ఈ బ్లాగును సెర్చ్ చేయండి

30, ఆగస్టు 2020, ఆదివారం

GK TEST-61

1. జల విద్యుత్ కేంద్రాల్లో ప్రపంచంలోనే భారీ ప్రమాదం 2009 లో "సైనో షుషెన్స్ కయా" లో జరిగింది. ఈ జలవిద్యుత్తు కేంద్రం ఉన్న దేశం ? (ఈ ప్రమాదంలో 75 మంది ప్రాణాలు కోల్పోయారు)
(ఎ) జపాన్
(బి) చైనా
(సి) రష్యా
(డి) దక్షిణ కొరియా

2. దేశవ్యాప్తంగా కొవిడ్ మరణాల రేటు 1.9 శాతం కాగా అది ఆంధ్రప్రదేశ్ లో ఏవిధంగా ఉంది ?
(ఎ) 0.7 %
(బి) 0.8%
(సి) 0.9%
(డి) 1.0%

3. మనదేశ క్రీడా మంత్రిత్వ శాఖ ఈ సంవత్సరం ఏ క్రీడాకారులకు 'అర్జున' అవార్డులను ఇవ్వడానికి నిరాకరించింది ? (ఈ క్రీడాకారులు ఇంతకుముందే రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాలు పొందియున్నారు. అందువలన 'అర్జున' అవార్డులకు వీరి దరఖాస్తులను క్రీడా మంత్రిత్వ శాఖ తిరస్కరించడం జరిగింది)
(ఎ) రాణి రాంపాల్ (హాకీ), వినేస్ ఫొగాట్ (రెజ్లింగ్)
(బి) మనిక బాత్రా (టేబుల్ టెన్నిస్), తంగవేలు మరియప్పన్ (పారాలింపియన్)
(సి) ఉష (బాక్సింగ్), లఖా సింగ్ (బాక్సింగ్)
(డి) సాక్షి మలిక్ (రెజ్లింగ్), మీరాబాయ్ చాను (వెయిట్ లిఫ్టింగ్)

4. 2020 వ సంవత్సర జాతీయ క్రీడా పురస్కారాలలో ఎంతమందికి 'రాజీవ్ ఖేల్ రత్న' అవార్డులు ప్రకటించారు ?
(ఎ) 3
(బి) 5
(సి) 7
(డి) 9

5. కేంద్ర ప్రభుత్వం 2020 ఆగస్ట్ 21 న దేశవ్యాప్తంగా 47 మందికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రకటించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక టీచర్ ? (ఈ టీచర్ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం 'కాశీబుగ్గ' జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల (ZPHS) లో 'ఆంగ్లం' బోధిస్తుంటారు)
(ఎ) వుమ్మాజీ పద్మప్రియ
(బి) అసపాన మధుబాబు
(సి) గీతా కుమారి
(డి) సునీల్ కుమార్



6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కొవిడ్ ఆసుపత్రుల సంఖ్యను 138 నుంచి ఎంతకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' వెల్లడించారు ?
(ఎ) 285
(బి) 286
(సి) 287
(డి) 288

7. కేంద్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్ ? (ECI New Commissioner) (అశోక్ లవాసా రాజీనామాతో 2020 ఆగస్ట్ 31 నుంచి ఖాళీ అయ్యే స్థానంలో ఇతను నియమింపబడ్డారు)
(ఎ) రాజీవ్ గౌబ
(బి) రాజీవ్ కుమార్
(సి) రాజీవ్ రాయ్ భట్నాగర్
(డి) రాజీవ్ త్రివేది

8. 'కరోనా' నేపథ్యంలో దేశంలో నిర్వహించే ఉప, సాధారణ ఎన్నికల కోసం 'కేంద్ర ఎన్నికల సంఘం' (ECI ⇒ ELECTION COMMISSION OF INDIA) జారీ చేసిన నూతన మార్గదర్శకాల (New Guidelines) ప్రకారం ... గరిష్ఠంగా ఎంతమంది ఓటర్లకు ఒక్కో పోలింగ్ బూత్ (Polling Booth) ఉండేలా చూస్తారు ?
(ఎ) 500
(బి) 1000
(సి) 1500
(డి) 2000

9. ఏ ఎగుమతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యాన శాఖకు 'ఎగుమతుల ప్రోత్సాహక అవార్డు 2020' (Export Promotion Award-2020) లభించింది ?
(ఎ) కొబ్బరి
(బి) మామిడి
(సి) జీడిమామిడి
(డి) అరటి

10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన ప్రక్రియ కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నియమించిన రాష్ట్ర స్థాయి కమిటీకి సహకరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉపసంఘాలు ఎన్ని ?
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4

        
కీ (GK TEST-61 DATE : 2020 AUGUST 30)
1) సి 2) సి 3) డి 4) బి 5) బి 6) సి 7) బి 8) బి 9) డి 10) డి 


All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి