ కేంద్రాల వద్ద థర్మల్ స్క్రీన్ పరికరాలు అమర్చాలి.
- ఓటర్ల శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే అధికంగా ఉంటే వారికి టోకెన్లు (Tokens) జారీ చేసి పోలింగ్ ముగిసే చివరి గంటలో ఓటు వేసేందుకు అనుమతించాలి.
ఓటర్లు (VOTERS) :
- ఓటర్ రిజిస్టర్ (Voter Register) లో సంతకం చేసేందుకు, ఈవీఎం (EVM ⇒ Electronic Voting Machine) మీట నొక్కేందుకు గాను ఓటర్లందరికీ చేతి తొడుగులు అందజేస్తారు.
- 'కరోనా' ఉన్న ఓటర్లు, క్వారంటైన్ (QUARANTINE) లో ఉన్న వ్యక్తులను పోలింగ్ ముగిసే చివరి గంటలో ఓటింగ్ కు అనుమతిస్తారు. ఆ సమయంలో వైద్య అధికారుల పర్యవేక్షణ ఉంటుంది.
పోస్టల్ బ్యాలెట్లు (POSTAL BALLOTS) :
- వయోధికులు, దివ్యాంగులతో పాటు 'కరోనా' సోకిన, సోకిందన్న అనుమానంతో క్వారంటైన్ (QUARANTINE) లో ఉన్న వ్యక్తులకూ 'పోస్టల్ బ్యాలెట్' (Postal Ballot) సదుపాయం కల్పించనున్నారు.
- 'పోస్టల్ బ్యాలెట్' (Postal Ballot) సదుపాయాన్ని కోరుతున్న వ్యక్తులు అభ్యర్ధన పత్రాన్ని నింపాల్సి ఉంటుంది.
- అధికారులు బ్యాలెట్ పత్రాన్ని ఓటర్లు ఉంటున్న చోటుకే తీసుకొస్తారు. ఓటు వేసే ప్రక్రియను వీడియోలో చిత్రీకరిస్తారు.
నిబంధనల అమలుపై నిఘా :
- జిల్లాల్లో అధికారులు అన్నిచోట్లా 'కొవిడ్-19' (COVID-19) నియంత్రణ నిబంధనలు అమలు చేస్తున్నారా ? లేదా ? అని చూసేందుకు ప్రతి జిల్లాకు ఒక 'నోడల్ హెల్త్ ఆఫీసర్' (Nodal Health Officer) ను నియమిస్తారు.
- 'రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ' (SDMA ⇒ State Disaster Management Authority) నిర్దేశించిన సంఖ్య కంటే ఎక్కువ మంది గుమికూడకుండా జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.
- 'కొవిడ్-19' (COVID-19) నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా వారిపై 'ప్రకృతి వైపరీత్య నియంత్రణ చట్టం-2005' లోని సెక్షన్ 51-60 సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలి.
లెక్కింపు కేంద్రాలు (COUNTING CENTRES) :
- ప్రతి చోటా సాధ్యమైనంత పెద్ద హాళ్లను ఉపయోగించుకోవాలి.
- ఒక్కో లెక్కింపు కేంద్రంలో 7 టేబుళ్లకు మించి ఏర్పాటు చేయకూడదు. ఎక్కువ అవసరమైతే అదనంగా హాళ్లను తీసుకొని, సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది.
- అన్ని హాళ్లు, రూముల్లోకి ప్రవేశించే వారిని థర్మల్ స్క్రీనింగ్ చేసి చేతులు శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్, సబ్బు అందుబాటులో ఉంచాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి