వైఎస్సార్ చేయూత (YSR CHEYUTHA)
పథకం ప్రారంభం :
- "వైఎస్సార్ చేయూత" పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' 2020 ఆగస్టు 12 న తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.
పథకం ప్రయోజనాలు :
- మహిళా సాధికారతే లక్ష్యంగా 45 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సు గల 'ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ' పేద మహిళలకు (సుమారు 23 లక్షల మంది) ఏటా రూ. 18,750/- చొప్పున నాలుగేళ్లలో రూ. 75,000/- ఆర్ధిక సాయం.
- "వైఎస్సార్ చేయూత" పథకం ద్వారా పొందే డబ్బు వాడడంలో మహిళలకు పూర్తి స్వేచ్ఛ. అంటే ఈ డబ్బులను జీవనోపాధి కార్యక్రమాలకు, చిన్న మధ్య తరహా వ్యాపారాలను నడుపుకోవడానికి లేదా మరే ఇతర అవసరానికైనా వినియోగించుకోవచ్చు.
- ప్రభుత్వం సూచించిన జీవనోపాధి పొందే మార్గాలపై ఈ డబ్బును వినియోగిస్తే, లబ్దిదారులైన మహిళల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు 'మార్కెటింగ్, సాంకేతికపరమైన సహకారాన్నీ, అదనపు బ్యాంకు రుణాలు" అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.
- సాంకేతిక, మార్కెటింగ్ సహకారాలు అందించేలా ఇప్పటికే 'అమూల్, ఐటీసీ, హెచ్ యూ ఎల్, పీ & జీ, రిలయన్స్' (AMUL, ITC, HUL, P & G, RELIANCE) లాంటి ప్రఖ్యాత,దిగ్గజ కంపెనీలతోపాటు బ్యాంకులతో కూడా ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది. దీనివల్ల లబ్దిదారులైన మహిళలకు వ్యాపార అవకాశాలు కలుగజేస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి