1. 2020 ఆగస్ట్ 8 న భారత 14వ "కాగ్" (CAG ⇒ COMPTROLLER and AUDITOR GENERAL) గా బాధ్యతలు స్వీకరించిన జమ్మూకశ్మీర్ తాజా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ ? (ఆయన ఈ పదవిలో ఆరేళ్లు కానీ, 65 ఏళ్ల వయస్సు వరకు కానీ ఉంటారు)
(ఎ) మనోజ్ సిన్హా
(బి) ఆర్.కే.మాథుర్
(సి) రంజన్ గొగోయ్
(డి) గిరీష్ చంద్ర ముర్ము
2. హలధారి బలరాముడి జయంతి అయిన 'హల షష్ఠి' ని పురస్కరించుకొని భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' రూ. లక్ష కోట్లతో "వ్యవసాయ మౌలిక వసతుల నిధి" ని ప్రారంభించిన తేదీ ? (ఈ నిధితో రైతులు తమ ఊర్లోనే ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగొచ్చు. ఈ నిధి ద్వారా పొందే రుణాలపై 3% వడ్డీ రాయితీ లభిస్తుంది)
(ఎ) 2020 ఆగస్ట్ 10
(బి) 2020 ఆగస్ట్ 9
(సి) 2020 ఆగస్ట్ 8
(డి) 2020 ఆగస్ట్ 7
3. గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చే వినతుల్ని గడువులోగా పరిష్కరించేలా పర్యవేక్షించేందుకు "పర్సుయేషన్ అండ్ మానిటరింగ్ యూనిట్" (PMU ⇒ PERSUASION and MONITORING UNIT) వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ సీఎం 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన తేదీ ? ('పీఎంయూ' (PMU) ద్వారా మొదట 4 సేవలపై పర్యవేక్షణ ఉంటుంది. అక్టోబరు నుంచి 543 సేవలను పర్యవేక్షిస్తారు)
(ఎ) 2020 ఆగష్టు 10
(బి) 2020 ఆగష్టు 11
(సి) 2020 ఆగష్టు 5
(డి) 2020 ఆగష్టు 1
4. ఫుల్ సెమిస్టర్ పద్ధతిలో 'బయాలజీ, ఇంజనీరింగ్' కలయికలా ఉండే "బయోమిమిక్రీ" (BIOMIMICRY) అనే కొత్త కోర్సును అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న ఐఐటీ ? (ఈ కోర్సులో చేరాలనుకునే వాళ్లు 9176612393 నంబరులో లేదా shiva@thinkpaperclip.com ఈ మెయిల్ ఐడీలో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు)
(ఎ) ఐఐటీ - ఖరగ్ పూర్
(బి) ఐఐటీ - బాంబే
(సి) ఐఐటీ - మద్రాస్
(డి) ఐఐటీ - కాన్పూర్
5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అస్తవ్యస్థంగా ఉన్న రెవెన్యూ రికార్డులను సరిచేయడానికి భూములను సర్వే చేయడానికి "కార్స్" (CORS ⇒ CONTINUALLY OPERATING REFERENCE STATION) సాంకేతికతతో ప్రయోగాత్మకంగా భూముల సర్వే నిర్వహించిన 'జగ్గయ్యపేట' మండలం ఏ జిల్లాలో ఉంది ?
(ఎ) కృష్ణా
(బి) గుంటూరు
(సి) తూర్పు గోదావరి
(డి) పశ్చిమ గోదావరి
6. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధానిపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 2014 మార్చి 28 న నియమించిన నిపుణుల కమిటీకి అధ్యక్షత వహించినది ?
(ఎ) జస్టిస్ శ్రీ కృష్ణ
(బి) షీలా భిడే
(సి) జస్టిస్ ధర్మాధికారి
(డి) శివరామకృష్ణన్
7. 'పోలవరం' ప్రాజెక్ట్ ను జాతీయ ప్రాజెక్ట్ గా కేంద్రం ప్రకటించిన తేదీ ?
(ఎ) 2014 ఏప్రిల్ 1
(బి) 2014 మే 1
(సి) 2014 జూన్ 1
(డి) 2014 జూలై 1
8. దిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ?
(ఎ) స్వాతి మలివాల్
(బి) యోగితా భయానా
(సి) లలిత టి. హెదావూ
(డి) రేఖా శర్మ
9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి 'మూడేళ్ల డిగ్రీ' లో ఉండే అప్రెంటిస్ షిప్ సమయం ? (అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాలలు 2020 అక్టోబరు 15 న తెరవనున్నారు)
(ఎ) 5 నెలలు
(బి) 10 నెలలు
(సి) 15 నెలలు
(డి) 20 నెలలు
10. ఏ సంవత్సరం నాటికి దశలవారీగా 101 రకాల ఆయుధాలు, పోరాట వ్యవస్థల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు భారత రక్షణ శాఖ మంత్రి 'రాజ్ నాథ్ సింగ్' 2020 ఆగష్టు 9 న ప్రకటించారు ?
(ఎ) 2022
(బి) 2023
(సి) 2024
(డి) 2025
కీ (GK TEST-57 DATE : 2020 AUGUST 12)
1) డి 2) బి 3) ఎ 4) సి 5) ఎ 6) డి 7) ఎ 8) ఎ 9) బి 10) సి All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి