ఈ బ్లాగును సెర్చ్ చేయండి

19, ఆగస్టు 2020, బుధవారం

GK TEST-59

1. "వైఎస్సార్ చేయూత" (YSR CHEYUTHA) పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన తేదీ ?
(ఎ) 2020 ఆగస్టు 10
(బి) 2020 ఆగస్టు 11
(సి) 2020 ఆగస్టు 12
(డి) 2020 ఆగస్టు 13

2. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయస్థాయిలో ఏటా ఇచ్చే పురస్కారాలలో 2020 ఏడాదికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి "గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక" విభాగంలో పురస్కారం పొందిన గ్రామం ?
(ఎ) చెల్లూరు (తూర్పుగోదావరి జిల్లా)
(బి) బొండపల్లి (విజయనగరం జిల్లా)
(సి) మూలస్థానం (తూర్పుగోదావరి జిల్లా)
(డి) జగ్గయ్యపేట (కృష్ణా జిల్లా)

3. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయస్థాయిలో ఏటా ఇచ్చే పురస్కారాలలో 2020 ఏడాదికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి "సాధారణ విభాగం" లో జిల్లాస్థాయి పురస్కారం పొందిన జిల్లా ?
(ఎ) తూర్పుగోదావరి
(బి) విజయనగరం
(సి) పశ్చిమగోదావరి
(డి) కృష్ణా

4. చెక్కు లావాదేవీల్లో మోసాలను అరికట్టేందుకు కొత్తగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా" (RBI) తీసుకురానున్న పధ్ధతి ? (ఈ పద్ధతిని రూ. 50,000 పైన ఉండే అన్ని చెక్కులకు వర్తింపచేయనున్నారు)
(ఎ) మొబైల్ పే
(బి) పాజిటివ్ పే
(సి) ఫోన్ పే
(డి) ఫోటో పే

5. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయస్థాయిలో ఏటా ఇచ్చే పురస్కారాలలో 2020 ఏడాదికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి "చైల్డ్ ఫ్రెండ్లీ అవార్డ్" పొందిన గ్రామం ?
(ఎ) చెల్లూరు (తూర్పుగోదావరి జిల్లా)
(బి) బొండపల్లి (విజయనగరం జిల్లా)
(సి) మూలస్థానం (తూర్పుగోదావరి జిల్లా)
(డి) జగ్గయ్యపేట (కృష్ణా జిల్లా)



6. 2020 ఆగష్టు 15 న అంతర్జాతీయ వన్డే క్రికెట్, టీ20లకు వీడ్కోలు పలికిన భారతీయ క్రికెటర్ 'మహేంద్ర సింగ్ ధోని' టీ20 క్రికెట్లో సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్ ? (అన్ని ఐసీసీ ప్రధాన టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్ 'మహేంద్ర సింగ్ ధోని'. ఉదా : 2007 ⇒ టీ20 ప్రపంచకప్, 2011 ⇒ వన్డే ప్రపంచకప్, 2013 ⇒ ఛాంపియన్స్ ట్రోఫీ)
(ఎ) 56
(బి) 57
(సి) 58
(డి) 59

7. 2020 ఆగస్టు 15 న జరిగిన 74వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' ప్రసంగిస్తూ ... "దేశంలోని 173 సరిహద్దు జిల్లాల్లోని యువత కోసం లక్షమంది కేడెట్లను (ONE LAKH CADETS) తయారు చేయడం ద్వారా ఎన్సీసీ (NCC ⇒ NATIONAL CADET CORPS) ని విస్తరిస్తాం" అని తెలియజేసారు. ఈ లక్షమంది కేడెట్లలో బాలికల వాటా ?
(ఎ) నాలుగింట ఒక వంతు (1/4)
(బి) నాలుగింట రెండు వంతులు (2/4)
(సి) మూడింట ఒక వంతు (1/3)
(డి) మూడింట రెండు వంతులు (2/3)

8. వచ్చే వెయ్యి రోజుల్లో (3 ఏళ్లలో) మనదేశంలోని సుమారు ఎన్ని గ్రామాలకు 'ఓ ఎఫ్ సీ' (OFC ⇒ OPTICAL FIBER CABLE) వేయాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ?
(ఎ) 5 లక్షలు
(బి) 6 లక్షలు
(సి) 7 లక్షలు
(డి) 8 లక్షలు

9. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి స్థాయీసంఘం సభ్యత్వానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో 192 మందిలో మొత్తం ఎంతమంది భారత్ కు మద్దతుగా నిలిచారు ?
(ఎ) 180
(బి) 182
(సి) 184
(డి) 186



10. కొవిడ్-19 (COVID-19) వ్యాధి నిర్ధారణ, చికిత్సకు సంబంధించి అందుబాటులో ఉన్న వసతులపై ప్రజలకు సమాచారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన హెల్ప్ లైన్ నెంబర్ ? (COVID-19 Andhra Pradesh State Helpline Number)
(ఎ) 8297104104
(బి) 8247899530
(సి) 8333817955
(డి) 8331821499    
 
 
 కీ (GK TEST-59 DATE : 2020 AUGUST 19)
1) సి 2) బి 3) సి 4) బి 5) సి 6) ఎ 7) సి 8) బి 9) సి 10) ఎ
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి